top of page
Original.png

అలారం మోగని ఒక ఉదయం

16 hours ago
2 min read

“అలారం మోగని ఒక ఉదయం” రచనకు సంబంధించిన భావోద్వేగ చిత్రం. ఒక మధ్యతరగతి పనిచేసే మహిళ ఉదయం పిల్లల టిఫిన్, లంచ్ బాక్సులు సిద్ధం చేయడం నుంచి ఆఫీసు పని, సాయంత్రం ఇంటి పనుల వరకు రోజంతా బాధ్యతలు నిర్వహిస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. రాత్రి అలసిపోయి మంచం అంచున కూర్చున్న ఆమె పక్కన అలారం గడియారం ఉండగా, పైభాగంలో అలారం మోగకుండా ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె కలను చూపిస్తూ విశ్రాంతి కోసం ఉన్న చిన్న కోరికను ప్రతిబింబిస్తుంది.

Alaram Mogani Oka Udayam Telugu Inspirational Article | Kotha Viritha

అలారం మోగని ఒక ఉదయం - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Published in manatelugukathalu.com on 08/09/2026


“రేపు ఇంకో గంట నిద్రపోతే బాగుండును.” ఆ చిన్న కోరిక వెనుక దాగి ఉన్న అలసటను, కనిపించని శ్రమను చెప్పే రచన “అలారం మోగని ఒక ఉదయం.”



అందరూ పడుకున్నాకే ఆమె పనులు పూర్తవుతాయి. ఇల్లు సర్దడం, వంటగది పని, పిల్లల పనులు… అన్నీ అయ్యేసరికి రాత్రి బాగా అవుతుంది. ఉదయం మాత్రం అందరికంటే ముందే లేవాలి. పిల్లలను లేపాలి, టిఫిన్ చేయాలి, లంచ్ బాక్సులు పెట్టాలి. 


ఇంట్లో అందరినీ చూసుకుని, ఆమె కూడా ఆఫీసుకు పరుగెత్తాలి. 


ఆఫీసులో పని, మీటింగులు, టార్గెట్లు. అక్కడా మరో బాధ్యత. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అలసిపోయినా విశ్రాంతి ఉండదు. మళ్లీ వంట, బట్టలు, ఇంటి పనులు మొదలవుతాయి. అందరూ తిని పడుకున్నాక ఆమెకు కాస్త సమయం దొరుకుతుంది. అప్పటికి ఆమె శరీరం మాత్రం నిద్ర కోసం అడుగుతుంది. 


ఆమెకు పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు. కొత్త చీరలు, ఖరీదైన వస్తువులు, విదేశీ ప్రయాణాలు కూడా కాదు. 


“రేపు ఇంకో గంట నిద్రపోతే బాగుండును…”అనేదే ఆమె చిన్న కోరిక. 


అలారం మోగకుండా…ఎవ్వరూ లేపకుండా…ఏ బాధ్యతా గుర్తు చేయకుండా…ప్రశాంతంగా నిద్రపోవాలని ఉంటుంది. ఇంట్లో అందరూ ఇంకొంచెం నిద్రపోతే, తానూ ఇంకొంచెం నిద్రపోవాలని అనుకుంటుంది. 


కానీ ఆమె నిద్ర మాత్రం కుటుంబ అవసరాల ముందు ప్రతిరోజూ ఓడిపోతూనే ఉంది. ఆమెకు పెద్ద ఇల్లు, ఖరీదైన కారు, విదేశీ ప్రయాణం కంటే…“రేపు ఇంకొంచెం ఆలస్యంగా లేవొచ్చా?”అనే కోరిక పెద్దది. 


రోజంతా అందరి కోసం పరుగెత్తే ఆమెకు, తన కోసం మిగిలేది చాలా తక్కువ. 


మధ్యతరగతి పనిచేసే మహిళకు కొన్నిసార్లు నెరవేరని అతి “పెద్ద కల”ఎక్కడికైనా వెళ్లడం కాదు, ఏదైనా కొనడం కాదు…


అలారం మోగని ఒక ఉదయం!


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
We Work
We Work
14 hours ago
Rated 5 out of 5 stars.

Chala bagunde...

Like

Haritha kotha
Haritha kotha
15 hours ago
Rated 5 out of 5 stars.

Well said

Like
bottom of page