top of page
Original.png

పాత సారా కొత్త సీసా

పాత సారా కొత్త సీసా, తెలుగు వ్యంగ్య కథ, ఆలోచింపజేసే తెలుగు కథ, సోషల్ మీడియా వ్యంగ్యం, జీవిత సత్యాలు, కొత్త విరిత కథలు, తెలుగు షార్ట్ స్టోరీ, motivational Telugu story, Telugu satire story, Mana Telugu Kathalu

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'పాత సారా కొత్త సీసా' వ్యాసంలో  కుటుంబ సభ్యులు ఇంట్లో చెప్పిన సలహాను పట్టించుకోకుండా, అదే సలహాను మొబైల్‌లో సోషల్ మీడియా ద్వారా ఆసక్తిగా వింటున్న యువకుడు; పాత జ్ఞానం కొత్త ప్యాకింగ్‌లో ఎలా విలువ పొందుతుందో ప్రతిబింబించే వ్యంగ్య దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'పాత సారా కొత్త సీసా' వ్యాసంలో  కుటుంబ సభ్యులు ఇంట్లో చెప్పిన సలహాను పట్టించుకోకుండా, అదే సలహాను మొబైల్‌లో సోషల్ మీడియా ద్వారా ఆసక్తిగా వింటున్న యువకుడు; పాత జ్ఞానం కొత్త ప్యాకింగ్‌లో ఎలా విలువ పొందుతుందో ప్రతిబింబించే వ్యంగ్య దృశ్యం.

Patha Sara Kotha Seesa Telugu Inspirational Article | Kotha Viritha

పాత సారా కొత్త సీసా తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 05/07/2026


కొత్త ఆలోచనలు కావాలని కోరుకునే ఈ కాలంలో, నిజంగా మనం వెతుకుతున్నది కొత్త విషయమా? లేక కొత్తగా చెప్పే వ్యక్తినా? అదే పాత సత్యాన్ని కొత్త ప్యాకింగ్‌లో అందిస్తే అది అద్భుతమై కనిపించే మన మనస్తత్వాన్ని చురుకైన వ్యంగ్యంతో ఆవిష్కరించే చిన్న కథ "పాత సారా కొత్త సీసా".


"కొత్తగా ఏదైనా చెప్పండి" అని అడిగేవాళ్లు,కొత్త విషయం కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తారు.


కానీ నిజం ఏమిటంటే,వాళ్లకు కొత్త విషయం అవసరం లేదు.

కొత్తగా చెప్పే వ్యక్తి కావాలి.


అదే మాటను ఇంట్లో అమ్మ చెబితే..."సరేలే!" 


అదే మాటనుయూట్యూబ్‌లో ఎవరైనా చెబితే..."వావ్... జీవితాన్ని మార్చేసే ఆలోచన!" అనుకుంటాం.


అదే సలహాను స్నేహితుడు ఇస్తే పట్టించుకోరు.


అదే సలహాను ఒక ఫంక్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌పై కోట్‌లా రాసి పోస్ట్ చేస్తే షేర్ చేస్తారు.


పదేళ్లుగా పుస్తకాలలో ఉన్న విషయాన్ని,"ఎట్ ది ఏజ్ ఆఫ్ ఫార్టీ,నేను కనుగొన్న రహస్యం" అని చెప్పగానే లక్షల వ్యూస్.


ఇక్కడ విషయం పాతదే, ప్యాకింగ్ కొత్తది.


మనుషులకు జ్ఞానం కంటే,

జ్ఞానానికి వేసిన కవర్‌నే ఎక్కువగా మెచ్చుకుంటారు.


అందుకే కొందరు జీవితమంతా, "ఇందులో కొత్తదేముంది?" అని అడుగుతూనే ఉంటారు. మరికొందరు,అదే పాత విషయాన్ని కొత్తగా చెప్పి కొత్త గురువులైపోతారు.


పాత సారా... కొత్త సీసా!


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


***************************************


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత
కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

3 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Excellent write up 👌 👌 👌

Like

Kishan Kotha
Kishan Kotha
7 days ago
Rated 5 out of 5 stars.

Nicely explained the common man psychology

Like

Rated 5 out of 5 stars.

👌👌👌

Like
bottom of page