గిడుగు వాడుక భాష తెలుగు గొడుగు
- Gadwala Somanna

- Aug 29
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Gidugu, #గిడుగువాడుకభాష, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 113
Gidugu Vaduka Bhasha Telugu Godugu - Somanna Gari Kavithalu Part 113 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 29/08/2025
గిడుగు వాడుక భాష తెలుగు గొడుగు - సోమన్న గారి కవితలు పార్ట్ 113 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
గిడుగు వాడుక భాష తెలుగు గొడుగు
--------------------------------------------------
తెలుగు వ్యావహారిక భాషా
ఉద్యమ పితామహుడు గిడుగు
వాడుక భాషకు వన్నె తెచ్చిన
యోధుడు తెలుగు వెలుగు గొడుగు
ఉదయించే సూర్యుని రీతిలా
ఉద్యమించినాడు ఉప్పెనలా
రామమూర్తి ముందడుగు వేసెను
వాడుక భాషకు జీవం పోసెను
రామమూర్తి గారి ఆరాటము
అసమానము వారి పోరాటము
గ్రాందిక భాషకు స్వస్తి పలికి
పంచెను తల్లి భాష అమృతము
గిడుగు వారి జన్మదినమే
తెలుగు భాషా దినోత్సవము
తెలుగు వారికి పర్వదినమే
సంబరము తాకాలి అంబరము

సాటిలేని మేటి తెలుగు
---------------------------------------
తేనె కంటే మధురము
మల్లె కంటే అందము
తెలుగు భాష తమ్ముడు
వెలుగులీను అమ్మడు
చూడ వేణు గానము
ఉంది అందు జీవము
మాతృభాష ఘన తెలుగు
తెలుగు వారికి గొడుగు
భాషలందు గొప్పది
నుడివెను కృష్ణ రాయలు
మరువకుంటే మంచిది
ఎప్పుడు తెలుగు ప్రజలు
సంగీతానికి అనువు
సాటిలేని మన తెలుగు
మేలులెన్నో కలవు
వినిన మోదము కలుగు

కన్నతల్లి కాంక్ష
--------------------------------------
అర్ధం చేసుకునే హృదయము
చిరునవ్వులు చిందే వదనము
ఉంటే జీవితంలో చాలు
అగును భవిత బంగారుమయము
క్షమించగలిగే మంచిగుణము
వైరిని ప్రేమించే తత్వము
కల్గియుంటే మేలు మేలు
అవుతుంది వసుదైక కుటుంబము
చెయ్యందించే ఘన స్నేహము
అవసరమైతే కాస్త త్యాగము
చూపాలోయ్! ఖచ్చితంగా
అపురూపమైన ఐకమత్యము
చివరికి మిగిలేది బ్రతుకున
మానవత్వమే తెలుసుకో
పరోపకారమే మనసున
స్వార్ధాన్ని వదిలేసి నింపుకో
-గద్వాల సోమన్న



Comments