'Jagamantha Kutumbam Naadi' Telugu Kavitha Written By Lakshminageswara Rao Velpuri
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
నవమాసాలు నిన్ను తన గర్భంలో పదిలంగా ఉంచి, ప్రపంచంలోకి తెచ్చేది తల్లి అయితే
నూరేళ్ళు నిన్ను అదే ప్రపంచంలో, చరిత్రకారుడు గా తీర్చి దిద్దేది, నాన్న ఒక్కడే,!
బుడి బుడి నడకల నీ అడుగులు, సక్రమమైన దారిలో పడేలా చేసేది నాన్న ఒక్కడే, తాము పస్తులుండి, నీకు పరమాన్నం తినిపించే వారు కూడా తల్లిదండ్రులే,!
' నిన్ను దేశాన్ని కాపాడే సైనికుడిలా చెయ్యాలన్నా,
'నిన్ను దేశానికి ఉపయోగపడే శాస్త్రవేత్త చెయ్యాలన్నా,
'నిన్ను అన్నివిధాల అనుక్షణం కాపాడుతూ,
వెన్నంటి ఉండే వాడే ఈ కలియుగంలో ప్రత్యక్ష దేవుడు
వాళ్ళు నీ అమ్మా,నాన్నలే
'ఆప్యాయత అనురాగాల కలయిక నీ జన్మ,
తోడు ఉండురా కొడకా! తలకొరివి పెట్టే వరకు,
తల్లి తండ్రులు విషమని తలచిన నాడు,
పుట్టగతులు ఉండవు, ఈ ప్రపంచానికి.
జగమంత కుటుంబం నాది,!
జగన్నాటక సూత్రధారి పరమార్థం,
''తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం
మనస్ఫూర్తిగా తీర్చుకో కొడకా,!!
తల్లితండ్రులు భారమైనా,
' వృధ్దాశ్రమాలకు పంపక,
కుటుంబ భారాన్ని కలిసి మెలిసి
అనుభవించారా సుపుత్రుడా,!!
"జగమంత కుటుంబం నాది.".
********
Comments