top of page

హంసమ్మ హితవు

 #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #HamsammaHithavu, #హంసమ్మహితవు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 138

Hamsamma Hithavu - Somanna Gari Kavithalu Part 138 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 05/11/2025

హంసమ్మ హితవు - సోమన్న గారి కవితలు పార్ట్ 138 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


హంసమ్మ హితవు

-------------------------------------------

మనసులోని కలవరము

తెప్పించును చలిజ్వరము

ఆదిలోనే తరిమితే

ఆరోగ్యము, ఆనందము


కలహాలతో జీవితము

చేసుకోకు నాశనము

నిమ్మళమైన జీవనము

నాకముతో సమానము


ప్రశాంత వాతావరణము

బ్రతుకుల్లో అవసరము

ఇక సృష్టించుకోవాలి

ప్రయత్నించి ప్రతిదినము


లేనిపోని వాటితో

అదుపు లేని నోటితో

మనశ్శాంతి కోల్పోకు

మితిలేని ఆశలతో

ree








జీవితంలో ఉండాలి!

------------------------------

పాటలోని పల్లవిగా

తోటలోని మల్లియగా

ఉండాలి జీవితంలో

మహోన్నత స్థానంలో


నింగిలోని తారకగా

సొగసులీను చంద్రికగా

ఉండాలి జీవితంలో

తావులీను మల్లికగా


పాల కడలి కెరటంగా

భాస్కరుని కిరణంగా

ఉండాలి జీవితంలో

శిరస్సుపై కిరీటంగా


లక్ష్యమే ధ్యేయంగా

స్నేహమే పవిత్రంగా

ఉండాలి జీవితంలో

విలువలు ఆభరణంగా

ree








తాతయ్య మేలి హితోక్తులు

--------------------------------------

వదలాలి దుర్మార్గము

మానాలి అన్యాయము

చేతనైతే బ్రతుకున

చేయాలి ఉపకారము


కొండలాగ బడుగులకు

అండగా నిలవాలోయ్!

గుండెలోని ప్రేమతో

ఆదర్శము చాటాలోయ్!


కాసింత మనిషితనము

మనసులో మంచితనము

చోటు చేసుకోవాలి

ఘనమైన మానవత్వము


చెడుతనమే తరమాలి

మానవునిగా మారాలి

పవిత్రమై హృదయాల్లో

దైవత్వం రావాలి

ree






కోపమే విరోధి

-----------------------------------------

నియంత్రిస్తే కోపాన్ని

ప్రదర్శిస్తే శాంతాన్ని

ఆనందమే సొంతము

ఆరోగ్యమే పదిలము


కోపంలో నిర్ణయము

ఎన్నడూ తీసుకోకు

క్షణికవేశమే ప్రమాదము

మానుకుంటే ప్రమోదము


ఎనలేని కోపంతో

తెచ్చుకోకు కష్టాలు

తెలివిలేనితనంతో

తెంచుకోకు బంధాలు


బద్ద శత్రువు కోపమే

తెచ్చిపెట్టు అనర్ధమే

దానితో పోరాటమే

అక్షరాల సత్యమే

ree










మేలులు చాలా చాలా

-------------------------------------------------

వికసించిన పూవులతో

వెదజల్లిన నగవులతో

మేలులు చాలా చాలా

ప్రేమలొలుకు మనసులతో


ఇంటిలోని పిల్లలతో

మింటిలోని తారలతో

మేలులు చాలా చాలా

సొగసులీను మొక్కలతో


కడువు నింపు రైతులతో

సరిహద్దు సైనికులతో

మేలులు చాలా చాలా

నిజమైన మిత్రులతో


స్వచ్ఛమైన ప్రేమలతో

ఆదరించు చేతులతో

మేలులు చాలా చాలా

బ్రతుకున ఆత్మీయులతో


-గద్వాల సోమన్న

Comments


bottom of page