'Ide Na Modati Prema' New Telugu Story
'ఇదే నా మొదటి ప్రేమ' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
"అమ్మా.. నేను కాలేజ్ కి వెళ్తున్నాను. ఖర్చులుకు డబ్బులు కావాలి" పూరి గుడిసెలో మూలకు తగిల్చి ఉన్న అద్దం చూసుకుంటు అరిచాడు రవి.
"మీ నాన్ననే అడుగు రా" అన్నది అమ్మ జానకి.
నాన్న వద్దకు వెళ్లి చూడగా అప్పటికే జేబులో డబ్బులు తీసి లెక్కపెడుతున్నాడు శాంతయ్య.
"నా ఖర్చులు కి ఎంత అని అడగకుండా లెక్కపెట్టి ఇస్తారెంటీ నాన్నా" అంటూ తండ్రి చేతిలో మొత్తం డబ్బులు తీసుకుని తన జేబులో పెట్టుకుంటు వెళ్ళిపోయాడు రవి.
తల్లిదండ్రులు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు.
"రెండు రోజులు కష్టపడిన డబ్బులు అయిపోయాయి. పద జానకి, పనికి వెళ్దాం.. "అంటు కంటి చెమ్మ తుడుచుకుని బయలుదేరుతారు రవి తల్లిదండ్రులు.
రాత్రి ఇంటికొచ్చిన రవి , "అమ్మ.. ఆకలి వేస్తుంది" అంటాడు.
జానకి అన్నం తెస్తుంది. తిని బయటకు వెళ్తాడు.
తెల్లవారి రవి కాలేజ్ కి, తల్లిదండ్రులు పనికి బయలుదేరుతారు.
తల్లిదండ్రులు రోజంతా కష్టపడుతుంటే.. చదువు అని వెళ్ళిన రవి అమ్మాయి తో సినిమాలు, షికార్లు, పార్కులు అంటు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సాయంత్రం కి ఇంటికి వస్తాడు.
ఇంట్లో తండ్రి ఎన్నడూ లేని విధంగా పడుకుని ఉంటాడు.
"ఏమైందమ్మా"
"మీ నాన్న కు ఒంట్లో బాలేదు రా" అంటుంది తల్లి.
"హో.. అలాగా.. నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు" అడుగుతాడు.
మనసులో దుఃఖాన్ని ఆపుకుని అన్నం పెడితే తిని వెళ్ళిపోతాడు రవి.
"ఏంటండి.. వీడి ప్రవర్తన.. కాలేజ్ లో అడుగు పెట్టాక పూర్తిగా మారిపోయింది.. బాగా చదివి మనల్ని చూసుకుంటాడనుకున్నాం. కనీసం పని చేసుకునైనా బతుకుతాడనుకున్నాం.. మన కష్టం కూడా అర్థం చేసుకోలేదు".. బాదపడుతుంది జానకి.
" ఊరుకో జానకి.. మనకు ఓపిక ఉన్నంత వరకు పెంచుదాం. తర్వాత దేవుడి దయ" అన్నాడు శాంతయ్య.
తెల్లవారి పనికి బయలుదేరుతున్న శాంతయ్య కు "ఏవండి.. ఆరోగ్యం బాలేదు. ఈ ఒక్క రోజుకి మీరు ఉండండి. నేను వెళ్తాను" అంటుంది.
"అసలే ఇంట్లో డబ్బులు లేవు. రెండు రోజుల్లో అప్పు కట్టమని శివయ్య వస్తాడు. పదవే.. నేను వస్తా" నంటాడు
రవి వచ్చి "నాన్న.. అమ్మతో ఈ రోజు నేను వెళ్తాను. నువ్వు రెస్ట్ తీసుకో" అంటాడు.
తల్లిదండ్రులు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు.
జానకిని చూస్తు సరేనని తలూపుతాడు శాంతయ్య.
కూలిలతో కలిసి తల్లి రాళ్ళు మోస్తుండగా రవి రాళ్ళు కొడుతుంటాడు. అలసిపోతాడు, నీరసించించిపోతాడు. చేతులు బొబ్బలు ఎక్కుతాయి. కాళ్ళు నొప్పులు తట్టుకోలేక కూర్చుంటాడు.
గతాన్ని తలుచుకుంటాడు.
బుద్దిగా చదువులో రాణిస్తున్న తనని రమ్య అనే అమ్మాయి ప్రేమిస్తుంది.
