top of page
Original.png

గౌరవించాలి తప్పక!!

Updated: Jan 29

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #GouravinchaliThappaka, #గౌరవించాలితప్పక

ree

Gouravinchali Thappaka - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 20/01/2025

గౌరవించాలి తప్పక - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


వయసులోన  పెద్దలను

బుద్ధిలోన శ్రేష్టులను

గౌరవించాలి తప్పక

జగతిలోన  మహిళలను


బడిగుడిలో గురువులను

ఇంటిలోన వృద్ధులను

గౌరవించాలి తప్పక

సరిహద్దు సైనికులను


తెలుగుభాష ప్రేమికులను

భారతమ్మ వారసులను

గౌరవించాలి తప్పక

నిస్వార్ధ సేవకులను


కడుపు నింపు రైతులను

ఆదరించే  మిత్రులను

గౌరవించాలి తప్పక

మన జన్మ  కారకులను


ప్రేమలొలుకు మనసులను

పలకరించే వ్యక్తులను

గౌరవించాలి తప్పక

మేలు చేయు మనుషులను


ఆపదలో ఆప్తులను

ఆదర్శ పురుషులను

గౌరవించాలి తప్పక

అత్యంత ఆత్మీయులను


-గద్వాల సోమన్న


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page