top of page

గుడ్ డేస్ ఆల్వేస్ కమ్


'Good Days Always Come' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 10/11/2023

'గుడ్ డేస్ ఆల్వేస్ కమ్' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


జీవితం అంటే కష్ట సుఖాల సమ్మెళనం.


ప్రతి ఒక్కరూ తమ జీవితం గూర్చి కలలు కంటూ అలా ఉండాలని ఇలా ఉండాలని గొప్పగా ఊహించుకోవటం సహజం. అయితే.. ! అందులో కొంతమందికి మాత్రమే ఆ కలలు సాకారం అవుతాయి. , ఇంకొందరికి ఆ కలలని సాకారం చేసుకునే అవకాశం వస్తుంది. ,

మరికొందరికి ఆ అవకాశం కూడా రాకుండా పోతుంది.


కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదని తెలుసుకుని కొందరు సర్దుకుపోతూ నెట్టుకొస్తారు.


కొందరైతే సాధించేదాక నిద్రపోరు.


అలాంటి వారిలో అక్షర్ ఒకడు.


మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కూడా ఏ దురాలవాట్లు లేవంటే తమ కుటుంబం గూర్చి తన భవిష్యత్ గూర్చి ఎంత కలలు కన్నాడో ఇట్టే అర్థం అవుతుంది.


తల్లిదండ్రులతో ఒకవైపు కష్టపడుతూనే, మరోవైపు చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు అక్షర్.


ఎంత ఖర్చు పెట్టినా.. ! ఎంత కష్టపడినా.. !ఎంత సాధన చేసినా.. ! కొంతమందికి ఉద్యోగం అనేది దక్కదు.

అది వారి ప్రయత్న లోపం అని అనలేం. అలా అని మరికాస్త కష్టపడితే సాధిస్తావని కూడా చెప్పలేం.


తల్లిదండ్రులు

"ఇక మేం నీ ఉద్యోగ ప్రయత్నాలకి డబ్బు సమూకూర్చలేము ఏదో పని నేర్చుకుంటే జీవితంలో సెటిల్ అవుతావ"నేశారు.


ఆ మాటలు అక్షర్ కి బాధించాయి.

తల్లిదండ్రులను మాత్రం ఏమీ అనలేదు. ఎందుకంటే తన ప్రయత్నంలో పట్నంలో ఎన్ని రోజులు ఉంటామో ఎంత ఖర్చు అవుతుందో తెలియని పరిస్థితులు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఆకలితో కడుపు మాడ్చుకున్న రోజులు ఉన్నాయి కాబట్టి ఆ రోజులను తలుచుకుని ఇంకా బాగా సన్నద్ధం కావాలని అక్షర్ ఆలోచన. కానీ.. తల్లిదండ్రుల నిర్ణయాన్ని గౌరవించి ఆపేశాడు.


కనీసం తన చదువుకు సెట్ అయ్యే ఒక ప్రవేటు జాబ్ అయినా సంపాదించి తల్లిదండ్రుల కష్టాన్ని ఆపాలని ఆ పిచ్చి కొడుకు వేదన.


ఈసారి ప్రవేటు జాబ్ కోసం మరోసారి పల్లె నుండి పట్నం వెళ్ళి నిద్ర, ఆకలితో పోరాటానికి సిద్దమయ్యాడు అక్షర్.

తాను అనుకున్నట్టే కంపెనీ ఇంటర్వ్యూ రెండు రోజులకు వాయిదా పడింది.


దీంతో అక్షర్ లో తీవ్ర అసహనం కలిగింది. ఎందుకంటే తల్లిదండ్రుల బాద చూసి వారి నుండి ఏమీ ఆశించకుండా తన దగ్గర ఉన్న కొద్ది మొత్తం మాత్రమే తెచ్చుకున్నాడు కాబట్టి.. ఈ రెండు రోజులకు భోజనానికి సరిపడే డబ్బులు తన దగ్గర లేవని.. ఒకవేళ ఉన్నవి భోజనానికి ఖర్చు చేస్తే తిరిగు ప్రయాణానికి ఏమి ఉండవు.


రెండు పూటలు పస్తులున్నాడు. ఇక చీకటి పడ్డాక కంపెనీకి సమీపంలో రాత్రి 8అవుతున్నా.. ఓ చిన్న తోపుడు బండి పై దోసెలు అమ్ముతున్న వ్యక్తి కనిపించాడు.


