top of page
Original.png

అన్నీ అవే… ఏదో మారింది

10 minutes ago
2 min read

“అన్నీ అవే… ఏదో మారింది” తెలుగు ఆలోచనాత్మక రచనకు సంబంధించిన చిత్రం. ఒకే వ్యక్తి రెండు వేర్వేరు సమయాల్లో అదే వంకాయ కూర, అదే ప్రదేశం, అదే పరిచయమైన వ్యక్తిని అనుభవిస్తున్నట్లు చూపించారు. ఒకవైపు అతని ముఖంలో ఆనందం కనిపిస్తుండగా, మరోవైపు అదే పరిస్థితుల్లో ఆసక్తి తగ్గిన భావం కనిపిస్తుంది. బయట పరిస్థితులు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ కాలంతో పాటు మనసు, అవసరాలు, అనుభూతులు మారవచ్చనే భావాన్ని చిత్రం ప్రతిబింబిస్తుంది.

Annee Ave... Edo Marindi Telugu Inspirational Article | Kotha Viritha

అన్నీ అవే… ఏదో మారింది - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Published in manatelugukathalu.com on 09/09/2026


అదే వంకాయ కూర, అదే మసాలాలు, అదే వంటవాళ్లు… అయినా గతసారి వచ్చిన రుచి ఈసారి ఎందుకు రాలేదు? 


కాలంతో పాటు మన భావాలు, అవసరాలు, అభిరుచులు మారుతుంటాయనే చిన్న జీవిత సత్యాన్ని అందంగా గుర్తుచేసే రచన “అన్నీ అవే… ఏదో మారింది.”



గత వారం చేసిన వంకాయ కూర ఎంత బాగుందో… ఈ వారం అదే వంకాయలు, అదే మసాలాలు, అదే వంటవాళ్లు పెట్టినా ఆ రుచి మాత్రం రాలేదు. 


“ఏం తక్కువైంది?” అని వెతికితే… ఉప్పు, కారం, మసాలాల్లో ఏదీ తక్కువ కాదు. 


బహుశా… ఆ రోజు ఉన్న మనసే ఈరోజు లేదు!


మనకు ఎంతో ఇష్టమైన ప్రదేశానికి మళ్లీ వెళ్తాం. గతసారి అక్కడి గాలి కూడా అద్భుతంగా అనిపించింది. ఈసారి అదే గాలి వీచినా… “ఏదో బోర్‌గా ఉంది” అంటాం. 


మనుషుల విషయంలోనూ అంతే. నిన్న నచ్చిన మాట… ఈరోజు చిరాకు తెప్పిస్తుంది. నిన్న ఎంతో ఇష్టమైన వ్యక్తి… ఈరోజు కాస్త దూరంగా అనిపిస్తాడు. ఇందులో తప్పు ఎవరిదీ కాకపోవచ్చు. కాలం మారుతుంది, మనసు మారుతుంది, మన అవసరాలు మారతాయి. 


అందుకే నిన్నటి అనుభూతిని రేపు కూడా అలాగే ఇవ్వమని జీవితాన్ని అడగడం కాస్త అత్యాశే!


అదే కూరకు రుచి మారుతుంది…

అదే ప్రదేశానికి అర్థం మారుతుంది…

అదే మనిషిపై మన అభిప్రాయం కూడా మారుతుంది. 


జీవితం ప్రతిసారీ "సేమ్ ఇంగ్రెడింట్స్, సేమ్ టేస్ట్" అనే రెసిపీతో రాదు కదా!


అందుకే,

నిన్న బాగుందని ఈరోజూ బాగుండాలని, 

నిన్న నచ్చిందని ఎప్పటికీ నచ్చాలని పట్టుబట్టకుండా,

మార్పుని కూడా కాస్త "రుచి" చూడాలి!


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page