top of page
Original.png

పోలాల అమావాస్య – పోలాంబా వ్రతం


పోలాల అమావాస్య సందర్భంగా కంద మొక్క, పసుపు గౌరమ్మ, దీపాలు, పూలు, పండ్లు, నైవేద్యాలతో సంప్రదాయ పోలాంబ వ్రతం పూజ చేస్తున్న తెలుగు మహిళ

Polala Amavasya - Polamba Vratham -  Telugu Devotional Article | Nayana kasthuri

పోలాల అమావాస్య – పోలాంబా వ్రతం తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | నయన కస్తూరి

Published in manatelugukathalu.com on 06/09/2026



మన అమ్మమ్మల కాలంలో భక్తిశ్రద్ధలతో జరుపుకున్న ‘పోలాల అమావాస్య’ గురించి నేటి తరానికి ఎంతవరకు తెలుసు?


పోలాంబ వ్రతం విశిష్టత నుంచి కంద మొక్క పూజ, నైవేద్యాలు, పూజా విధానం వరకు తెలుసుకుందాం.


“భారత దేశం గ్రామాలలో నివసిస్తుంది” అన్నారు మహానుభావులు. ఇప్పుడు ఎక్కడ ఏ పట్టణంలో నివసిస్తున్నా, మన మూలాలు గ్రామ సీమల్లోనే! మన చిన్నతనం ఎంతో కొంత గ్రామ సంస్కృతిలోనే గడిచి ఉండవచ్చు. ఆనాటి వేడుకలు, పండగలు, ముచ్చట్లు కాల పరిణామంతో క్రమేపి మరుగున పడిపోతున్నాయి. 


అలాంటి ముఖ్యమైన వేడుకలలో గ్రామ దేవతల పండుగలు ఒకటి. మరుగున పడుతున్న ‘పోలాల అమావాస్య – పోలాంబా వ్రతం’ అనే శ్రావణ మాసపు పండుగను అందరం గుర్తుకు తెచ్చుకుందాము. మరి ఈ వ్యాసం చదివి, సెప్టెంబర్‌లో వచ్చే ఈ పండుగను మనకు కుదిరిన విధంగా జరుపుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకుందాము.


మొదట్లో మనకు ఎన్నో పర్వదినాలు, పండుగలు ఉండేవి. అవన్నీ మన సంస్కృతికి, సంప్రదాయాలకి అద్దం పట్టేవిగా ఉండేవి. అప్పట్లో చాలా పండుగలను ఊరు ఊరంతా కలిసి చేసుకునేవారు. ఇప్పుడు ముఖ్యమైన పండుగలకి కూడా కుటుంబంలోని సభ్యులు కలవడమే గగనమైపోతోంది. 


మన అమ్మమ్మలు చేసుకున్న పండగలలో కొన్నింటిని ఈ హడావిడి జీవనంలో పడి మనం ఇప్పటికే వదిలేశాము. దానివలన పాపం మన పిల్లలకి మన పండుగలలో చాలా పండుగల విశిష్టత మాట పక్కకు పెడితే, పేర్లు కూడా తెలియదు అంటే అతిశయోక్తి కాదు.


అలా మన పిల్లలతో పాటు మనలో చాలామంది విస్మరిస్తున్న పండగలలో ఒక పండగ ప్రతి శ్రావణ మాసంలో అమావాస్య రోజు చేసుకునే ఎంతో ముఖ్యమైన పండుగ. ఆ పండుగ పేరు మీలో ఎవరైనా చెప్పగలరా? అదేనండీ 'పోలాల అమావాస్య' పండుగ. 


దీనినే 'పోలాంబ వ్రతం' లేక ‘కంద గౌరీ వ్రతము’ అని కూడా అంటారు. ఈ వ్రతం, తల్లి అయిన ప్రతి స్త్రీ తప్పక ఆచరించవలసిన వ్రతము. సంతానం ఆయురారోగ్యాలతో వర్ధిల్లడానికి ఆచరించతగ్గది ఈ వ్రతం.


మనము, మన సంతానం ఆయురారోగ్యాలతో ఉండటానికి కారణం మన గ్రామ దేవతల కరుణా కటాక్షాలే! అందుకే మన పెద్దలు గ్రామ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పండుగల రూపాలలో ఎన్నో అవకాశాలు కల్పించారు. మరి అటువంటి గ్రామదేవతలలో పోలేరమ్మ ఒక ముఖ్యమైన దేవత. మరి ఇంకెందుకు ఆలస్యము? 