అక్షర్ లో శక్తి నశించినా... తనకు తోచిన సహాయం చేస్తాను చివర్లో నాకు రెండు దోసెలు పెడతారా అని అడగాలని అనుకున్నా.. ఆ బండి చుట్టూ జనం ఉండటంతో అడగలేక ఉండిపోగా ఫోన్ రింగ్ అవ్వగా తండ్రి తో మాట్లాడుతున్నాడు అక్షర్.


అప్పటికే అక్షర్ ని గమనిస్తూ వస్తున్న దోసెల బండి వ్యక్తి బాలు ఫోన్ లో అక్షర్ మాటలు వింటూనే తన పని చేస్తున్నాడు.


అక్షర్ ఫోన్లో మాటలు పూర్తి అవ్వగానే

బాలుతో "అయ్యా.. తాగటానికి కొంచెం మంచినీళ్ళు ఇస్తారా " అన్నాడు.


ఆ మాటలకు బాలు తనకు సహాయంగా ఉండే ముసలాయన వీరయ్యతో

"వీరయ్య.. ఈ అబ్బాయి కి ప్లేట్లో మూడు దోసెలు వేసి ఇవ్వు " అన్నాడు.


ఆ మాటలకు అక్షర్ "అయ్యో.. దోసెలకి నా వద్ద డబ్బు లేవండి. కొంచెం మంచినీళ్ళు అడిగాను" అన్నాడు.


"ఫోన్ లో మాటలు నేను విన్నానులేవోయ్.. నాకు నువ్వు ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూర్చో" వీరయ్య ఇచ్చిన దోసెల ప్లేటు తీసుకుని అక్షర్ కి ఇస్తూ అన్నాడు.


అప్పటికే ఆకలితో దహించుకుపోతున్న అక్షర్ ఆ మాటలు, ఆ గౌరవం చూసి కన్నీటితోనే దోసెలు తిన్నాడు.


తర్వాత జనం రావటం తగ్గాక అక్షర్ గూర్చి అన్ని అడిగి తెలుసుకున్నాడు.

"నువ్వు ఇంటికి వెళ్ళిన వరకు ఇక్కడే ఫ్రీ బోజనం" అని,

"కష్టం ఎప్పుడూ ఊరికే పోదు. మనం కష్టపడుతూ పోవాలి. ఏదో ఒక రోజు మంచి రోజులు తప్పకుండా వస్తాయి " అని నచ్చజెప్పాడు బాలు.


బాలుకి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉండగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి విఫలం అయ్యి, కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని, ఇద్దరు కూతుళ్లు పెళ్ళీడుకు రావటంతో మరో ఏడాది లో కూతురు పెళ్ళి చేయటానికి పగలంతా కష్టపడుతూ రాత్రి ఈ పని చేస్తున్నాడని, కొడుకులు పట్టించుకోకపోగా పెన్షన్ డబ్బులు తో బతుకుతున్న వీరయ్యకు పని కల్పించి అతడికి సహాయం చేస్తున్నాడని తెలుసుకున్నాడు బాలు.


రెండు రోజులు బాలునే బోజనం ఖర్చులు భరించగా అక్షర్ పని పూర్తి అయింది. ఆనందించే విషయం ఏంటంటే సాప్ట్వెర్ కంపెనీలలో అక్షర్ ని సూపర్వైజర్ గా నియమించటం. అయితే డ్యూటీ తేదీ మారటంతో ఇంటికి వెళ్ళి రావాలని బయలుదేరుతూ..

బాలు ఆశిర్వాదం తీసుకుని సొంత ఊరు వచ్చి కొన్నిరోజులు ఉండి ఉద్యోగం కోసం పట్నం వచ్చాడు అక్షర్.


రాత్రి 10అవుతుంది కంపెనీలో చేరి. అక్కడే ఇంకా బాలు, వీరయ్య దోసెలు అమ్ముతూనే ఉన్నారు. ఆక్షర్ వారిని చూసినా.. ఏమి పట్టనట్లు లోనికి వెళ్ళిపోయాడు.


అప్పటి నుండి అక్షర్ విలాసవంతమైన జీవితం గడపసాగాడు. బయట ప్రపంచం అక్షర్ కి అనవసరం. ఏదీ కావాలన్నా తన రూం కి తెచ్చే సదుపాయం కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. అప్పడప్పుడు తల్లిదండ్రులును చూసి వస్తుంటాడు.


అలా ఏడాది గడిచింది.


