'Gatham Oka Jnapakam' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 26/01/2024
'గతం ఒక జ్ణాపకం' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
ఆనంద్ ఒక సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగంలో చేరి నాలుగేళ్ళు అవుతుంది. అప్పుడే మేనేజర్ నుండి వాచ్మెన్ వరకు అందరు ఉద్యోగులూ ఆనంద్ ని గౌరవిస్తారు. అతడి పని తనాన్ని, నిజాయితీని, తోటి వారిపై అతడు చూపే ప్రేమకు అందరూ ముగ్దులైపోతారు.
ఆనంద్ మాత్రం గర్వపడడు. అలాంటివేమి పట్టించుకోడు. ఒకరు పొగిడినా, విమర్శించినా. అతడు స్పందించడు. మంచితనం అతడి ప్రాణం.
ఉద్యోగంలో డబ్బులు బాగా వస్తున్నాయి. పైగా కంపెనీ అలెవెన్స్ తో పాటు అతడి కారణంగా ఉద్యోగుల్లో మంచి క్రమశిక్షణ అలవడుతున్న కారణంగా ఆనంద్ కి మేనేజర్ నుండి మంచి బహుమతులు, నగదు వస్తూనే ఉంటాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆనంద్ జీవితం చాలా చక్కగా అలంకరించబడిన ఒక పెళ్లి పందిరిలా ఉంది. తనకు ఏం కావాలన్నా అది తన కళ్ళముందు ఉంచుకోగల స్థాయి ఆనంద్ ది. ఇప్పటి వరకు ఇది రెండో ఇన్నింగ్స్ మాత్రమే.
ఆనంద్ కుటుంబం కూడా మంచి కుటుంబం. అతడు ఉద్యోగం రాకముందే పెళ్ళి చేసుకోవల్సి వచ్చింది. భార్య పేరు రవళి. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. భార్య చాలా పద్దతిగా ఉంటుంది. ఆనంద్ అంటే ఆమెకు చచ్చేంత ఇష్టం. బహుశా విధి వీరిద్దరి బాధను, గతాన్ని బాగా అర్థం చేసుకుందేమో... ఈ జన్మకి కలిసి ఆనందంగా బతుకుతున్నారు. తమ కుటుంభంలో అందరూ దాదాపు ఆనందంగా ఉంటారు.
అయితే ఆనంద్ మాత్రమే అప్పుడప్పుడు ఏదో దిగులుతో ఉంటుంటాడు. మరలా స్థిమితపడుతుంటాడు. అతడిలో ఏదో బాధ ఉంది. కానీ అది ఇన్నాళ్లు ఎవరికి కనపడకుండా దాచి మనసులో అప్పుడప్పుడు బాధపడుతుంటాడు. ఎవరికి చెప్పని ఆ బాధకు భార్య బాధితులుగా ఉండేది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే భార్యకు ఆనంద్ విచారం కాస్తా ఇబ్బందిగా మారేది. అడిగితే ‘ఏం లేద’ని ఎప్పటిలాగే మామూలు అయిపోయేవాడు. చివరకు రవళికి అది ఒక అలవాటుగా మారిపోయింది.
ఇలాగే కాలం గడుస్తుంది.
ఆనంద్ తన ఈ స్థానాన్ని, తనకు దక్కే గౌరవాన్ని తలుచుకుని మరింత బాధపడేవాడు.
బలవంతంగా ఈ విషయం పై భార్య నిలదీయగా అప్పుడు నోరు విప్పాడు ఆనంద్.
చిన్నతనంలోనే నరకం అనుభవించాడు ఆనంద్.
ఆరేళ్ళ వయసులో తల్లిదండ్రులు పనిలోనే ప్రాణాలు కోల్పోగా అనాథగా మారాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో బతుకు పై ఆశ ఉంటుందా.... ?
