top of page
Original.png

జీవితంలో ఉండాలి!

 #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #JeevithamloUndali, #జీవితంలోఉండాలి, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 137


Jeevithamlo Undali - Somanna Gari Kavithalu Part 137 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 30/10/2025

జీవితంలో ఉండాలి - సోమన్న గారి కవితలు పార్ట్ 137 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


జీవితంలో ఉండాలి!

-------------------------------------------

పాటలోని పల్లవిగా

తోటలోని మల్లియగా

ఉండాలి జీవితంలో

మహోన్నత స్థానంలో


నింగిలోని తారకగా

సొగసులీను చంద్రికగా

ఉండాలి జీవితంలో

తావులీను మల్లికగా


పాల కడలి కెరటంగా

భాస్కరుని కిరణంగా

ఉండాలి జీవితంలో

శిరస్సుపై కిరీటంగా


లక్ష్యమే ధ్యేయంగా

స్నేహమే పవిత్రంగా

ఉండాలి జీవితంలో

విలువలు ఆభరణంగా







ప్రతిన బూనాలి!

------------------------------

మనసులోని మలినాలు

కరగాలి కరగాలి

శుద్ధమైన హృదయాలు

కావాలి కావాలి


భేదాభిప్రాయాలు

తొలగాలి తొలగాలి

సమైక్యత భావాలు

విరియాలి విరియాలి


పగ, ప్రతీకారాలు

మానాలి మానాలి

అన్నదమ్ముల మాదిరి

బ్రతకాలి బ్రతకాలి


మదిని కుళ్ళు కుతంత్రాలు

వీడాలి వీడాలి

హానికరం వివాదాలు

అణచాలి అణచాలి
















జన్మ సార్ధకం కావాలి!

------------------------------------

వరైనా పడిపోతే

ఏమాత్రం నవ్వరాదు

జీవితాన ఎదిగితే

ఎప్పుడూ ఏడ్వరాదు


ఎవ్వరూ వాస్తవాన్ని

కలకాలం దాచలేరు

ఉదయించే సూర్యున్ని

కలనైనా ఆపలేరు


ఎన్ని సార్లు చెప్పినా

సహనమెంతో చూపినా

మూర్ఖులను మార్చలేరు

విశ్వ ప్రయత్నం చేసినా


వినాలి నగ్న సత్యాలు

జీవితాలు మారాలోయ్!

శ్రేష్టమైన మనిషి జన్మ

సార్ధకం కావాలోయ్!










వట్టి మాటలు కట్టిపెట్టు

-----------------------------------------

ఉరుముల శబ్దాలకు

పంటలు పండేనా!

ఉత్తి ఉత్తి మాటలకు

విలువలు ఉండేనా!


చినుకులు రాలితేనే

మాటపై ఉంటేనే

కార్యాలు జరిగేది

ఫలితాలే వచ్చేది


బ్రతుకున ఎదిగేందుకు

పరిశ్రమ అవసరము

సమస్యల సాధనకు

జ్ఞానం పరిష్కారము


యోచిస్తే చక్కగా

జవాబు దొరుకుతుంది

బ్రతికితే గొప్పగా

లోకం హర్షిస్తుంది













చిలుకమ్మ సూక్తులు

-------------------------------------------------

విశ్వాస ఘాతుకులను

సంఘ విద్రోహశక్తులను

ఏమాత్రం నమ్మొద్దు

సహవాసం చేయొద్దు


తిరస్కార బుద్ధులను

పనికిమాలిన సుద్ధులను

ఉంచాలి దూరంగా

బ్రతకాలి గౌరవంగా


పేదోళ్లకు అన్యాయము

చేయరాదు ఓ నేస్తము

మదిని కల్గియుండాలి

శ్రేష్టమైన దాతృత్వము


ఆశ్రయిస్తే దైవాన్ని

అర్పిస్తే హృదయాన్ని

ఎంతైనా క్షేమమే!

జీవితాల్లో లాభమే!

-గద్వాల సోమన్న

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page