top of page
Original.png

గోరంత దీపం - కొండంత వెలుగు


గోరంత సాయం… కొండంత ఫలితం
గోరంత సాయం… కొండంత ఫలితం

Goranta Deepam Kondanta Velugu - Telugu Moral Story | Patrayudu Kasi Viswanadham Published In manatelugukathalu.com On 27/03/2026

గోరంత దీపం - కొండంత వెలుగు - తెలుగు నీతి కథ

రచన : పట్రాయుడు కాశీవిశ్వనాథం

వీధి వసారాలోని ఈజీ చైర్‌లో కూర్చుని ప్రశాంతంగా పేపరు చదువుతున్నారు కాశీతాత. ఆయన పక్కనే కూర్చుని ఎక్కాలు వల్లె వేస్తున్నాడు మనవడు రుద్ర. 


అంతలో తాతయ్య ఫోన్‌కు మెసేజ్ అలర్ట్ వచ్చింది. ఆయన వెంటనే ఫోన్ తీసి చూశారు. “అయ్యో పాపం! ఎంత కష్టం వచ్చిందో కదా!” అనుకుంటూ వెంటనే తన ఫోన్ నుండి రూ. 500 ఫోన్ పే చేశారు.


తాతయ్య ముఖంలో ఆందోళన గమనించిన రుద్ర, “ఏమైంది తాతయ్యా? ఎందుకు అలా బాధపడుతున్నావు?” అని అడిగాడు.


అప్పుడే కాఫీ కప్పుతో అక్కడికి వచ్చిన మామ్మ, “మీ తాతయ్యకు మరేం పని లేదు. అదో పిచ్చి! మనం ఇచ్చే వంద, రెండు వందలతో వాళ్ళ రోగాలు నయం అవుతాయా? వాళ్ళు బతికి బట్టకడతారా?” అంటూ మూతి తిప్పుతూ అసహనం వ్యక్తం చేసింది.


రుద్ర అయోమయంగా, “అదేంటి మామ్మ అలా అంటోంది? అది నిజమేనా తాతయ్యా?” అని అడిగాడు.


కాశీతాత చిరునవ్వుతో ఇలా అన్నారు, “అందరూ అలాగే అనుకుంటే ఏ సమస్యా పరిష్కారం కాదమ్మా! ‘రూక రూక చేర్చితే లక్ష అవుతుంది’ అన్నట్లు, ఎవరికి చేతనైన సాయం వారు చేస్తేనే ఆపదలో ఉన్నవారు గట్టెక్కుతారు.”


“నిజమే తాతయ్యా! వాటి సంగతి నాకు తెలియదు కానీ, మొన్న పరీక్షలప్పుడు నా స్నేహితుడి పెన్సిల్ పోయింది. తను పరీక్ష హాల్లో ఏడుస్తూ కూర్చుంటే, నా దగ్గర ఉన్న రెండు పెన్సిళ్లలో ఒకటి ఇచ్చాను. వాడు ఎంతో సంతోషంగా పరీక్ష రాశాడు. మర్నాడు వాళ్ళ అమ్మగారు కూడా నన్ను మెచ్చుకున్నారు” అని తన అనుభవాన్ని పంచుకున్నాడు రుద్ర.


తాతయ్య రుద్ర భుజం తడుముతూ, “నువ్వు నా మనవడివి రా! అందుకే అంత మంచి మనసు. ఈ మధ్యే నా స్నేహితుడి మనవరాలికి ఒక వింత వ్యాధి సోకింది. కోటి రూపాయల ఖరీదైన ఇంజెక్షన్ ఇస్తే తప్ప ఆ చిన్నారి బతకదని డాక్టర్లు చెప్పారు. వారు చాలా పేదవారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అందరి సాయం కోరారు. ఆ మెసేజ్ వైరల్ కావడంతో ఎంతోమంది దాతలు ముందుకొచ్చారు. అందరూ కలిసి ఇచ్చిన ఆ చిన్న చిన్న మొత్తాలే కొండంతలై, అనుకున్న డబ్బు సమకూరింది. ఇప్పుడు ఆ పాప ఆరోగ్యంగా ఉంది. అందుకే అంటారు... గోరంత దీపం కొండంత వెలుగు అని!”


