top of page

జీవిత పాఠాలు

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #JeevithaPatalu, #జీవితపాఠాలు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 123


Jeevitha Patalu - Somanna Gari Kavithalu Part 123 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 22/09/2025

జీవిత పాఠాలు - సోమన్న గారి కవితలు పార్ట్ 123 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


జీవిత పాఠాలు

-------------------------------------------

సాహసమే శ్వాసగా

ఆశయమే ధ్యాసగా

ఉంటేనే విజయాలు

పాదక్రాంతమేగా


మంచితనమే వలువగా

మమకారమే మెండుగా

కల్గియుంటే మాత్రం

ప్రపంచమే నీదిగా


విజ్ఞానమే జ్యోతిగా

బ్రతుకంతా నీతిగా

ఉంటేనే గౌరవం

అందరూ ఐక్యతగా


వృత్తిలోన శ్రద్ధగా

హృదయమున్న వ్యక్తిగా

తిరుగులేదు జీవితాన

రాణిస్తే గొప్పగా


ree










అయ్యవారు సూక్తులు

---------------------------------------

చదువుతో పాటుగా

సంస్కారం నేర్పాలి

సమాజాన మేటిగా

జీవించి చూపాలి


పదిమందికి స్ఫూర్తిగా

చేతల్లో నిలవాలి

దేశానికి కీర్తిగా

చిహ్నంగా మారాలి


కాంతులీను దివ్వెగా

జగతిలోన వెలగాలి

సొగసులీను నవ్వుగా

వదనంలో విరియాలి


పరిమళించు పువ్వుగా

బ్రతుకులోన ఉండాలి

రవళించే మువ్వగా

మధురిమలే పలకాలి

ree














కన్నవారు మాన్యులు

--------------------------------------

కన్నవారి మనసును

కష్టబెట్టకూడదు

వారి చెప్పు మాటను

త్రోసివేయకూడదు


అవసాన దశలోన

మంచిగా చూడాలి

వారి గొప్ప మదిలోన

సాక్షిగా నిలవాలి


తల్లిదండ్రుల ఋణమును

ఇల తీర్చుకోవాలి

వారిచ్చిన జన్మను

సార్ధకం చేయాలి


కన్పించే వేల్పులు

కన్నవారు మహిలో

వారుంటే బ్రతుకులు

స్మరించుకో మదిలో

ree







ఆలా!-- ఎలా!

-----------------------------------------

నష్టం వచ్చిందని

కష్టం తెచ్చిందని

కూర్చుంటే ఎలా!

ఎదుర్కో యోధలా


అమ్మ తిట్టిందని

బామ్మ కసిరిందని

బాధ పడితే ఎలా!

ఓర్చుకో పుడమిలా!


ఒంటరి వాడనని

అంతా వ్యతిరేకమని

చింతిస్తే ఎలా!

తలచరాదు ఆలా!


ప్రతికూల తలంపులు

వదిలిపెడితే మేలు

బాగుపడును బ్రతుకులు

ధైర్యముంటే చాలు

ree













పంతులమ్మ సూచనల సరాలు

---------------------------------

కాస్త సంపాదించుకో

పదిమంది అభిమానం

అదే కదా జీవితాన

ఖరీదైన బహుమానం


విడిచిపెట్టు పూర్తిగా

పెనుభూతం అనుమానం

ఆకాశం సాక్షిగా

అలవర్చుకో నమ్మకం


శ్రేష్టమైన స్నేహానికి

లేదు లేదు కొలమానం

సృష్టిలో చూడంగా

అదేనోయ్!అసమానం


క్లిష్ట పరిస్థితుల్లో

నిదానమే ప్రధానం

విలువైన విషయాల్లో

నిలుపుకో అవధానం


-గద్వాల సోమన్న

Comments


bottom of page