top of page
Writer's picturePenumaka Vasantha

గుండెపోటు


'Gundepotu' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 30/05/2024

'గుండెపోటు' తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత



వీరయ్య, సంక్రాంతికి పిల్లలు వస్తారని, సరుకులన్నీ..  తెచ్చి వాళ్ళకోసం ఎదురు చూస్తున్నాడు. వీరయ్య, రామా పురంలో చిన్న రైతు. తనకున్న, స్తోమతతో పిల్లలను, చదివించాడు. ఇద్దరు మగపిల్లల తర్వాత, ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లను పట్నం పంపకుండా, ఊరిలో ఉన్న హైస్కూల్ లో టెన్త్ వరకు చెప్పించాడు. ఊరిలోనే వుంటూ వ్యవసాయం చేసే, చెల్లెలు కొడుక్కిచ్చి పెళ్లి చేసాడు. 


కొడుకులిద్దరు, పట్నంలో ఉద్యోగం చేసుకుంటున్నారు. పిల్లలకి, చెరొక ఎకరం పంచి ఇచ్చాడు. తను సంపాదించింది బ్యాంకులో వేసుకుని, వచ్చిన వడ్డీతో సొంత ఇంట్లో వుంటూ కాలక్షేపం చేస్తున్నారు, వీరయ్య, సుబ్బమ్మ. సుబ్బమ్మ, కొడుకులను ప్రాణంగా చూసుకునేది. జబ్బు చేసి, సుబ్బమ్మ చనిపోయింది. 


అపుడు, వీరయ్యను కొన్నాళ్లపాటు మా దగ్గరుండమని తీసుకెళ్లారు, కొడుకులు. కానీ పట్నంలో ఆ ఇరుకు ఇండ్లలో ఇమడలేక పోయాడు. టీవీ చూడన్నారు పిల్లలు.. తోచకపోతే. మాట్లాడే వాళ్ళులేక విసుగు పుట్టేది వీరయ్యకు. ఊరిలో అందరూ బయట అరుగు మీద కూర్చుంటే, పలకరించేవారు. కూతురు, అన్నం వండుకుని, తెచ్చిచ్చి, వెళ్ళేది. ఇక వూరి మీదకు గాలి మళ్ళింది వీరయ్యకు. 


 నెలరోజులు గడిచాక, ఒకరోజు "నేను, మన వూరు వెళ్తారా.. , ! ఇక్కడ తోచుబడి కావటం లేద”న్నాడు వీరయ్య. 


"అవునండీ.. ! మామగారికి ఆ ఊరిలో అలవాటై, ఇక్కడ ఉండలేక పోతున్నారు. మా నాన్నా ఇంతే, మా అన్నయ్య వాళ్ళు పట్నం రమ్మంటే.. రాడు. నాకు, నా ఊరిలోనే బావుంటుందంటాడు. ఒకవేళ వచ్చినా.. , ఒకరోజుండి అందరినీ పలకరించి వెళ్తా”డంది పెద్ద కోడలు గీత. 


 "సరే, నాన్నా!” అని బస్ ఎక్కించాడు, పెద్ద కొడుకు. వెళ్లేప్పుడు, "ఒరే! మీరే, నన్ను చూడాలనిపిస్తే పిల్లలను తీసుకుని పండగలకు ఊరికి రండ”న్నాడు వీరయ్య. 


ఊరికి వచ్చి చల్లగాలి పీల్చుకుంటే, ప్రాణం లేచివచ్చింది, వీరయ్యకు. కూతురు, లక్ష్మి, "నాన్న, ఎట్లా వున్నా”వంటూ వచ్చింది. 

"బావున్నా, తల్లి!, వూరి మీద గాలి, మళ్లింది. మనూర్లో వున్నట్లు, ఎక్కడా ఉండ”దని చెప్పి, పట్నంలో, లక్ష్మికి కొనుక్కొచ్చినవి ఇచ్చాడు. 


ఇక బయట కూర్చుని, అందరినీ ప్రేమగా, పలకరించాడు. "నా కొడుకులు, నాకు రూంలో ఏసీ, టీవీ పెట్టారు. ఎంతసేపు, ఆ రూంలో వుండనూ!". పిచ్చెక్కిపోయి వచ్చానన్నాడు. 