బాలు కూతురు పెళ్ళికి అక్షర్ ని ఆహ్వానిద్దామనుకున్నాడు. కానీ సెక్యురిటి లోపలకి తిరస్కరించారు. అక్షర్ కూడా బయటకు రాడు.

దీంతో వెనుదిరిగాడు బాలు.


కూతురు పెళ్లి వారం రోజులు ఉందనగా బాలుకి కాబోయే బావగారు కూతురు పెళ్లికి కావల్సిన సరుకులు తేవటం చూసి ఆశ్చర్యపోయాడు బాలు.


విషయం అడగ్గా..


" ఎవరో అక్షర్ అంట బావా.. మా ఇంటికి వచ్చి నీ పేరు చెప్పి పేదరికంలో ఉండీ కూడా పదిమంది ఆకలి తీర్చే నిజమైన మనిషి ఇంటి నుండి మీకు ఒక ఆడపిల్ల కోడలిగా వస్తుంది. ఆమెకు కట్నంగా బాలు ఎంత ఇస్తానన్నాడో చెబితే నేను ఇస్తానన్నాడు. అలాగే పెళ్లికి సరిపడే సరుకులు కూడా నేనే బాలు గారి తరూపున కొంటున్నాను వాటిని బాలు ఇంటికి తీసుకెళ్ళండి. పెళ్లిని నేను దగ్గరుండి చేయిస్తాను. అలాగే నా నెల జీతంలో నా సొంత తల్లిదండ్రులు కు సగం, బాలు కుటుంబం నకు సగం వెళ్తుంది ఎందుకంటే బాలుకి నేను కూడా ఒక కొడుకునే కదా దయచేసి నేను చెప్పినది చేయండి అని బతిమాలాడు " అని చెప్పాడు


ఆ మాటలకు బాలు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

" రెండు రోజులు, మూడు పూటలు, మూడు దోసెలు పెడితే తనకు జీవితాంతం ఋణపడి ఉంటాడని కలలో కూడా ఊహించుకోలేద"న్నాడు బాలు.

సొంత కొడుకులా దగ్గర ఉండి బాలు కూతురు కి పెళ్ళి చేశాడు అక్షర్.

అంతేనా.. తన తల్లిదండ్రులను కూడా పెళ్ళికి తెచ్చాడు.


తనకు చేసిన సహాయం తలుచుకుని అక్షర్ కి సాష్టాంగ పడి నమస్కరించాడు బాలు.

అక్షర్ బాలు ప్రయత్నాన్ని నిలువరించి


"ఆకలితో ఉన్న నాకు అడగకుండా అన్నం పెట్టిన మీరు, మీ హృదయం, కటిక పేదరికంలో ఉండీ సాటి మనిషిని అర్థం చేసుకునే మీ మనసు, కష్టపడేతత్వం నాకు నచ్చాయి. ఆ రోజు మీరు నాకు సహాయం చేయకపోతే ఆకలితో నేను చచ్చిపోయేవాడిని. నా సక్సస్ కి ఒక రకంగా మీరే కారణం. పదిమందికి మంచి చేస్తూ మంచిరోజుల కోసం కష్టపడుతున్న నీకు మంచిరోజులు రాకపోతే నేను ఎందుకు.. నా బతుకు ఎందుకు.. నీ నుండి సహాయం పొందిన నేను నీకోసం ఏమీ చేయకపోతే నా బతుకునకు ఒక అర్థం ఉండదు కదా..


ఇంత చేసినా నాకు తృప్తి లేదు ఎందుకంటే పేదరికంలో కూడా నాకు నువ్వు ఉచితంగా బోజనం పెట్టావు. కానీ నేను గొప్పవాడ్ని అయ్యాక సహాయం చేశాను. ఇప్పుడు నేను నీకు కూడా ఒక కొడుకుగానే తోడుంటు రెండో కూతురు పెళ్ళిని కూడా నా ఖర్చుతోనే జరిపిస్తాన"న్నాడు.


"చనిపోయిన కొడుకు బతికున్నా తనను చూస్తాడో లేదో తెలియదు కానీ.. సహాయం పొందిన అక్షర్ బాధ్యత కల్గిన కొడుకులా తోడున్నాడని, తన కష్టానికి మంచి రోజులు వచ్చాయ"ని బాలు దంపతులు..


ఇంతటి మంచి కొడుకు తమ కడుపున పుట్టినందుకు అక్షర్ తల్లిదండ్రులు.. ఉబ్బితుబ్బిబ్బులయ్యారు.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
46 views0 comments

Comments


bottom of page