“గోరంత దీపం అంటే ఏంటి తాతయ్యా?” అని అడిగాడు రుద్ర కుతూహలంగా.


“గోరంత అంటే చిన్నది అని అర్థం. ఇదొక జాతీయం. మనం చేసే చిన్న సాయం అవతలి వారికి పెద్ద ప్రయోజనం కలిగించినప్పుడు దీనిని వాడుతుంటాం. కటిక చీకటిలో మనకేమీ కనిపించదు, కానీ ఒక్క చిన్న దీపం వెలిగిస్తే చాలు... ఆ వెలుగులో మనం దారిని చూడగలం. అలాగే సాయం చిన్నదా పెద్దదా అన్నది కాదు, అది అవతలి వారికి ఎంత మేలు చేసింది అన్నదే ముఖ్యం” అని వివరించారు తాతయ్య.


“గోరంత సాయం విలువ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది తాతయ్యా!” అంటూ సంతోషంగా గెంతులేస్తూ ఆడుకోవడానికి పరుగు తీశాడు రుద్ర.

సమాప్తం 


పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం

Patrayudu kasi Viswanadham


విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ., 

ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).

స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం 

విజయనగరం జిల్లా.

నివాసం : శృంగవరపుకోట (ఎస్‌.కోట)

వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం) 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.


ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు  రాయడం 


ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.


సేకరణలు:

**********

1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్‌ వర్క్‌ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి  విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.


విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:

*******************************

1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.


2.మండలస్థాయిలో విద్యార్థులకు  *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.

3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.


బాల రచయితలుగా తీర్చిదిద్దడం

*******************************

బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.

నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో  10 కి పైగా ప్రచురించబడ్డాయి.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


సంకలనాలు :


1.గురజాడ శతవర్ధంతి

కవితా సంకలనం లో  

2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని'         సంకలనం లో 

3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల    సంరక్షణ',

4.'రక్త బంధం', 

5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.

6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల           బంధం' సంకలనం లో 

7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో

9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో 

10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో 

11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో

12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో

13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.

🌷🌷🌷🌷🌷🌷🌷


బహుమతులు

1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016

2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.

3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.

4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో  అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018

7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.

8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి

9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.

ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు. 


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


బిరుదులు : 

1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర, 

2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర, 

3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల, 

4.శతశ్లోక కంఠీరవ, 

5.సూక్తిశ్రీ, 

6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"

7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016

8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.

9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్‌ పురస్కారం 2017,

10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో

11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.

12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023



🌹🌹🌹🌹🌹🌹🌹

ముద్రించిన పుస్తకాలు :


1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),

2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).

3.*దేవునికో ఉత్తరం*  బాలల కధా సంపుటి

4.*అద్భుతం* బాలల కథా సంపుటి

5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.

6.తాతయ్య కల బాలల కథా సంపుటి.

అముద్రితాలు


1*మౌనమేలనోయి* కథల సంపుటి

2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి

3*నీకోసం* భావ కవితా సంపుటి.

4చెట్టు కథలు

5 పేదరాశి పెద్దమ్మ కథలు

6 మృగరాజు సందేశం కథల సంపుటి


ఇష్టాలు


పిల్లలతో గడపడం

బాలసాహిత్య పఠనం

బాలసాహిత్య రచన


ప్రచురణలు


ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల  పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120,  ప్రచురణ అయ్యాయి.

 

🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷

పట్రాయుడు కాశీవిశ్వనాథం, Goranta Deepam Kondanta Velugu, గోరంత దీపం - కొండంత వెలుగు, moral story telugu

 




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page