"మిగతా వాళ్ళు కూడా, ‘మనూర్లో వున్నట్లు ఎక్కడా ఉండదు. మమ్మలని పిల్లలు రమ్మంటారు, కాలు, చెయ్యి ఆడినంత, కాలము ఇక్కడనే వుంటా’మని..  చెప్తున్నా”మన్నారు. 


 వీరయ్య కొడుకులు, సంక్రాంతికి, దసరాకి వచ్చి, పిల్లల సెలవులు, అయ్యేదాకా, వుండి వెళ్లేవారు. ఈసారి సంక్రాంతికి, కొడుకులు మాత్రమే వచ్చారు. మనవళ్ళు, పెద్ద చదువులని, రాలేదు. 

 

 ఈసారి, పండగకు, వచ్చినపుడు, కొడుకులు, వీరయ్యతో, "ఇల్లు అమ్మకానికి, పెడదా”మన్నారు. 


"ఎందుకు!? ఇపుడు, ఇల్లు, అమ్మాల్సిన అవసరమేంటని?" అడిగాడు వీరయ్య. 


ఇల్లు, అమ్మితే వచ్చే డబ్బులో వాటాల కోసం పెద్దకొడుకు, చిన్నకొడుకు, దెబ్బలాడుకుంటే, చూసి, వీరయ్యకు ప్రాణం పోయినంత, పనయ్యింది. 


"మీకిద్దరికీ, చెరొక ఎకరం, పొలం ఇచ్చాను కదరా! మళ్ళీ ఈ ఇంటికోసం, దెబ్బలాడుకుంటున్నారు ఏంటి!? ఈ ఇల్లు, ఈ ఊరిలోనే, వుంటూ, నన్ను చూసుకుంటున్న మీ చెల్లెలుకు ఇద్దామనుకుంటున్నా. మీ ఇద్దరూ, ఏ పండుగకో వచ్చి నన్ను, చూసెళతారు. అమ్మ, పోయిన కాడి నుండి, నన్ను, మీ చెల్లి చూస్తున్నది. అందుకు, దానికి ఇది ఇద్దామనుకుంటున్నా" అన్నాడు వీరయ్య. 


 "నీకు ఎపుడూ చెల్లి మీదనే.. , ప్రేమ. చిన్నప్పటినుండి దాన్నే, చూసావు. మమ్మలని..  ఎపుడూ ప్రేమగా చూడలేదు. ఆడపిల్లకు ప్రేమ వుంటుందని, అమ్మ ఉన్నన్నాళ్ళు దానికే అన్నీ దోచిపెట్టిం”దన్న కొడుకుల వైపు, నిర్ఘాంతపోతూ చూసాడు వీరయ్య. 


 "ఊరిలోనే, దానిల్లు కదా! ఇంటికి ఏవి తెచ్చినా, అక్కడికి పోవాల్సిందే! ఇంకా ఎంత దోచిపెడతావు దానికంటూ!" ఇద్దరన్నలు, చెల్లెలిని ఆడిపోసుకున్నారు. 


"మీరే కదరా అపుడు, చెల్లికి ఇవ్వాలని తెచ్చామనేవారు”. 


“ చెల్లిని ముద్దుచేస్తే, మాకు కూడు పెడతారని అట్లా చేసేవాళ్ళం. "


 “మీ అమ్మా, నేను..  ఇద్దరం, ఏనాడూ, మిమ్మలని తేడాగా చూడలేదు. ఆడపిల్ల కొన్నాళ్లే మన ఇంటిలో ఉండేదని దాన్ని కొంత ప్రేమగా చూసామేమో! మీ అమ్మ ఎట్లా చూసేదిరా, మిమ్మల్ని! నాకు కొడుకులంటేనే ప్రాణం. మీరు మీ కూతురును చూసుకుంటే, నేను నా కొడుకులను చూసుకుంటాననేదిరా. " 

 

 "అదంతా, పైమాట కానీ, మా మీద మీకు, ప్రేమ లేదు. చెల్లి మీదనే ప్రేమ ఉంది" అన్నారు కొడుకులు. 


