top of page
Original_edited.jpg

గ్రామదేవతలు

  • Writer: Chaturveadula Chenchu Subbaiah Sarma
    Chaturveadula Chenchu Subbaiah Sarma
  • Sep 23, 2023
  • 2 min read

ree

'Gramadevathalu - New Telugu Article Written By Ch. C. S. Sarma

'గ్రామదేవతలు' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


ఏ దేశానికైనా గ్రామాలు వెన్నెముక. గ్రామప్రజలు అందరూ సఖ్యతాభావన, దైవచింతన, భిన్నత్వంలో ఏకత్వంతో వుంటే ఆ గ్రామ జీవితం స్వర్గతుల్యం.... ఆస్తికత సదా అందరికీ ఆనందదాయకం. ఈ సృష్టికర్తకు ఎన్నోపేర్లు.... ఏ పేరు తలచినా... కొలిచినా... విన్నపాలు చేరేది ఆ దైవానికే. దైవ నిరసన (నాస్తికత) శాస్త్ర విరుద్ధం. సంకటప్రదం. దైవాన్ని నమ్మకపోయినా, చులకనగా చూడకూడదు.


గ్రామాలు లేనిదే నగరాలు వుండవు. నగరవాసులకు కావలసిన అన్నింటి ఉత్పాదన జరిగేది గ్రామాల్లోనే. ధాన్యం (రైస్), కూరగాయలు, పూలు, పండ్లు గ్రామ ప్రజల సాగుబడి నుండే వస్తాయి. నగరాలకు చేరుతాయి. నగరవాసులు వాటిని వినియోగించుకొంటారు.


ఒకనాడు....


ఆ గ్రామాలు ఎంతో నిర్మలంగా, ప్రశాంతంగా, దైవభక్తి, చిన్నాపెద్దల విచక్షణతో అన్ని కులాల వారు, మతాలవారు సోదర భావంతో సమిష్టిగా అందరూ ఒక కుటుంబీకులుగా కలిసి మెలసి వుండేవారు.


విమర్శారహిత దైవ ఆరాధన... చింతన దానికి ముఖ్య కారణం. రాయిని కూడా నమ్మితే అది దైవం అవుతుంది. నమ్మిక లేనినాడు కొందరు అనుకొన్నట్లు, అంటున్నట్లు అది రాయిగానే కనబడుతుంది.

మన గ్రామ ప్రాంతాల్లో రామమందిరం, శివాలయం, గ్రామదేవతలుగా పిలువబడే మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ, అంకమ్మ, కనకదుర్గమ్మ, పోతురాజుల ఆరాధన పల్లె ప్రజలకు ప్రీతికరం. వారి ఆరాధన వారికి ఆనందదాయకం. ముడుపులు, మొక్కుబడులు, వారి వారి కుటుంబ ఆచారాల ప్రకారం ఆయా దేవతలను పూజించడం, నమ్మడం, గ్రామవాసులకు ఆనందం. ప్రతి సంవత్సరం నవరాత్రుల సమయంలో గ్రామదేవతలకు కుంకుమ పూజ చేసి పానకం, వడపప్పు, టెంకాయలు, పొంగలి (తీపి)లను నివేదనగా సమర్పిస్తారు. ఆ చర్య వారికి పరమానందదాయకం. అది పిన్నలు, పెద్దలు కలిసి జరుపుకునే గొప్ప సంబరం.


అన్ని గ్రామాల్లో శివాలయం, రామాలయం రెండూ వుండకపోవచ్చు. ఆ రెండింటిలో ఏదో ఒకటి, మహాలక్ష్మి గుడి వుండి తీరుతుంది.


విద్యను మనకు చెప్పే గురువుల పట్ల మనకున్న గౌరవం, భక్తి మూలంగానే, మనకు సత్‍విద్య లభ్యపడుతుంది. అలాగే ఆ గ్రామదేవత ఆరాధన..... ఆ గ్రామ ప్రజలను అన్ని విధాలా కాచి రక్షిస్తుంది.


ముస్లిం పీర్ల పండుగ నాడు, హైందవులు వాకిండ్లకు వచ్చి నైవేద్యాన్ని (బెల్లం, బొరుగులు, శనగపప్పు) స్వీకరించే ఆచారం, కొన్ని గ్రామాల్లో వుండినది. అలాగే ముస్లిమ్ సోదరులు హైందవ సోదరులతో కలసి కోలాటం, కులుకు భజన శ్రీరామ చరిత సంకీర్తనలతో పర్వదినాల్లో వారంతా మహానందంగా కలిసి చేసేవారు.


"ఈశ్వర్ అల్లా తేరేనామ్" అని నోరారా పరవశంతో పనిచేసేవారు.


శివప్రభు వాహనాన్ని ఆ ముస్లిమ్ సోదరులు మోసేవారు. ముస్లింలు ఏర్పాటు చేసిన నిప్పుల గుండాన్ని హైందవులు నియమ నిష్టలతో వుండి, ఆ సోదరులతో కలసి పరవశంతో త్రొక్కేవారు. ఆ సెగ అగ్ని కణిక వలన వారికి ఎలాంటి బాధా కలిగేది కాదు. కారణం ఆయాదైవాల (పేర్లు) మీద వారికి వున్న అపార నమ్మిక. చరచరాసృష్టి చక్రం.... జీవుల జీవిత విధానాలకు ఆధారం.... ఆలంబనం.... నమ్మిక.... నమ్మిక.


***

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ree

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page