top of page

గార్దభ ప్రేమాభిషేకం 

#GardabhgaPremabhishekam, #గార్దభప్రేమాభిషేకం, #గార్దభలహరి, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #పిల్లలకథలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

గార్దభ లహరి - పార్ట్ 10

Gardabhga Premabhishekam - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 01/07/2025

గార్దభ ప్రేమాభిషేకం - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


అగ్రహారం చాకలిపేటలో ఉండే సూరి ఆడ గాడిద మంగీ, సోములు మగ గాడిద రాముడు చిన్నప్పటి నుంచి ఒకేచోట పుట్టి పెరిగాయి. యవ్వనంలో కొచ్చి ప్రేమలో పడ్డాయి. 


మగ గాడిద రాముడు కాస్తంత నల్లగా భారీగా ఉన్నా సూరి ఆడ గాడిద మంగీ బూడిద రంగుతో అందంగా కనబడుతుంది. ఊరి బయటి పెద్ద చెరువు చాకిరేవు వద్ద సూరి, సోములుకి మధ్య వచ్చిన తగవుల కారణంగా సోములు తన మకాం మాలపేటకు మార్చేడు. 


అప్పటి నుంచి మంగీ - రాముడు ఎడబాటయేరు. చాకిరేవు దగ్గర కూడా సోములు తను బట్టలుతికే బండరాయినీ, మురికి బట్టలు ఉడక పెట్టే కుండగూనను కూడా చెరువు అవతలి ఒడ్డుకి మార్చేసినందున మంగీ - రాముడు కలుసుకునే అవకాశం లేకుండా కట్టడి చేసారు. 

అందువల్ల రెండు ప్రేమతో విరహవేదన అనుభవిస్తున్నాయి. 


అగ్రహారం గ్రామంలో ఈ సంవత్సరం వర్షాలు ఎండ గట్టేసాయి. చైత్ర వైశాఖ మాసాల పెళ్లిళ్ల సీజను పూర్తయి శ్రావణ మాసం వచ్చినా తొలకరి ఎడ్రసు లేదు. భాద్రపద పౌర్ణమి వెళ్లినప్పటికి నీటి మేఘాల జాడలేదు. 


ముందు తొలకరిలో పడిన చిరుజల్లులకు దైర్యం చేసి ఆకులు పోసి వరి ఉడుపులు చేసిన రైతులకు ఆందోళన ఎక్కువైంది. పొలాల్లో తడి లేక వరి ఆకులు మాడు మొదలైంది. 


పెద్ద చెరువులో నీళ్లు తగ్గి చాకిరేవు వద్ద చాకళ్లకు ఇబ్బంది అవుతోంది. చాకళ్లందరు కప్పపెళ్లి జరిపించినా ఫలితం కనిపించ లేదు. 


రైతులందరు ఊరి పురోహితుడు శంకరశాస్త్రి గార్ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన మరొకసారి పంచాంగం పరిశీలించి నా లెక్క ప్రకారం ఈ సంవత్సరం వర్షాలు సమృద్దిగా కురవాలి కానీ మానవ తప్పిదం కారణంగా ఊరి చుట్టూ ఉన్న మామిడి తోటలు సరుగుడు తోటలు జీడి తోటల భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మడంతో వాటిని కొట్టేసి ప్లాట్లుగా చేసారు. గ్రామం చుట్టు పచ్చగా ఉండే భూములు వట్టిపోయి బీళ్లయాయి. వర్షించే నీటి మేఘాలు దూరంగా పోయి వర్షాలు

ఎత్తి గట్టేసాయి. 


ఈ సమస్య కొక పరిష్కార మార్గం గోచరిస్తోంది. యవ్వన వయసున్న గార్దభాల పెళ్లి జరిపించి ఊరి చుట్టు ఊరేగిస్తే ప్రయోజనం ఉండవచ్చని శాస్త్రి గారు సూచన చేసారు. 


చాకలిపేటలో వాకబు చెయ్యగా సూరి ఆడగాడిద మంగి, మాలపేట సోములు మగ గాడిద రాముడు మాత్రమే యవ్వనంలో ఉన్నట్టు మిగతా గార్దభాలు ముసలి, సంతానవతులుగా తెల్సింది. 

సూరి, సోముల మద్య తగాదాల కారణంగా మంగీ - రాముడి లగ్గానికి వారు ఒప్పుకోలేదు. ఊరి రైతులు మిగతా రజకుల అభ్యర్థన మేరకు ఊరి ప్రయోజనం కోసం రాజీ కొచ్చారు. 


సూరి ఆడగాడిద మంగి, సోములు మగగాడిద రాముడి పెళ్లి ఘనంగా జరిపి గ్రామం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. 


వాతావరణం ప్రభావమో లేక యవ్వన గార్దభాల పెళ్లి ప్రభావమో వారం రోజుల వ్యవధిలో వర్షాలు మస్తుగా కురవడం మొదలయాయి. 


రైతుల మొహాల్లో సంతోషం కనబడింది. మంగి - రాముడి ప్రేమ ఫలించింది. సూరి - సోములు వైషమ్యాలు విడిచిపెట్టి బంధువులయారు. 

 

 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page