top of page

జీవిత సత్యాలు

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #JeevithaSathyalu, #జీవితసత్యాలు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 89


Jeevitha Sathyalu - Somanna Gari Kavithalu Part 89 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 14606/2025

జీవిత సత్యాలు - సోమన్న గారి కవితలు పార్ట్ 89 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


జీవిత సత్యాలు

----------------------------------------

చిన్నప్పుడు దేన్నయినా

నిలబడాలోయ్! పట్టుకుని

పెద్దయ్యాక దేన్నయినా

నిలబడాలోయ్! తట్టుకుని


బాల్యంలో తండ్రి చేయి

పట్టుకుని నడవాలోయ్!

వృద్ధాప్యంలో నీ చేయి

పట్టుకుని నడపాలోయ్!


పెద్దవారి సూచనలు

పాటిస్తే క్షేమకరము

బాగుపడును జీవితాలు

వర్ధిల్లును కుటుంబాలు


మనిషి జీవితం విచిత్రము

తడబడకు ఏమాత్రము

పోరాడితే విజయము

అవుతుందోయ్! నీ సొంతము

ree















అపురూపం నెలవంక

----------------------------------------

నింగిలోన నెలవంక

గొప్పగా వెలసింది

వెలుగులీను మోముతో

ముద్దుగా నవ్వింది


శశిరేఖ మరో పేరు

ఉండు చోటు గగనము

అద్భుతం జననము

చూడు చూడు గమనము


అర్ధచంద్రకారము

ఉట్టిపడును అందము

చీకటి రాత్రుల్లో

అవనికదే దీపము


నెలవంక నవ్వితే

వెలుగుపూలు పూయును

బాగా గమనిస్తే

దాని సొగసు తెలియును


అందాల చంద్రవంక

మందార మాలిక

అందరికీ ఇష్టము

ఎనలేనిది బంధము

ree













అమ్మ ప్రేమ గొప్పది

-----------------

దాచేది కనుపాపలా

అనిశము ఈ లోకంలో

మోసేది నవమాసాలు

తల్లి తన గర్భంలో


కళ్ళల్లో పెట్టుకుని

తన చేతితో పట్టుకుని

చూసుకునేది గొప్పగా

అమ్మ కదా! ప్రేమగా


గోరుముద్దలు పెట్టేది

ఆకలిమంటలు ఆర్పేది

మాతృమూర్తి జగతిలోన

త్యాగమూర్తి గుండెలోన


బిడ్డలకు ఆపద వస్తే

ఆకులా అల్లాడేది

ఒక్కింత జబ్బు చేస్తే

అమ్మ హైరానా పడేది


తల్లి ప్రేమ ఘనమైనది

సృష్టిలోనే తీయనిది

భగవంతుని వరమది

డబ్బులకది దొరకనిది

ree

















కన్నవారిలాంటి వారు

----------------------------------------

పూజలెన్నో చేసినా

తీర్థ యాత్రలు తిరిగినా

కన్నవారిలాంటి వారు

దొరకరు ఎంత వెదికినా


నోములెన్నో నోచినా

జపములెన్నో సల్పినా

కన్నవారిలాంటి వారు

కలనైనా కానరారు


ఎన్ని జన్మలెత్తినా

భగవంతుని వేడినా

అమ్మానాన్నల ఋణమును

తీర్చుట ఇల జరిగేనా


వారి సేవ చేస్తే చాలు

బ్రతుకులో ఉండును మేలు

కన్నవారి కన్న మిన్న

కనుకొనుట నిండు సున్న

ree









నాన్నమ్మ హితవు

----------------------------------------

దుష్టమైన తలపులతో

కఠినమైన మాటలతో

బంధాలను బహు దూరం

చేసుకోరాదు ఘోరం


అమూల్యమైన స్నేహాలు

పవిత్రమైన బంధాలు

త్రెంచుకోరాదు నేస్తం!

వెలలేని అనురాగాలు


కన్నవారి హృదయాలు

సున్నితమైన అద్దాలు

పలు ముక్కలు చేయరాదు

కంటతడి పెట్టించరాదు


గురుదేవుల బోధలను

జీవితాన విలువలను

పెడచెవిని పెట్టరాదు

వాటికి దవ్వు కారాదు

-గద్వాల సోమన్న


Comments


bottom of page