గాడిద గుడ్డు
#GadidaGuddu, #గాడిదగుడ్డు, #గార్దభలహరి, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #పిల్లలకథలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

గార్దభ లహరి - పార్ట్ 2
Gadida Guddu - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 12/06/2025
గాడిద గుడ్డు - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించే రోజులవి. ఒక ఆంగ్ల దొరకి మన్యం గిరిజనులు నివశించే ఏజన్సీ ప్రాంతంలో పర్యవేక్షణ కోసం డ్యూటీ పడింది. దొర గారికి సహాయకుడిగా ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాష తెల్సిన ఉద్యోగిని నియమించింది ప్రభుత్వం. అడవి జంతువుల నుంచి రక్షణగా వారికి ఎత్తైన కొండ ప్రాంతంలో వసతి ఏర్పాటు చేసారు. రోజువారీ విధులకు ఆహార సరుకులు గిరిజనులే దొరగారి వసతిగృహానికి చేర్చేవారు.
ఒకసారి భారీ వర్షాల కారణంగా దొరగారికి కింద వరకు జీపులో వచ్చిన ఆహార పదార్థాలు, బిస్కెట్లు, సిగరెట్లు, చాయ్ పౌడరు, వైన్ బాటిల్సుతో నిండిన అట్టపెట్టెలు గుట్ట మీదున్న దొర గారి కుటీరానికి చేర్చడం కష్టమైంది. దొర గారి సహాయకుడు ఏం చెయ్యాలో తెలియక కంగారు పడసాగాడు. ఇంతలో గిరిజన నాయకుడు గూడెంలో ఒకరి వద్ద మట్టిని మోసే గాడిద ఉందని దాని సాయంతో గుట్ట మీదకు దొర గారి వస్తువుల్ని చేరుద్దామనగానే ఆ గాడిదను
దాని యజమానితో సహా రప్పించారు.
దొర గారి వైన్ అట్టపెట్టెల్నీ మిగతా వస్తువులన్నీ గాడిద వీపు మీద రెండు వైపుల సర్ది జాగ్రత్తగా కుటీరానికి చేర్చేరు. భయంకర వర్షం క్లిష్ట పరిస్థితుల్లో భద్రంగా సామగ్రిని పైకి
ఎలా చేర్చగలిగారని ఆంగ్లదొర ఆశ్చర్యపోయి తన సహాయకుడిని ఆంగ్లంలో అడిగారు.
సహాయకుడు గాడిదను చూపి ఈ జంతువు వల్లే సాద్యమైందని ఆంగ్లంలో జవాబు చెప్పేడు. ఆంగ్ల దొర సంతోషించి గూడెం నాయకుడికి గాడిద యజమానికి బహుమతులిచ్చి “దిస్ డాంకీ ఈజ్ గుడ్" అన్నాడు ఆంగ్లంలో.
దొరగారి భాష తెలియని గిరిజనులు సహాయకుడిని అడిగారు. ఆ ఉద్యోగి "దొరగారు గాడిదను గుడ్" అన్నారు అని తెలుగులో చెప్పేడు. వారికి కోడిగుడ్డు, బాతుగుడ్డు
మాత్రమే తెలుసు. అలా అప్పటి నుంచి గాడిద గుడ్ "గాడిద గుడ్డు" గా రూపాంతరం చెంది హాస్య పదమైంది.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.





Comments