ఈ సంవత్సరము సెప్టెంబర్ 11వ తారీఖున వచ్చే 'పొలాల అమావాస్య' భక్తి శ్రద్ధలతో జరుపుకుని, అమ్మవారుగా కొలవబడే పోలేరమ్మ వారిని పూజించుకుందాం.


“అది సరే కాని ఎలా జరుపుకోవాలో అసలు తెలియదే!” అని కంగారు పడుతున్నారా? అందుకే కదండీ నేనిప్పుడు మీ ముందుకు వచ్చింది! పొలాల అమావాస్య ముందు రోజు ఒక కంద మొక్క కాని, కంద పిలక కాని తెచ్చుకోండి. 


మిగతా పూజ సామాను అంతా మనకు తెలిసినదే! పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరికాయ ఒకటి, పసుపు కొమ్ములు రెండు, అరడజను అరటిపళ్ళు సిద్ధం చేసుకోవాలి.


పొలాల అమావాస్య రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి కంద మొక్కని కాని, కంద పిలకను కాని పూజా మందిరంలో పెట్టుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు వినాయకుని, పసుపు గౌరమ్మని చేసుకుని తమలపాకుల్లో కంద మొక్కకు దగ్గరగా పెట్టుకోవాలి. 


నైవేద్యానికి పళ్ళు, కొబ్బరికాయతో పాటు అమ్మవారికి వడపప్పు, పానకం, చలిమిడి, ఆడ సంతానం కలవారు గారెలు, మగ సంతానం కలవారు బూరెలు సిద్ధం చేసుకోవాలి. ఇద్దరూ ఉన్నవారు రెండూ సిద్ధం చేసుకోవాలి. రెండు దారం పోగులకు పసుపు రాసి పసుపు కొమ్ములు కట్టి ఉంచుకోవాలి. ఈ వ్రత కథ ప్రతి స్త్రీల వ్రత కథల పుస్తకంలో కనిపిస్తుంది. ఆ పుస్తకం కూడా దగ్గర పెట్టుకోండి.


ఇక పూజా విధానం ఇతర పూజల లాగానే. ముందుగా ఆచమనం చేసుకుని, సంకల్పం చెప్పుకుని, గణపతి పూజ చేసుకుని అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. పసుపు అమ్మవారిని, కంద మొక్క లేక కంద పిలకని, కుంకుమతో, పుష్పాలతో పూజించి, దీప, ధూప, నైవేద్యాలు సమర్పించి, అక్షతలు చేత పట్టుకుని, వ్రత కథ చదువుకుని, కొన్ని అక్షతలు అమ్మవారి మీద, కొన్ని కుటుంబ సభ్యుల అందరి మీద జల్లుకోవాలి. పసుపు కొమ్ము కట్టిన ఒక దారం అమ్మవారి దగ్గర ఉంచి, ఇంకో దారం పూజ చేసిన స్త్రీ మెడలో కట్టుకోవాలి. తీర్థ ప్రసాదాలు భక్తితో స్వీకరించాలి.


ఇంతేనండీ పొలాల అమావాస్య వ్రతం అంటే! ఈ సంవత్సరం సెప్టెంబర్ 11 2026 న వస్తుంది ఈ పండుగ. పద్ధతి తప్పినా భక్తి తప్పకూడదండీ! భక్తి శ్రద్ధలతో చేసుకుని అమ్మవారి దయకు పాత్రులై, పిల్ల పాపలతో వందేళ్లు చల్లగా ఉండండి!



***

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


నయన కస్తూరి గారి కొన్ని ఇతర రచనలు:



నయన కస్తూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


నయన కస్తూరి

రచయిత పరిచయం: నయన కస్తూరి

నా పేరు నయనతార కస్తూరి. నా విద్యార్హత M A English Lit. Med. తెలుగు, ఇంగ్లీష్  హిందీ భాషలంటే ఎంతో అభిమానం. కధలు వ్యాసాలు, ఆధ్యాత్మిక  విషయాలు  రచించుట నా హాబీ. నేను రచించిన కొన్ని కధలు మాస వార పత్రికలలో ప్రచురింప బడినవి..మేము హైదరాబాద్ వాస్తవ్యులము.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page