top of page
Original.png

అమ్మ హృదయమే


Telugu mother standing before a traditional village home at sunrise, surrounded by a golden aura symbolizing unconditional love, courage, sacrifice, and humanity in the poem "అమ్మ హృదయమే".
హక్కులు మరియు బాధ్యతల మధ్య సమతుల్యతను ప్రతిబింబించే ప్రతీకాత్మక దృశ్యం. ఒక వ్యక్తి హక్కులను సూచించే పత్రం, బాధ్యతలను సూచించే త్రాసు పట్టుకుని నిలబడి ఉండగా, చుట్టూ ఆధునిక మీడియా ప్రభావం మరియు వెనుక సంప్రదాయ విలువలను సూచించే అమ్మమ్మ పిల్లలకు మార్గనిర్దేశం చేస్తున్న భావోద్వేగ దృశ్యం.

Amma Hrudayame - Telugu Emotional Poem | Dr. Gadiraju Madhusudana Raju

అమ్మ హృదయమే - తెలుగు భావోద్వేగ కవిత | డా. గాదిరాజు మధుసూదనరాజు

Published in manatelugukathalu.com on 04/08/2026


అమ్మ హృదయమే అనే ఈ హృదయస్పర్శి తెలుగు కవితలో, బిడ్డ ప్రాణం కోసం తల్లి చేసే త్యాగం, ఆరాటం, ప్రేమకు ఎలాంటి మతం, హద్దులు ఉండవని కవి డా. గాదిరాజు మధుసూదనరాజు ఎంతో భావోద్వేగంగా చిత్రించారు. తల్లి హృదయం మానవత్వానికి ప్రతిరూపమని, ప్రేమే ప్రపంచంలోని గొప్ప మతమని గుర్తుచేసే ఈ కవిత ప్రతి పాఠకుడి మనసును కదిలిస్తుంది.


కన్నబిడ్డచుట్టూతా

క్రమ్ముకున్న

ఆపదేదైనా 

అమ్మ గుండే అడ్డమై

నిలుస్తుంది


గుండే 

కాదు

నిండుదేహాన్నే కత్తిలాదూస్తుంది

బాంబు గుండే ఐనా 

భయపెట్టలేని 

అమ్మగుండే కదా ఇక్కడ!

బిడ్డప్రాణం కోసం 

వెజ్జు మరుగుజ్జు మన సోడైనా

కాళ్ళట్టుకుంటుంది అమ్మ

అఘోరీ

గోరీ

మారీ

మేరీ 

అల్లా

యెహోవా

అంటూ 

కాపాడే దారి కోసం..

అల్లాడిపోతుంది అమ్మ!

తిరుగుతుంది అమ్మ అవిరామంగా..

బోసినవ్వులకన్నబిడ్డ చిరంజీవిగా బతికేదాకా


సనాతనమేంటీ

పురాతనమేంటీ

బైబిలేంటి

ఖురానేంటి

అమ్మతనమిక్కడ

ప్రాణాలకు మతాలేంటి


అమ్మ ఆరాటానికి హద్దులేంటి?

అమ్మ గుండే భూగోళమైంది 

మానవత్వాన్ని ఓదార్చుకుంది 

అణువణువున మరి ఇముడ్చుకుంది!!


_డా. గాదిరాజు మధుసూదనరాజు


==================================


హక్కులు ప్రతి మనిషికి అవసరం. కానీ వాటితో పాటు బాధ్యతలు కూడా సమానంగా ఉండాలి.





Hakku - Telugu Emotional Poem | Dr. Gadiraju Madhusudana Raju 

హక్కు - తెలుగు భావోద్వేగ కవిత | డా. గాదిరాజు మధుసూదనరాజు

Published in manatelugukathalu.com on 06/07/2026


హక్కులు ప్రతి మనిషికి అవసరం. కానీ వాటితో పాటు బాధ్యతలు కూడా సమానంగా ఉండాలి. ఆధునిక సమాజంలో మీడియా, వ్యాపార సంస్కృతి, వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక విలువలు మన ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఈ కవిత సూటిగా ప్రశ్నిస్తుంది. హక్కుల పేరుతో మనిషితనం దూరమవుతుందా అనే అంశంపై ఆలోచింపజేసే విలువైన కవిత ఇది.


అటు...

మెట్టు ఎక్కే కొద్దీ 

యశం ధనం కిక్కు


ఇటు..

పట్టికిందకు నెట్టే 

కట్టుబాటుల హుకుం హుక్కు


అక్కున చేర్చుకో దగిన

చక్కని హక్కు

మాధ్యమాల మధ్యన పొక్కిన 

నవనాగర నరహక్కు !


వ్యాపారవిస్తరణా ఉపాయాల

ప్రచారపు టెత్తుల మధ్యన...

ఉసి గొల్పుల మాధ్యమాల

ఉరి ఊయల మధ్యన

అపాయాలకు ఈవల ఆవల

అయోమయ హృదయ లయ లో

ఒడుదుడుకుల కుదుపులలో

నలిగినలిగి

నగ్గినక్కిన

మస్తిష్కపు పనితనం...

తడబడుతున్న

మనిషి ప్రవర్తనం!

మాననీయమైన మనిషితనం!


పతనమో

ఉత్తానమో

పసిగట్టలేక

 

ఇరుకున పడి 

ఇంకి పోతూ

మరీ మరీ

కుంచించుకుంటూ

కుంటుకుంటూ

గింజుకుంటున్న

ఆలోచనా అవభృత జ్ఞానం !


మంచి జరిగే మార్గం కాస్తా

పూడుకు పోతున్న వైనం!!


చూస్తూంటే...


అమ్మమ్మ అమ్మల కాలపు 

అదుపూ

ఆదరణా

గురుతుకు వస్తోంది


హక్కుల తిక్కలెక్కలు

చక్కబడిపోనూ

ఇరుగుదిష్టిపొరుగుదిష్టి

తగలబడిపోనూ 


ఊరించే దాపరికం తో 

మిఠాయి తాయిలం రుచి మరీమరి పెరిగినట్లు..

దొరకని సరుకులన్నీ చివరకు ప్రియమైనట్లు 

దాగుడుమూతల ఆటలో 

ఎల్లరకీ అసలు

ఆనందమున్నట్లు

అవసరమనిపిస్తోంది గుట్టు!


అనవసరమని 

అనిపిస్తోంది 

ప్రతిదీ మరీ ఇంత రట్టు!

అనవసరమని 

అనిపిస్తోంది

ఆరడి ఏదో ఘోరంజరిగినట్టు!!


***


డా. గాదిరాజు మధుసూదనరాజు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

డా. గాదిరాజు మధుసూదనరాజు

రచయిత పరిచయం: గాదిరాజు మధుసూదన రాజు

 కృతజ్ఞతలు నమస్సులు

నేను  సూర్య వంశ క్షత్రియ వంశస్థుడను. ప్రభుత్వ నేత్ర వైద్య అధికారిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పనిచేసి రిటైర్ అయ్యాను.

నా కథలు దశాబ్దాల క్రితమే " కధా నిలయం" లో కూడా చోటు చేసుకున్నాయి. సాహిత్యం నా ఊపిరి.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

alochanala loyalo padesina kavitha

Like
bottom of page