top of page

ఇప్పటి జీవితం ఇదే!


'Ippati Jeevitham Ide' - New Telugu Poem Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 31/10/2023

'ఇప్పటి జీవితం ఇదే' తెలుగు కవిత

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


జీవితం అంటే ఏమిటో తెలుసుకునే సరికి

చాలా కాలం వృధాగా గడిచిపోతుంది!

గుండెకు గాయం అయినప్పుడు రుధిరం స్రవించినా కనిపించదు ఎవ్వరికి

కంటిలో ఆగని కన్నీరు కురిసినప్పుడే కనిపిస్తుంది.!

చీకటి కూడా తనను తానూ తిట్టుకుంటోంది

తన నీడలో జరిగే దోపిడీలు వికృత చేష్టలను చూడలేక!

పగటి వెలుగు పక్కదార్లు వెతుకుతోంది

పట్టపగలు తనకళ్ళఎదుట జరిగే హత్యలకు ఘాతుకాలకు సాక్ష్యం చెప్పాలేమో అనే భయంతో!

దాహంతీర్చే నదులు ఆవిరి అయిపోతున్నాయి

తనలో కలుపుతున్న మాలిన్యాలను అడ్డుకోలేక!

రోషాగ్ని చల్లారి పొయిన్ది కరుడుకట్టిన మనుషులను చూడలేక

ఘనీభవించిన కాఠిన్యాన్ని కరిగించలేక నిస్సహాయంతో!

క్రూరమృగాలు నడిరాత్రిలో సంచరిస్తాయని అనుకుంటాం

కానీ మనిషి మృగంగా మారిపోయాక

రాత్రికి పగటికి తేడాలేకుండా పొయిన్ది !


స్వేచ్ఛఅనేది కొన్నిటికి మాత్రమే వాడుకోవాలి

విచ్చలవిడి ఐతే ప్రమాదము కొని తెచ్చుకోడం కాగలదు!

ప్రతిమనిషి తప్పులు - పొరబాట్లు చేస్తాడు

వాటిని సరిచేసుకున్నప్పుడు మహారుషి అవుతాడు!

ఆలోచన - నిదానం మంచి నిర్ణయాలకు బాటలు వేస్తాయి

ఒకపొరబాటు తొందరపాటు వేదనకు దారితీస్తాయి!

మనోవేదన మనిషిని కృంగదీస్తుంది

మనోధైర్యం కృంగుబాటును నైరాశ్యాన్ని జయిస్తుంది !

ప్రియమైనది దూరం ఐతే తట్టుకోలేం

అంతులేని దుఃఖం మిగులుతుంది

మరొక అంశం మీద మక్కువపెంచుకుంటే

మొదటి దాన్ని మర్చిపోగలం!

********

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)


41 views0 comments

Comentários


bottom of page