top of page
Original.png

మితమే మంగళం

1 hour ago
2 min read

మితమే మంగళం తెలుగు వ్యాసం – అతిగా నవ్వడం, తినడం, ఖర్చు చేయడం వంటి అలవాట్లను హాస్యంగా చూపించే జీవిత సమతుల్యత చిత్రం.

Mithame Mangalam - Telugu Inspirational Article | Kotha Viritha

మితమే మంగళం - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Published in manatelugukathalu.com on 09/10/2026



జీవితంలో తినడం, తిరగడం, మాట్లాడటం, నవ్వడం, డబ్బు ఖర్చు చేయడం, పని చేయడం — అన్నీ అవసరమే. కానీ ఏదైనా మోతాదు మించితే ఆనందం కూడా సమస్యగా మారుతుంది. మన రోజువారీ అలవాట్లను సరదాగా విశ్లేషిస్తూ, జీవితంలో సమతుల్యత ఎంత ముఖ్యమో కొత్త విరిత గారు వివరించిన హాస్యభరిత రచన “మితమే మంగళం”.



తిండి అయినా, తిరుగుడు అయినా… మించితే రెండూ డేంజర్.


ఆకలేస్తే అన్నం తినాలి, ఆకలి లేకపోయినా తింటాను అంటే ఎలా?


“ఇంకో ముద్దే” అంటూ మొదలుపెట్టి, చివరికి ప్లేట్‌నే ఖాళీ చేస్తాం.


తర్వాత కడుపు ఇన్‌సైడ్ ఫీలింగ్ - “ఇంత ప్రేమ నాకు అవసరం లేదు బాబూ!”


తిరగడం కూడా మంచిదే, కానీ ఇంట్లో ఉన్నవాళ్లు మనల్ని మర్చిపోయేంత కాదు.ఒక్కరోజు బయటికి వెళ్తే “ఎంత యాక్టివ్!” అంటారు. రోజూ తిరిగితే “ఇతనికి పని పాట లేదా, ఇల్లు అనేది అసలు ఉందా?” అంటారు.


డబ్బు ఖర్చు చేయడం మంచిదే, కానీ అవసరం లేకుండా చేస్తే అది వడ్డీల రూపంలో తిరిగి వస్తుంది.


మాట్లాడటం మంచిదే, కానీ ఎదుటివాళ్లకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. నవ్వడం మంచిదే, కానీ ప్రతి విషయాన్నీ కామెడీ చేస్తే మనమే కామెడీ అవుతాం. పని చేయడం మంచిదే, కానీ పని పేరుతో జీవితాన్నే మర్చిపోవడం కాదు.


విశ్రాంతి మంచిదే, కానీ దానికి సోమరితనం అనే పేరు పెట్టకూడదు. పొదుపు మంచిదే, కానీ జీవించాల్సిన రోజుల్లో కూడా లెక్కలు వేసుకుంటే ఎలా?


ఏదైనా సరే… మోతాదు దాటితే మంచిదే చెడుగా మారుతుంది.

ఉప్పు తక్కువైతే రుచి ఉండదు, ఎక్కువైతే రుచే ఉండదు.

జీవితం కూడా అంతే, ఎక్కువ కాదు, 

తక్కువ కాదు,

సరైన మోతాదే అసలైన అందం.


తిండి అయినా, 

తిరుగుడు అయినా, మాటైనా, 

ఖర్చైనా,

అన్నింటికీ ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే సరదా కాస్తా సమస్య అవుతుంది.


మన జీవితానికి పెద్ద సిద్ధాంతం ఏమీ అవసరం లేదు… "మితమే మంగళం!"


***

కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page