తాను ఒప్పుకోడు. దీంతో రమ్య కాలేజ్ మేడ ఎక్కి చనిపోతా అని బెదిరిస్తుంది. మీట్ అవుదాం అని ఒప్పించి కిందకు దించి
"నేను పేదవాడిని. చదువు నాకు చాలా అవసరం. ముందు నా తల్లిదండ్రులు, తర్వాత నా కేరీర్, తర్వాతే అమ్మాయి అయినా.. అందరికీ న్యాయం చేస్తాను. ఈ సూత్రం మాత్రం నిజం. ఇందుకు ఒప్పుకుంటేనే నిన్ను ప్రేమిస్తా" అంటాడు.
"సరే" అంటుంది రమ్య.
అంతే.. రమ్య మోజులో పడి తనను తాను మర్చిపోయి తనను నమ్ముకున్న తల్లిదండ్రులు కు మోసం చేశానని
తన చెమటని తుడుచుకుని తనతో పని చేస్తున్న తల్లిని చూసి గతంలో రమ్య తో తిరుగుతూ కష్టపడుతున్న తల్లిదండ్రులను చూస్తాడు. రమ్య కి ఇచ్చిన సూత్రాన్ని గుర్తు చేసుకుని, తల్లి తో పనికి రావటం తలుచుకుని
ధైర్యంగా లేచి పని చేస్తాడు.
తల్లితో ఇంటికొచ్చాక మరలా బయటకెళ్తాడు.
రాత్రి పూట దాబా లో పని చేస్తాడు. అలా కొన్ని రోజులు పని చేసి తండ్రి తీసుకున్న అప్పు చెల్లిస్తాడు.
ఒకరోజు కాలేజ్ కి వెళ్ళగా.. రమ్య 'ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావ్ " అంటుంది.
రమ్య ని తీసుకుని ఇంటికెళ్తాడు.
తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు.
తడబడకుండానే "అమ్మనాన్న.. ఈ అమ్మాయి పేరు రమ్య. మీరందరూ సమస్వయం చేసుకుంటేనే నేను నా లక్ష్యం చేరుకోగలను. అందుకే మీకు చెప్తున్నాను" అంటూ తనకు పరిచయం అయిన విధాన్ని చెప్తాడు.
రవి పెట్టుకున్న ఈ సూత్రం లో తమకే మొదటి ప్రాధాన్యం ఇవ్వటంతో ఆ తల్లిదండ్రులు ఆనందం ఆపుకోలేకపోయారు.
అక్కడితో ఆగని రవి తల్లిదండ్రులు కాళ్ళపై పడి "నన్ను క్షమించండి. ఈ అమ్మాయి వలనే నా సూత్రాన్ని నేను మరిచిపోయాను. మిమ్మల్ని బాధ పెట్టాను.
జీవితంలో ఏది జరిగినా మన మంచికే అంటారు కదా.. రమ్య తో తిరగటం వలనే మీరు ఎండలో కష్టపడి పని చేస్తూ కనిపించారు. అదే నాకు నా సూత్రాన్ని గుర్తు చేసింది. అలాగే "ఇదే నా మొదటి ప్రేమ". గతంలో ఎవర్ని ప్రేమించలేదు. నా సూత్రాన్ని అమలు చేయాలంటే.. మిమ్మల్ని డబ్బులు అడగలేక, రమ్య ని వదలలేక మీతో పనికొస్తున్నాను" అని కన్నీరు పెట్టుకున్నాడు రవి.
తండ్రి దగ్గరకు తీసుకొని "మేం కష్టపడి మిమ్మల్ని చూసుకుంటాం. మీరు మాలాగా కాకుండా మంచి జీవితం అనుభవించేలా ఏదైనా సాదించండి. మా వయసు దృష్ట్యా.. అప్పుడప్పుడు మాకు తోడుగా ఉండండి " అన్నాడు శాంతయ్య.
"నాన్న.. పని చేయగలననే నమ్మకం, ఉద్యోగం సాదించగలననే నమ్మకం నాకు ఉన్నాయి. కాబట్టి పని చేసుకునే చదువుతాను. ఉద్యోగం కూడా సాదిస్తా"నన్నాడు రవి
రమ్య తో పాటు రవిని శాంతయ్య - జానకిలు దగ్గరకు తీసుకుని హత్తుకుంటారు.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం :
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం.
Comments