 "చెల్లెలిని, పెద్ద చదువులు, చదివించలేదు. మీకే, చెప్పించాము. మీ చెల్లెలు ఎపుడూ ‘నాన్నా నిన్ను చూస్తున్నా’ ననలేదురా. అన్నయ్యలకు, పట్నంలో ఖర్చులంటుంది. దానికి మీలాగా ఎక్కువ చదువు లేకపోయినా, తల్లితండ్రులను చూసే గొప్పతనముంది. చదువు, సంస్కారం, నేర్పుతుంది, కానీ, మీకు అబ్బలేదది. " 


 "ఈ మెట్ట వేదాంతం మాకొద్దు! కానీ, ఈ ఇంటిని, మన పక్కనున్న, సుబ్బయ్య, కొంటానంటున్నాడు. మా, పిల్లలని పై చదువులకి, అమెరికా పంపాలి. డబ్బు అవసరపడింది, అడ్వాన్స్ తీసుకున్నాం. మాతో పాటు, పట్నం, వచ్చి మా ఇద్దరి దగ్గర చెరి ఆరునెలలు, ఉండ”న్నారు, కొడుకులు. 


ఇప్పటివరకు, రచ్చ బండ దగ్గర నా కొడుకులు, వాళ్ల పాటికి, వాళ్ళు, బతుకుతున్నారు. నా జోలికి, రారు, నేను, ఈఊరు, ఇల్లు వదిలి, ఎక్కడికి, పోననిచెప్పే వీరయ్యకు, కొడుకులు ఇట్లా చెప్పేసరికి, గుండె ఉన్న, వాడికేగా.. గుండెనొప్పని, కుప్పకూలాడు వీరయ్య. 


తీసుకెళ్ళి, హాస్పిటల్లో ఐసీయూలో, పెట్టారు వీరయ్యను. స్పృహ వచ్చిన తర్వాత, ‘భగవంతుడా! ఎందుకు బతికించావు, నన్నూ!, ఎంతకాలం, ఈ ఎదురుచూపులు నేను, చావు కోసము చూసేద’నుకున్నాడు, బాధగా వీరయ్య. 

 

 కొడుకులిద్దరూ..  ఇల్లు అమ్మేసి ఎవరి డబ్బు వాళ్ళు తీసుకున్నారు. ఇక పట్నం తీసుకెళ్తాం రమ్మని వీరయ్యను అడిగారు. 


లక్ష్మి “అన్నయ్యా! నేను తీసుకెళ్తాను నాన్నను. నాకు భారమేమి కాదు. ఆయన తినే పిడికెడు మెతుకులు, మా దగ్గర లేకపోలేదు” అంటూ వీరయ్యను తనింటికి తీసుకెళ్ళింది. 


 లక్ష్మి బాగా చూడటం వల్ల కోలుకున్నాడు, వీరయ్య. 


“నీకేమీ ఇవ్వలేకపోయాను తల్లీ.. !” అని బాధ పడ్డాడు. 


"పర్లేదు మామయ్యా!  నువ్వు పరాయి వాడివి కాదు, మేనమామవు. నాకు అమ్మానాన్న, లేరు. వుంటే.. వాళ్ళకు ముద్ద వేయం. ఇది నీ ఇల్లే.. !అనుకో!" అన్నాడు, అల్లుడు. 


 ఎపుడో, వూరి చివరలో, అరెకరం పొలం కొన్నాడు. దానికి ఇపుడు మంచి రేట్ వచ్చింది. సుబ్బమ్మ, అది ఎపుడైనా.. మన పిల్లలు మనల్ని ఎవరు, చూస్తే వాళ్ళకు ఇద్దామనేది. ఇపుడు దాన్ని అమ్మి ఆ డబ్బు అల్లుడుకు ఇచ్చాడు. 


 కొడుకులు వీరయ్య ఎట్లా వున్నాడో ? చూద్దామని వచ్చారు. అల్లుడు కట్టిన కొత్తింట్లో హాయిగా వున్నాడు. 

"రా.. నాన్నా.. !మా ఇంటికి" అని అడిగారు కొడుకులు. 

"లేదులే రా.. ! ఇక్కడ బాగానే వుంది. నా చేతిలో ఇదివరకు, . ఇల్లుంది కాబట్టి చూసారు. ఇపుడు నా కాడ ఏమి లేదురా.. ? ఎట్లా? చూస్తారు నన్ను. మీ పిల్లలకు, ఇవ్వటానికి ఎంతో కొంత డబ్బు దాచి ఉంచుకోండి. లేకపోతే, నాలాగే గుండెపోటు రాగలదన్నాడు వీరయ్య. 

***

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


31 views0 comments

Comments


bottom of page