సంక్రాంతి
- LV Jaya

- Jan 14
- 2 min read

Sankranthi - New Telugu Poem Written By L. V. Jaya
Published in manatelugukathalu.com on 14/01/2026
సంక్రాంతి - తెలుగు కవిత
రచన: L. V. జయ
సంక్రాంతి
-------------
చల్ల గాలుల అలల పథమున
తెల్ల మబ్బుల మేలి రథమున
వింతగా నాజూకు లొలుకుచు
వచ్చే సంక్రాంతి మాకిచ్చే విశ్రాంతి
చలిని తరిమే భోగిమంటలు
కొత్తదనానికి ఆహ్వానములు
మంచికి వైపుకు పయనములు
మధురమైన పాయసములు
ముంగిట దిద్దిన రంగవల్లులు
అందంగా అమర్చిన గొబ్బెమ్మలు
హరిదాసుల కీర్తనలు
గంగిరెద్దుల నాట్యములు
ఇంటికి చేరే కొత్త ధాన్యములు
రైతుల మోహమున మెరిసే దరహాసములు
కొత్త అల్లుళ్లకు వచ్చే ఆహ్వానములు
అతిధులకు జరిగే సత్కారములు
పిండి వంటల ఘుమఘుమలు
గాలిపటముల రెపరెపలు
పిల్లల ఉల్లాస కేరింతలు
బంధుమిత్రుల ఆప్యాయపు పలకరింపులు
పెద్దలకు మనఃపూర్వక నమస్కారాలు
ప్రకృతికి కృతజ్ఞత ధన్యవాదాలు
పశువులకు గోమాతలకు పూజలు
ఇల్లంతా సంతోషసంబరాలు
-LV జయ
***
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya/profile
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు



Comments