గాడిద పాలు
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- Jun 14
- 3 min read
#GadidaPalu, #గాడిదపాలు, #గార్దభలహరి, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #పిల్లలకథలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

గార్దభ లహరి - పార్ట్ 3
Gadida Palu - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 14/06/2025
గాడిద పాలు - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
ఒకరోజు చాకలి దుర్గమ్మ గాడిద అగ్రహారం బ్రాహ్మణ వీధిలో అంట్లాకులు తింటుంటే ఆయుర్వేద వైద్యులు ఆచారి గారు చూడటం జరిగింది. వారు ఏదో ఆయుర్వేద మందు తయారీలో గార్దభ క్షీరం అవసరమై దుర్గమ్మకు కబురు పెట్టి రప్పించారు.
ఉతకడానికి మైల బట్టలు ఉన్నాయేమొనని దుర్గమ్మ ఇంటికి రాగా తాజా గాడిద పాలు అవసరమయాయని పితికి ఇవ్వమని చెప్పేరు. దుర్గమ్మ, ఆచారి డాక్టరు గారు అడిగినట్టు గాడిద పాలను పాత్రలో పిండి ఇచ్చింది.
మనసులో అనుమానం అణచుకోలేక "బాబూ, అందరు ఆవు పాలు తీసుకుంటారు కాని తమరు నా గాడిద పాలు అడుగుతున్నారు" అంది.
"ఓసి, పిచ్చి మొహమా! గాడిద పాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈమధ్యనే వాటి గొప్పతనం గురించి తెల్సింది. మధుమేహం, వాత పిత్త రోగాలకే కాకుండా, సంతానం
లేనివారికి తాజా గాడిద పాలను సేవిస్తే వారికి పిల్లలు పుడతారని కొన్ని జబ్బుల గురించి తెలియ చెప్పేరు ఆచారి డాక్టరు గారు.
పట్నంలో వాషింగ్ మిషీన్లు, లాండ్రీలు వచ్చినప్పటి నుంచి గ్రామంలోని రజకులకు పని లేకుండాపోయింది. జీవనాధారం కోసం ఇతర పనులకు పోవల్సి వస్తోంది. రజకులను నమ్ముకున్న గాడిదలకు తిండి కొరత ఏర్పడి వీధులంట, గరువులంట తిరుగుతు ఏది దొరికితే అవి తిని అనారోగ్యం పాలవుతున్నాయి. ఇదే బాధను ఆచారి డాక్టరు గారింటికెళ్లినప్పుడు దుర్గమ్మ చెప్పుకుని వాపోయింది.
ఆచారి డాక్టరు గారు చాకలి దుర్గమ్మకు ఒక సలహా ఇచ్చారు. పట్నానికి గాడిదను తోలుకుపోయి పాలను అమ్ముకోమని చెప్పేరు. అసలే చాకలి పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న దుర్గమ్మకు ఆచారి డాక్టరు గారి మాట వంటబట్టింది.
***
మర్నాడు ఉదయాన్నే గాడిదకు గంజి, పచ్చగడ్డి తినిపించి పట్నానికి బయలుదేరి గాడిద పాలంటు అరుచుకుంటు వెళ్లసాగింది. ఇప్పటి వరకు గాడిద పాలను బహిరంగంగా వీధులంట అమ్మకం జరగలేదు.
" గాడిద పాలమ్మా, గాడిద పాలు "
పట్నం వీధిలో బూడిదరంగు ఆడగాడిదను కట్టిన తాడు ఒక చేత్తో మరో చేత్తో ఒక పాత్రను పట్టుకుని చాకలి దుర్గమ్మ నడిచి వెళుతుంటె జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు.
పాత రోజుల్లో గేదెల్ని వెంట పెట్టుకుని వీధులంట పాలు పితికి అమ్మడం చూసారు కాని ఇలా గాడిదపాలు అమ్మడం కాస్తంత కొత్తగానె అనిపిస్తోంది జనాలకు.
కొందరు ఆయుర్వేదంలో గాడిదపాలకు ఎంతో ప్రాశస్త్యం ఉన్నట్టు, ఈమద్య టీవీల్లో గాడిదపాల గొప్పతనాన్ని ఎవరోచెప్పగా విన్నవాళ్లు ఒంటె పాలలాగ గాడిదపాలకు కూడా గుర్తింపు వచ్చేటట్టు ఉందని వ్యాఖ్యానించు కుంటున్నారు.
టీవీ వార్తల్లో గార్దభ క్షీర గుణాల గురించి విన్న కొందరు దుర్గమ్మ గాడిద పాలను కొన్నారు. కీళ్ల వాతం, మూత్ర వ్యాధులతో బాధ పడుతున్నవారు ఇలా వారి రోగ నివారణకు గాడిదపాలను వాడాలనుకున్నారు.
ఎన్నో ఏళ్లనుంచి సంతానం కలగలేదని బాధపడుతున్న ఒక యువ జంట ఆప్యాయంగా తాజా గార్దభ పాలను కొని సేవించారు.
దుర్గమ్మ అదృష్టమో లేక ఆ యువజంట అదృష్టమో తెలియదు కాని గాడిద పాలను సేవించిన కొన్నాళ్లకు ఆ యువతి గర్భం దాల్చింది. ఆనోటా ఈనోటా ఈ విషయం బయటకు తెలియడంతో చాకలి దుర్గమ్మ గాడిద పాలకు గిరాకీ ఏర్పడింది.
ఎడ్వాన్సు డబ్బులు ఇచ్చి మరీ గాడిద పాలను కొనుక్కుపోతున్నారు జనం. ఏదైతేనేం ఆచారి డాక్టరు గారి దయవల్ల తనకు, గాడిదకు తిండికి లోపం లేకుండా రోజులు గడిచిపోతున్నాయనుకుంది చాకలి దుర్గమ్మ.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments