top of page
Original.png

అంతర్మథనం

అంతర్మథనం, నయన కస్తూరి, తెలుగు కథ, భావోద్వేగ కథ, emotional Telugu story, house memories story, family values Telugu, inspirational Telugu story, Telugu literature, sentimental story, home and memories, Telugu short story, life lessons, family emotions, వేదపాఠశాల కథ, హృదయస్పర్శి కథ

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'అంతర్మథనం' కథలో యజమానులను కోల్పోయి ఒంటరితనంలో మునిగిపోయిన ఒక పాత ఇల్లు, తరువాత వేదపాఠశాలగా మారి కొత్త జీవితం పొందిన దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'అంతర్మథనం' కథలో యజమానులను కోల్పోయి ఒంటరితనంలో మునిగిపోయిన ఒక పాత ఇల్లు, తరువాత వేదపాఠశాలగా మారి కొత్త జీవితం పొందిన దృశ్యం.

Antarmadhanam - Telugu Emotional Story | Nayana kasthuri

అంతర్మథనం తెలుగు భావోద్వేగ కథ | నయన కస్తూరి

Published in manatelugukathalu.com on 18/06/2026


ఇల్లు అనేది కేవలం ఇటుకలు, సిమెంట్‌తో నిర్మించిన భవనం కాదు. అది కుటుంబ జ్ఞాపకాలకు, ఆనందాలకు, కన్నీళ్లకు సాక్ష్యం. "అంతర్మథనం" కథలో నయన కస్తూరి ఒక ఇంటికే ప్రాణం పోసి, దాని భావోద్వేగాలను అద్భుతంగా చిత్రించారు. రంగారావు దంపతుల జీవిత ప్రయాణానికి తోడుగా నిలిచిన అరవయ్యో నంబర్ ఇల్లు, వారిని కోల్పోయిన తర్వాత అనుభవించిన ఒంటరితనం, ఆవేదన, ఎదురుచూపులను హృదయానికి హత్తుకునేలా చెప్పిన ఈ కథ చివర్లో మానవతా విలువలతో నిండిన సందేశాన్ని అందిస్తుంది.


అది హైదరాబాదు నగరంలోని ఒక బ్యాంక్ కాలనీలోని అరవయ్యో నంబర్ ఇల్లు. అది కస్తూరి రంగారావుగారి ఇల్లు. ఆ ఇంటి వయసు ఏభై సంవత్సరాలు. రంగారావుగారు ఎంతో కష్టపడి ఆ ఇల్లు కట్టించారు. ఆ ఇంటిలోని ప్రతీ అంగుళం భార్యకి, పిల్లలకి నచ్చేటట్లు కట్టించారు. దానికోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చినా వెనక్కి తగ్గలేదు. అందరికీ అన్ని సదుపాయాలూ ఉండేలా చూశారు.


రంగారావుగారి ప్రతీ బాధ్యతలోనూ వారి అరవయ్యో నంబర్ ఇల్లు సహకరిస్తూనే ఉంది. వారి పిల్లల బారసాలలు, అన్నప్రాసనల దగ్గర్నుండి వివాహాల వరకు పక్కన నిలబడి ఆ ఇల్లు జరిపించింది. రంగారావు దంపతులు వేసిన పూల మొక్కలు, కొబ్బరి, మామిడి, జామ, సపోటా చెట్లను పెంచి, పోషించి, పెద్దచేసింది. తినడానికి ఎన్నో కాయలు, పళ్ళు ఇచ్చింది.

 

పిల్లల చదువులు విజయవంతంగా ముగిసాయి. పెద్దపెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రతీ విజయాన్ని రంగారావుగారు అయిన వాళ్ళను, బంధువులను ఇంటికి పిలిచి ఎంతో సంబరంగా చేసేవారు. ముగ్గురి వివాహాల వేడుకలు ఘనంగా తన ఇంట్లోనే చేశారు. ఆ ఇల్లు సాక్షిగా బంధుమిత్రులతో కలిసి తరచూ వేడుకలు చేసుకుంటూ ఉండేవారు. ఆ ఇల్లు కూడా వారితో కలిసి ఎన్నో పండుగలు, వేడుకలు చేసుకుంది. వారితో పాటు కలిసి ఆడింది, పాడింది. మనవలను కూడా ఆ ఇల్లు చూసింది. రంగారావు, రాఘవమ్మ దంపతులు ఆ ఇంటిని పెద్దకొడుకులా భావించేవారు. 


