top of page
Original.png

మహిళలే మహరాణులు

1 day ago
2 min read

మహిళల శక్తి, గొప్పతనం మరియు సాధికారతను ప్రతిబింబించేలా సీత, ద్రౌపది, లక్ష్మీదేవి, ఆదిశక్తి ప్రతీకలతో పాటు ఆధునిక మహిళలను చూపిస్తున్న మహారాణి రూపంలోని భారతీయ మహిళ.

Mahilale Maharanulu - Telugu Comedy Article | Seeda Nagaraju

మహిళలే మహరాణులు - తెలుగు హాస్య వ్యాసం | సీదా నాగరాజు

Published in manatelugukathalu.com on 04/11/2026


వేదకాలం నుంచి ఆధునిక యుగం వరకు ప్రతి రంగంలోనూ మహిళ తన శక్తిని, ప్రతిభను, గొప్పతనాన్ని నిరూపించుకుంటూనే ఉంది. సీతమ్మ, ద్రౌపది, ఆదిశక్తి వంటి పురాణ పాత్రల నుంచి నేటి ఆధునిక మహిళల వరకు స్త్రీ శక్తిని హాస్యం, చమత్కారంతో చాటిచెప్పే రచనే మహిళలే మహారాణులు.


వేదకాలం నుండి పరిశీలించినా, పురాణాలను తిరగేసినా, సింధు నాగరికతను పరిశోధించినా... అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మహిళలే మహారాణులు!


రామాయణం రాసిన ఆదికవి వాల్మీకి ఆ గ్రంథరాజానికి పెట్టుకున్న పేరు రామాయణం కాదు, "సీతాయాశ్చరితం మహత్..." అంటే ప్రధాన పాత్ర సీతమ్మవారే! రావణ సంహారానికి మూలకారణం సీతాపహరణం కాదా!


అలాగే ద్రౌపది లేని మహాభారతాన్ని ఊహించగలమా?

భాగవతం గురించి మాట్లాడదామని ప్రయత్నిస్తే దేవీభాగవతం అడ్డొస్తుంది.

స్త్రీ లేనిదేక్కడ?


"అర్ధనారీశ్వరుడు" అంటారు కానీ, నిజం చెప్పాలంటే "అర్ధపురుషేశ్వరి" అనాలేమో!


కలియుగ దైవం వడ్డికాసుల వేంకటేశ్వరునికి సైతం లక్ష్మమ్మ అలిగి కరవీరపురం (కొల్హాపూర్) చేరడంతో అప్పు చేసి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.


"ఆడది" అని ఏ దద్దమ్మ అన్నాడో కానీ అది అచ్చుతప్పు! ఆడది


కాదు... ఆది! మూలం... మానవజాతికి మూలం!


"అబల" అనడం కూడా సబబు కాదు. "భళా" అని ప్రశంసించడం చేతకాక అలా పలికారేమో!

"ఆడవారు" అనడం కూడా తప్పేనేమో! వారు ఆడువారు కాదు... ఆడించువారు!


అందుకే అనాది నుండి (సింధు నాగరికత కాలం నుండి) ఆడవారిదే పైచేయి. నాడు మాతృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది, నేడు కూడా అంతేగా!


పతి ఎవరైనా... ఆఖరికి రాసలీలలు చేసిన శ్రీకృష్ణుడైనా— "మీరజారగలరా మీ యానతి..."

జెంటిల్‌మెన్!


Don't think they wear sari,

They can drive Tata Safari!

Don't think they wear jacket,

They can travel even in rocket!

Don't think they wear blouse,

They can make your chapter close!

ఆడది కాదు... ఆదిశక్తి!

మహిళ కాదు... మహాకాళి!

అమ్మ కాదు...

ఆవిడే పరబ్రహ్మ!

ఆవిడ ఇచ్చిన వరమే మన ఈ జన్మ!


*** 


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



సీదా నాగరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 







మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


పరిచయం

సీదా నాగరాజు

: పేరు సీదా నాగరాజు.1965లో గుంటూరు పట్టణంలో జన్మించాను.స్థానిక జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి (1980)వరకు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల; నాగార్జున సాగర్ లో ఇంటర్మీడియట్( 1980-82), సిల్వర్ జూబ్లీ కళాశాల, కర్నూలు లో డిగ్రీ( 1982-85),ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ అఫ్ లా లో లా డిగ్రీ(1985-88) చదువుకున్నాను.దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ లో ఉద్యోగం చేసి 2025 లో రిటైర్ అయ్యాను.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page