రెండే రెండు నిజాలు

Rende Rendu Nijalu - Telugu Inspirational Article | Kotha Viritha
రెండే రెండు నిజాలు - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 11/09/2026
“ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు” అనే పాత మాటలో మనిషి జీవితానికి సంబంధించిన రెండు సాధారణమైన కానీ లోతైన సత్యాలు దాగి ఉన్నాయి.
ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. చాలా పాత కాలం నాటి మాట, కొత్త కాలం తెలుసుకోవాల్సిన మాట.
మనిషి పుట్టిన క్షణం నుంచి చివరి శ్వాస వరకూ అన్వేషణలోనే ఉంటాడు. సంపద, పేరు, ప్రతిష్ట, జ్ఞానం, శక్తి, అనుభవం ఇవన్నీ జీవిత పయనంలో అతని అడుగులను ముందుకు నడిపిస్తాయి.
అన్వేషణ, సంపాదన, ఆస్తులు వీటి మాయలో పడి ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవాళ్ళమో మర్చిపోతున్నాం. కచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన రెండు నిజాలు ఎప్పుడూ మనల్ని అనుసరిస్తాయి... అవే ఆకలి మరియు నిద్ర.
ఆకలి అనేది శరీరపు పిలుపు.
ఎన్ని రకాల విందులు,
ఎన్ని రకాల రుచులు,
ఎన్ని రకాల వంటకాలు,
ఎన్ని రకాల పిలుపులు
మన ముందున్నా, కడుపులో మంట పుట్టకపోతే వాటి రుచి కనిపించదు. ఆకలి లేకపోతే అన్నం రాయి లాంటిది, ఆకలి ఉంటే అదే అన్నం అమృతం అవుతుంది. ఇది మనిషికి ఒక పాఠం చెబుతుంది జీవితంలో విలువ అనేది అవసరం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది.
అవసరం లేనిది విలువలేనిదే.
నిద్ర అనేది ఆత్మకు ఇచ్చే విశ్రాంతి. ఎన్ని మృదువైన మంచాలు,
సౌకర్యవంతమైన గదులు, ప్రశాంతమైన వాతావరణం ఉన్నా, ఒళ్ళు అలసకపోతే నిద్ర పట్టదు. నిద్ర అనేది శరీరానికి మాత్రమే కాదు, మనసుకీ అవసరమైన ఉపశమనం. నిద్రలో మనిషి తన అహంకారాన్ని, తన కలహాలను, తన బాహ్య ప్రపంచాన్ని,
తన బాధలను, తన లోకబంధాలను మరచిపోతాడు.
నిద్రలో అందరూ సమానులే, ధనవంతుడైనా, దరిద్రుడైనా.
ఈ రెండు సత్యాలు మనకు చెబుతున్న పాఠం ఏమిటంటే
ప్రకృతి ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ఆకలి, నిద్ర లాంటి సత్యాలు మనల్ని వినమ్రంగా ఉంచుతాయి.
"నువ్వు ఎంత ఎత్తుకి ఎదిగినా, నీ అసలు ఆధారం ఈ శరీరమే. శరీరం ఆధారం లేకపోతే, నీ కలలు, నీ గర్వం, నీ విజయాలన్నీ అర్థహీనమవుతాయి. "
అందుకే జీవితం లో మనం తెలుసుకోవలసింది ఒకటే
అసలైన నిజాలను అంగీకరించాలి, మిగిలిన మాయలను అధిగమించాలి.
ఆకలి, నిద్రలాగే మనిషిని భూమికి కట్టిపడేసే మరొక శక్తి లేదు. ఇవే జీవితం మనకు ప్రతిరోజూ చెబుతున్న శాశ్వతమైన ఉపన్యాసం.
చివరిగా కోటి విద్యలు కూటి కొరకే అయినా, ఆకలి లేపోతే కోటి లేదు కూటి లేదు.
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.







Comments