ఉద్యోగరీత్యా పిల్లలు తమను వదిలి దూరాలకు వెళ్ళిపోయినప్పుడు వారికి కలిగే కష్టసుఖాలను తమ ఇంటితోటే పంచుకునేవారు. వారు నవ్వితే వారి ఇల్లు నవ్వేది, వారు బాధపడితే బాధపడేది. పిల్లలు ఒకళ్ళతర్వాత ఒకళ్ళు ఇంటిని వదిలి వెళ్ళవలసి వచ్చినప్పుడు సందడి తగ్గిపోసాగింది. పిల్లల రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇంటిలోనూ ఆటపాటలు తగ్గిపోయి, నిశ్శబ్దం ఆవరించింది. 


రంగారావుగారికి, రాఘవమ్మగారికి వయసు పైబడటంతో ఆరోగ్యం క్షీణించసాగింది. "ఏవండీ, మీరు బొత్తిగా పాడైపోయినట్టున్నారు. పిల్లల దగ్గరికి పోయి ఉందామండీ!" తన కోరిక వెలిబుచ్చింది భార్య. ఆ మాట చెవిన పడిన ఇల్లు ఒక్కసారిగా దిగాలు పడి, రంగారావుగారి సమాధానం కోసం ఎదురుచూడసాగింది. "మన ఇల్లుని వదిలి ఎలా వెళ్తాం రాఘవా?" నిరాకరించారు రంగారావుగారు.


"అదికాదండీ, మనమే చూస్తే పెద్దవాళ్ళం అయిపోతున్నాము. పిల్లలేమో వాళ్ళ కుటుంబాలను వదిలి రాలేరు. మరిక ఏమి చెయ్యాలి?" భార్య ఆవేదన.


"చూద్దాములేవే, ఓసారి పిల్లలను రమ్మని మాట్లాడదాము." భర్త వాయిదా వేసే ప్రయత్నం.


"అయ్యో, ఉన్న వీళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతే నేను పూర్తిగా ఒంటరినైపోతానే!" ఇల్లు అంతర్వేదన. "అంత సందడిగా ఉండే నేను ఇలా నిశ్శబ్దంగా అయిపోయానే!" అనుకుంటూ లోలోపల మథనపడసాగింది.


కొంతకాలం గడిచింది. వయోభారంతో భార్యాభర్తలిద్దరూ కాలం చేశారు. వారి సంతానం కన్నా వారు ఇంతకాలం నివసించిన ఇల్లు ఎక్కువగా రోదించింది. సంబంధీకులంతా వచ్చి పదమూడు రోజుల కార్యక్రమాలు కానిచ్చుకుని ఇంటికి తాళాలు బిగించుకుని వెళ్ళిపోయారు.


అరవయ్యో నంబర్ ఇల్లు ఒంటరిగా లోపల ఉండిపోయి, తలుపులు తెరవక, దేవుడి దగ్గర కూడా ఒక దీపమైనా లేక మథనపడసాగింది. ఏదైనా కొంచెం చప్పుడైతే చాలు, ఎవరైనా వస్తున్నారేమో అని సంబరపడేది. ఒక్కరూ వచ్చేవారు కాదు. మళ్ళీ రంగారావుగారి సంతతి ఎవరైనా వచ్చి తనతో కలిసి పండుగలు, పబ్బాలు జరుపుకుంటారేమో అని, తన అంతర్మథనాన్ని అంతం చేయగలరేమో అనే ఆశతో ఎదురుచూస్తోంది.


ఒకరోజు తాళాలు తీసిన చప్పుడు. తలుపులు తెరుచుకున్నాయి.

