top of page

ఇలా చేస్తే చాలు

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #IlaChestheChalu, #ఇలాచేస్తేచాలు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 92


Ila Chesthe Chalu - Somanna Gari Kavithalu Part 92 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 20/06/2025

ఇలా చేస్తే చాలు - సోమన్న గారి కవితలు పార్ట్ 92 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


లా చేస్తే చాలు

----------------------------------------

ఆత్మీయత పంచితే

ఆదర్శం చూపితే

అవనిలోన అదృష్టం

ఆనందం పొందితే


సంస్కారం చాటితే

సమ న్యాయం కోరితే

ఎంతైనా మేలు మేలు

ధరణిలోన చాలు చాలు


కలహాలే వీడితే

కలవరమే మానితే

భూలోక స్వర్గమేను

కలసిమెలసి బ్రతికితే


చేయి చేయి కల్పితే

మనసు మనసు కలిస్తే

ఏదైనా సాధ్యమే

జీవితాన విజయమే













చిలుకమ్మ ఆవేదన

----------------------------------------

తోడులేని వృద్ధాప్యం

అత్యంత దయనీయం

తలచుకుంటే బహు భయం

దొరుకుతుందా! అభయం


అదుపు తప్పిన యవ్వనం

మితిమీరిన బద్దకం

రెండు కూడా ప్రమాదం

లేదు అందు ప్రయోజనం


శాంతి లేని జీవితం

కాంతి లేని పాతాళం

తలపించును ఇల నరకం

ఊహింప భయానకం


పరిమళాలు వెదజల్లని

సేద్యానికి అనువు కాని

పూలైనా, పొలమైనా

ఒక్కటే బ్రతుకైనా

















నిష్ప్రయోజనం

-----------------

ఎగసిపడే కెరటం

స్థిరత లేని హృదయం

క్షణమైనా నిలువవు

ఫలితాల్ని ఇవ్వవు


తావి లేని పూవులు

నీరు లేని చెరువులు

ఉపయోగమే లేదు

నీతి లేని మనుషులు


ఉప్పు లేని కూరలు

ఫలం లేని తరువులు

వృధా నిజం చెప్పని

మనిషి వట్టి పెదవులు


జాలి లేని చూపులు

ప్రేమ లేని మనసులు

పరికింప శూన్యమే

నిలకడ లేని పలుకులు











టీచర్ ఉవాచ

----------------------------------------

విలువైనది సమయం

సున్నితమే హృదయం

వాడితే బాగు బాగు

వద్దు వద్దు ఇల జాగు


బహు శ్రేష్టము స్నేహం

బ్రతుకులోన దీపం

విలువ ఇస్తే మంచిది

అదే కదా గొప్పది


తప్పరాదు న్యాయం

వీడరాదు ధర్మం

జ్యోతిలా వెలగాలి

నీతితో బ్రతకాలి


ఘనమైనది సహనం

బ్రతుకున బహుమానం

కల్గియుంటే గనుక

అద్భుతాలు ఖచ్చితం








మిత్రుని మాటలు

----------------------------------------

ఉండరాదు ముల్లులా

ఉండాలోయ్! మల్లెలా

ఉన్న ఊరులో మాత్రం

మిన్నగా బ్రతకాలోయ్!


ఉదయించుము తారలా

ప్రవహించుము యేరులా

పదిమందికి సాయమే

చేయాలోయ్! సూర్యునిలా


నవ్వాలోయ్! పువ్వులా

మ్రోగాలోయ్! మువ్వలా

నలుగురి జీవితాల్లో

వెలగాలోయ్! దివ్వెలా


పెరగాలోయ్! చెట్టులా

కావాలోయ్! గట్టులా

ఉంటేనే కడు మేలు

పోరాడే జట్టులా


-గద్వాల సోమన్న

Comments


bottom of page