కానీ ఆనంద్ ధైర్యం అతడిని బతికించింది. ధైర్యం అయితే ఉంది కానీ.. ! చిన్న వయసు కావటంతో ఎవరూ పనిలోకి తీసుకోలేదు. చదువుదాం అంటే డబ్బులు లేవు. అంతెందుకు.. ! మూడు పూటలు కడుపు నిండా బోజనమే దొరకటం కష్టమై నడిరోడ్డున డివైడర్ పై దీనంగా కూర్చుని ఉండగారామప్పడు అనే ఓ వ్యక్తిని పనికి తగిన మనుషులును తీసుకురాలేదని యజమాని తిడుతుండగా ఆనంద్ వెళ్ళి
"తనకు ఎవరు లేరు అయ్యా నన్ను పనిలో చేర్చుకుంటే నాకు పూట గడుస్తుంది "అని ప్రాధేయపడ్డాడు.
రామప్పడు అందుకు అంగీకరించినా.. యజమాని "చిన్నపిల్లాడ్ని పనికి పెడతావా" అని చీవాట్లు పెట్టాడు.
అయితే ఆనంద్ చిన్నోడైనా పని మాత్రం పెద్దవారితో సమానంగా చేసి అందరి మన్ననలు అందుకున్నాడు. అలా ఆ పనిలో బాగా ఆరితేరుతు వచ్చాడు. కుర్రవాడు కావటంతో పనిలో దాదాపు అన్ని విషయాలు తెలుసుకుని రామప్పడు కంటే అందరి కంటే మన్ననలు అందుకునేవాడు.
అయితే రామప్పడు ఆనంద్ లో తెలివితేటలు గ్రహించి పగలు పని చేస్తూ.. రాత్రి చదువుకునేలా ప్రోత్సాహించాడు.
తనతోటి వారందరూ ఆనంద్ కి మంచి విషయాలు చెప్పేవారు. చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ మంఛి పుస్తకం కొను అనే అబ్దుల్ కలాం మాటలు నూరిపోసేవారు.
"భవిష్యత్ లో మంచి రోజులు రావాలంటే నేడు కష్టపడాలి.
తల్లిదండ్రులు ఉన్నోళ్ళకే భవిష్యత్ కాదు లేనోళ్ళకి కూడా భవిష్యత్ ఉంది లేకపోతే నీ పుట్టక ఎందుకు ఉంటుంది.. ? అంటూ ఆనంద్ లో కసిని పెంచేవాళ్ళు. ఆనంద్ కూడా మంచి అలవాట్లు అలవర్చుకుని రాత్రి ట్యూషన్ కు వెళ్థూ.. పగలు పనికెళ్తు చదువుకునేవాడు. పెద్దయ్యాక మంచి ఉద్యోగం సాదించి రామప్పడు, తమ తోటి వారికి ఆదుకోవాలని సంకల్పించుకున్నాడు.
ఇక పనిలో హుషారుగా ఉండేవాడు. ఎంతగా అంటే పనిలో అందరూ తమకంటే పెద్దవారే అయినా ఒరేయ్ అని పిలిచినా ఆప్యాయంగా పలికేటంతగా. పదిహేనేళ్ళు నిండేసరికి రామప్పడుతో పనిలేని సమయంలో షాపింగ్ మాల్ లో పనికి వెళ్ళేవాడు. అసలు ఒక్కరోజు కూడా పని మనివేయకుండా కష్టపడ్డాడు. ఇంతటి పనితనంలో, కష్టంలో ఆనంద్ కు మంచితనం, పనిలో క్రమశిక్షణ, నీతి నిజాయితీ అలవడ్డాయి. అలా అలా డైరక్ట్ గా పదోతరగతి పరీక్షలు రాసి టాపర్ గా నిలవటంతో ప్రభుత్వం అతడి పై చదువులకు అయ్యే ఖర్చు భరిస్తామని ప్రకాటించటంతో రామప్పడు, అతనితో పని చేసేవాళ్ళుకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
అలా ఆనంద్ పై చదువులకు చెన్నై, బెంగుళూరు, డిల్లీ లాంటి పట్టణాలకు పోవల్సి వచ్చింది. పై చదువులు చదువుతూనే ఆయ పట్టణాల్లో దుకాణాల్లో పని చేస్తూ సంపాదించేవాడు.