చల్లని చిరుగాలి లోపలికి చొచ్చుకుని వచ్చి ఇంటిని ఆహ్లాదపరిచింది. రంగారావుగారి కూతురు కొంతమంది పెద్దమనుషులతో వచ్చింది. వీళ్ళను చూసి ఇరుగుపొరుగు వాళ్ళు కూడా వచ్చారు. "ఏవమ్మా సుశీలా! మీ వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఏమిటి విశేషం ఇలా వచ్చావు?" అని అడిగారు.


"ఏమీలేదు అంకుల్! ఈయన మా మామయ్యగారి ఫ్రెండ్ సత్యనారాయణ గారు. ఇక్కడ నాన్న వాళ్ళ ఇల్లు ఊరికే ఉండి పాడుపడిపోతోంది కదా? వాళ్ళు ఉచితంగా పిల్లలకి వేదపాఠశాల నడుపుతారుట. ఇక్కడ మన ఇంట్లో పెడదామని చూడటానికి వచ్చారు. అన్నయ్య వాళ్ళు వచ్చే వారం వచ్చి, అంతా క్లీన్ చేయించి, వచ్చే నెలకి ఇస్తారు" అని చెప్పగా,

"మంచిదమ్మా మంచిది. మీ నాన్న ఎంతో కష్టపడి కట్టించాడు. మీరంతా ఇక్కడే పెరిగి మంచిగా పైకొచ్చారు. దీపం లేకుండా ఇంటిని అలా పాడుపెట్టడం మంచిది కాదు. ఇంట్లో వేదపారాయణం, హోమాలు జరుగుతుంటే మీ కుటుంబానికి అంతకంటే మంచిది. నేర్చుకునే పిల్లలకి మంచిది. ఈ ఊరికి మంచిది" అని తమ సంతోషం వెలిబుచ్చారు.


"అవునవును, నా అంతర్మథనం కూడా అంతరించింది. వేదపారాయణతో సర్వే జనా సుఖినోభవంతు!" అని బలపరిచింది అరవయ్యో నంబర్ ఇల్లు.


***

నయన కస్తూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: నయన కస్తూరి

నా పేరు నయనతార కస్తూరి. నా విద్యార్హత M A English Lit. Med. తెలుగు, ఇంగ్లీష్  హిందీ భాషలంటే ఎంతో అభిమానం. కధలు వ్యాసాలు, ఆధ్యాత్మిక  విషయాలు  రచించుట నా హాబీ. నేను రచించిన కొన్ని కధలు మాస వార పత్రికలలో ప్రచురింప బడినవి..మేము హైదరాబాద్ వాస్తవ్యులము.

10 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

చాలా బాగుంది రచన. పిల్లలు రెక్కలు వచ్చి దూర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు, తల్లిదండ్రులు పెద్దవాళ్లు అయిపోయిన తరువాత అందరి ఇళ్లు అలాగే మూత పడి ఉంటాయి .తరువాత అమ్ముతారు. ఆ జ్ఞాపకాలు, అవి పిల్లలకు undakapovachu ఒకవేళ ఉన్నా ఏమీ చేయ లేరు.

Like

Rated 5 out of 5 stars.

It is well written and very nice concept

Like

Rated 5 out of 5 stars.

Very insightful content andi !


Like

Rated 5 out of 5 stars.

అన్ని సజీవాలకి మనస్సు ఉన్నట్టే ఇళ్ళకి కూడా హృదయం ఉంటే, ఎలా ఉంటుంది అన్న వినూత్న ఆలోచనతో మీరు ఈ కథ రాసినందుకు మీకు జోహార్లు. ఇళ్లు ఎడాపెడా కొని, అమ్మేసే వాళ్ళు ఈ కథ చదివితే ఈ సారి వాళ్ళ ఇళ్ళు అమ్మకానికి పెట్టినప్పుడు అంతో ఇంతో సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యి, ఒకటికి రెండు సార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం. వారికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ భగవంతుడిని మనసారా వేసుకుందాం.

Like

Rated 5 out of 5 stars.

Congratulations, Madam!! Your narration on how a house feel if it were having emotions, human sentimentes and feelings - is excellenat !! Please keep writing.👍

Like
bottom of page