జీవితం.. పండిద్దాం
- Bhallamudi Nagaraju

- 4 days ago
- 1 min read
#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #JeevithamPandiddam, #జీవితంపండిద్దాం, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems,

Jeevitham Pandiddam - New Telugu Poem Written By Bhallamudi Nagaraju
Published In manatelugukathalu.com On 25/11/2025
జీవితం పండిద్దాం - తెలుగు కవిత
రచన: భళ్లమూడి నాగరాజు
ఎందుకీ ఆవేశం
ఎందుకీ అనాలోచిత నిర్ణయం
ఫలించని ప్రేమ
పండని పంట
నిండా ముంచిన వ్యాపారం
అందని ఉద్యోగం
ఇవి కాకూడదు మరణ శాసనాలు ..
చావే సమస్యకు పరిష్కారమా ?
యోచిస్తే మార్గాలే లేవా !
ఒత్తిడిని జయించు
సమస్యలపై యుద్ధం ప్రకటించు
ధైర్యం తో ముందడుగు వేస్తే
విజయం నీకు దాసోహం
నువ్వే అవుతావు ఆదర్శం
ఇదేరా జీవితం..పండిద్దాం ఆశాంతం
..భళ్లమూడి నాగరాజు
రాయగడ.




Comments