అతడు చదువుతున్న రోజుల్లో ప్రవళిక అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమెతో చాలాకాలం ప్రేమలో మునిగితేలాడు. ఆమెనే జీవిత భాగస్వామిగా నిర్ణయించుకున్నాడు. కానీ.. తల్లిదండ్రులు, ఆస్తులు లేని ఆనంద్ ని ప్రవళిక మోసం చేసి వేరే యువకుడికి ప్రేమించటం మొదలుపెట్టింది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆనంద్ తన చదువుని సద్వినియోగం చేసుకోవాలని వెనక్కి రాగా ప్రవళిక స్నేహితురాలు రవళి అనే అమ్మాయి ఆమెకు మరో యువకుడు మోసం చేయటంతో ఆత్మహత్య చేసుకోటానికి అక్కడికే వచ్చింది. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. తన స్కాలర్ డబ్బులు పనితో సంపాదించిన డబ్బులుతో ప్రవళిక పై కసితో ఆమె స్నేహితురాలు రవళినే ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అనంతరం ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు.
ఇది ఆనంద్ గతం. తన భర్తకు ఇంత గతం ఉండటం అతడు అనాదిగా మారి అందరివాడుగా మారటం నిజంగా అద్రుష్టంగా బావించింది. కానీ.. ! రవళికి అతడు బాధపడే సందేహం తీరక మరలా అడిగింది.
అప్పుడు ఆనంద్
" నన్ను తొలిసారిగా పనిలోకి పెట్టుకుని నన్ను ఆదరించిన వ్యక్తి రామప్పడు, మంఛి విషయాలు చెప్పి చదువుకునేలా ప్రోత్సహించిన మిగతావాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో.. ఎలా ఉన్నారో... తెలియదు. అప్పట్లో పనికి నాతో సహా అందరూ వేరు వేరు చోట్ల నుండి ఒక ప్రదేశానికి వచ్చి అందరూ వచ్చాక యజమానితో పనికి బయలుదేరేవాళ్ళు. పనిలో ఒరేయ్.. రేయ్.. అయ్యా.. అమ్మ.. అని తప్ప ఏనాడూ వాళ్ళ పేర్లు కానీ.. ఊర్లు కానీ తెలుసుకోలేదు. ఇప్పుడు నేను ఉన్న స్థానం బట్టి వారికి ఖచ్చితంగా సహాయం అందించగలను. వారికి ఆదుకోగలను. కానీ.. ! వారున్న ప్రదేశాలు తెలుసుకోలేకపోయాననే బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది " అని రవళి వద్ద బాధపడ్డాడు.
ఈ విషయం తెలిసి రవళి కూడా బాపడసాగింది.
నిజమే కదా.. కష్టాల్లో ఆదుకునే మనుషులను గొప్పవాళ్ళం అయ్యాక అలాంటి మనుషుల్ని ఆదుకోవటంలో తప్పేముంది.. అతనిలో ప్రవళిక జ్ణాపకాలు కూడా ఉండే ఉంటాయి కానీ అవి రవళికి ఏ ఇబ్బంది తెచ్చి పెట్టవు. ఆనంద్ పై ఆమెకు ఉన్న నమ్మకం.
"గతం ఒక జ్ణాపకం. అది మనకు ఒక్కసారి ఆనందాన్ని, మరోసారి బాధని ఇస్తుంది. మిమ్మల్ని కష్ట సమయంలో ఆదుకున్నవాళ్ళకు తమ పిల్లల రూపంలో బాధలు తీరే ఉంటాయి. వీలుంటే ఆయ ప్రాంతాలకు వెళ్ళి వారి వివరాలు తెలుసుకుందాం. మీరు అనుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు, చింతించకండి " అని భార్య రవళి ఆనంద్ ని ఓదార్ఛింది.
ఆనందంలోనే కాదు బాధలోను తనకు తోడుగా అండగా నిలబడిన భార్య రవళికి హత్తుకున్నాడు ఆనంద్.
****** ****** ****** ******
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Opmerkingen