top of page
Original.png

హితవాక్యమిది!

#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #హితవాక్యమిది, #Hithavakyamidi, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Hithavakyamidi - New Telugu Poem Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 05/08/2025

హితవాక్యమిది! - తెలుగు కవిత

రచన: ఏ. అన్నపూర్ణ

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి


స్నేహానికి వయసుతో పనిలేదు 

అభిమానానికి అర్హత అవసరంలేదు

నీలో మంచిని మెచ్చినట్టే 

లోపాన్ని సరిచేసినవాడే నిజమైన స్నేహితుడు

అలంకారం చేసుకుని పై మెరుగులు దిద్దుకుని 

అద్దంలో చూసుకుంటే బాగానే ఉండచ్చు

ఎదుటివాడు నీ గుణగణాలు చెప్పినప్పుడే 

అసలు సౌందర్యం బయటపడుతుంది

అనుకరణ అందరికి నప్పదు 

శరీరాకృతికి తగినట్టు ఉంటేనే గౌరవం దక్కుతుంది

స్త్రీ అంటే ఎవరు? భారతమాత- కన్నతల్లి -చెల్లి-స్నేహితురాలు-జీవిత సహచరి


ఈ దశలు దాటిన మరో స్త్రీ పట్ల పవిత్రభావం వున్నపుడే పురుషునికి విలువ 

ఇది కేవలం పురుషులకు సూక్తికాదు 

స్త్రీకి కూడా వర్తించే న్యాయం అవుతుంది. 

నిన్నుచూసి నీ చుట్టూవున్నవారు 

మంచి ప్రవర్తన కలిగివుండాలి

నీలో తప్పువుంటే అందరూ దూరంగా తప్పుకుంటారు

మంచిని పదిమందికి పంచు 

చెడును నీతో అంతంచేయి

హితంచేసేది హితవాక్యం 

చెడునుచేసేది నీలోని బలహీనత

తెలిసిమసలుకో తెలివిగా నీ నడత మార్చుకో 

తలెత్తుకుని గర్వముగా నిలబడు

స్నేహానికి వయసుతో పనిలేదు 

మంచిమాట వినడానికి మతం అడ్డురాదు. 


******


-ఏ. అన్నపూర్ణ



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page