top of page
Original.png

గబ్బు డబ్బు


“గబ్బు డబ్బు” తెలుగు వ్యంగ్య రచనకు సంబంధించిన చిత్రం. ఒకవైపు డబ్బును జాగ్రత్తగా దాచుకుంటున్న వ్యక్తి, మరోవైపు కుటుంబం, స్నేహితులతో చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదిస్తున్న అదే వ్యక్తి కనిపిస్తాడు. మధ్యలో పొదుపు, కుటుంబం, సమయం, ఆనందాన్ని సమతుల్యం చేసే త్రాసు మరియు తగ్గిపోతున్న కాలాన్ని సూచించే hourglass ద్వారా డబ్బు దాచుకోవడంతో పాటు జీవితాన్ని కూడా ఆస్వాదించాలనే భావాన్ని చూపించారు.

Gabbu Dabbu Telugu Inspirational Article | Kotha Viritha

గబ్బు డబ్బు - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Published in manatelugukathalu.com on 05/09/2026



“ఆ డబ్బు దాచుకోవచ్చుగా!” — కొత్త ఫోన్ కొన్నా, బయట తిన్నా, కొత్త చీర తీసుకున్నా, ఇంటికి ఏదైనా అలంకరణ వస్తువు కొన్నా… ప్రతి ఖర్చుకీ మన చుట్టూ ఎవరో ఒకరు చెప్పే మాట ఇది. డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేయడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం అవసరమే. కానీ జీవితంలోని ప్రతి చిన్న ఆనందాన్నీ వాయిదా వేసుకుంటూ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడమే జీవితం కాదు. సంపాదనకు భద్రతతో పాటు మనసుకు సంతోషాన్ని ఇచ్చే పాత్ర కూడా ఉందనే విషయాన్ని సరదాగా గుర్తుచేసే రచన “గబ్బు డబ్బు.”



“కొన్నదానివి కొన్నట్టే కొంటావు… ఆ డబ్బు దాచుకోవచ్చుగా!”


“రోజూ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుని తింటావు… ఆ డబ్బు దాచుకోవచ్చుగా!”


“కొత్త ఫోన్ వచ్చిందంటే చాలు… నీ పాత ఫోన్ ఇంకా ఊపిరి తీసుకుంటూనే ఉంటుంది, దాన్ని పక్కనపెట్టి కొత్తది కొంటావు… ఆ డబ్బు దాచుకోవచ్చుగా!”


“కొత్త వాచ్ కనిపిస్తే సమయం చూడటానికి కాదు, కొనటానికి వెళ్తావు… ఆ డబ్బు దాచుకోవచ్చుగా!”


“పూజ గదిలో దేవుళ్ల కంటే వెండి విగ్రహాలే ఎక్కువైపోయాయి… ఇంకెన్ని కొంటావు?”


“బెనారస్, నారాయణపేట, పోచంపల్లి, కాంచీపురం, వెంకటగిరి… చీరల అల్మారాలో ఇంకో చీర పెడితే పాత చీరలు ‘మాకు విడాకులు ఇవ్వండి’ అంటాయేమో!”


“మార్కెట్‌లో కొత్త సరుకు రావడమే ఆలస్యం… కొనేసి, దోస్తులకు దావత్ పెట్టడం మాత్రం నీకు జన్మహక్కు!”


“ఇల్లు సింగారించడానికి ఇంకా ఎన్ని వస్తువులు? ఇంట్లో ఖాళీ స్థలం కనిపిస్తే నీకు అది ఖాళీగా ఉండటం నచ్చదా?”


ఇలా ప్రతి ఖర్చుకీ ఒకే డైలాగ్…


“ఆ డబ్బు దాచుకోవచ్చుగా!”


అసలు దాచుకుంటే వచ్చేది ఏంటి?


బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుని రోజూ మనసులోనే

“వాహ్… ఎంత గొప్పగా దాచుకున్నానో!”

అని మనల్ని మనమే అభినందించుకోవడమా?


డబ్బు సంపాదించేది కేవలం గల్లాలో తాళం వేసి, నోట్ల కట్టలు లెక్కపెట్టుకుంటూ లొట్టలు వేయడానికేనా?


జాగ్రత్తగా ఖర్చు చేయాలి… నిజమే.


కానీ జీవితం మొత్తం “ఇది కొనొద్దు… అది తినొద్దు… అక్కడికి వెళ్లొద్దు… డబ్బు దాచుకో!” అంటూ ఆశలకు సంకెళ్లు వేసుకుంటే, చివరికి మన దగ్గర డబ్బు ఉంటుంది… కానీ దాన్ని ఖర్చు చేసి ఆనందించే మనిషి మాత్రం ఉండకపోవచ్చు!


ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాలరావు గారు చెప్పినట్టు

“మనిషన్నాక కాస్త కళాపోషణ ఉండాలి!”


నచ్చినది అప్పుడప్పుడు కొనాలి.

కావాలనుకున్నది అప్పుడప్పుడు చేయాలి.

ఇష్టమైనది కమ్మగా తినాలి.

మన వాళ్లతో అప్పుడప్పుడు దావత్ చేయాలి.


అదే జీవితం.


లేకపోతే ఎంత డబ్బు ఉన్నా గబ్బే కదా



కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Haritha kotha
Haritha kotha
17 hours ago
Rated 5 out of 5 stars.

Well said andi.... So true

Like
bottom of page