జినుడా శతకము
- Sudarsana Rao Pochampalli

- Oct 30
- 8 min read
#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #JinudaSathakamu, #జినుడాశతకము, #TeluguSathakamu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Jinuda Sathakamu - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 30/10/2025
జినుడా శతకము - తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
(కందం)
1.)కలుగను ప్రబుద్ధు లనగను
తలిదండ్రి హరుసము కనగ తనరగ నుండన్
ఖలుడుగ మారిన దుఃఖమె
కలుగును వారికి నిరతము కాంచగ జినుడా
2.)సుతులన లేకను మనిషికి
గతులును లేవని తలచుచు ఘనమగు పూజల్
సతిపతు లనగను దలతురు
సుతులన గలిగిన తమకిక సుఖమని జినుడా
3.)సంతుయు లేకను కొందరు
ఎంతయొ బాధతొ కుములుతు ఏడ్చెద రనగన్
సంతుయు కొరకని కడుదురు
సంతస మొందుచు సుతుసుత సంతని జినుడా
4.)సంతుయు గలుగను నెంతయొ
అంతము లేనగు అరుసము అగునిక జూడన్
వంతుయు జూచుచు మేధా
వంతుడు కాగల డనెడును వాంఛిత జినుడా
5.)ఉంగావ్ ఉంగావ్ అనెడును
బంగారు సుతుడిని కనగ బాగని పించన్
పొంగారు మనసు తల్లియు
పొంగేను మనమున తనివి పొందుచు జినుడా
6.)చొల్లుయు గారిన ఓర్చుచు
తల్లులు సుతులను సతతము తగులము తోడన్
పిల్లలు గలుగుటె ముదమని
చల్లని మనసుతొ కనెదరు చక్కగ జినుడా
7.)కదులుతు మెదులుతు కసరతు
ముదమన జేయగ తనయుని ముద్దిడు కుంటున్
హృదయము రంజిల నుండగ
సదనము నందున గనెదరు సౌఖ్యము జినుడా
8.)పాడగ పాటలు వినుచును
ఆడుచు కేరింత లనగ అడ్డపు బట్టిన్
చూడను ముద్దులు ఒలుకను
నాడిక తల్లికి హరుసమె నయముగ జినుడా
9.) ప్రేమతొ బెంచుచు తల్లియె
రాముని వలెనన బెరుగను రమణియె గోరున్
క్షేమము గుండను సుతుడన
దేముని గొలుచును మనసున దెలువగ జినుడా
10.) ఉపతప్త గలుగగ సుతుకు
తపనయు జెందెడు మనసగు తల్లిని జూడన్
విపరీత బాధ జెందుచు
ఉపచార ముజరుప జవము ఒలయును జినుడా
11.)నలకవ తగ్గగ సుతునకు
అలసట తీరిన విధమున అమ్మను జూడన్
విలపిత ముఖముయు విరియగ
పలుకును నగుముఖ మనగను ప్రసువిక జినుడా
12.)సంపరా యుడనగను గలుగగ
ఇంపగు తలిదండ్రి కనగ ఇలలో జూడన్
సొంపుయు గనుచును సుతునకు
చెంపలు నిమురుతు అనురతి చేతురు జినుడా
13.)పండుగ లనుచును జేతురు
మెండుగ సుతులును గలుగను మేదిని జనులున్
దండుగ అనకను వ్యయమన
నిండుగ మనసుతొ హృషియని నిగుడుచు జినుడా
14.) దినకరు కరణిన బాలుడు
దినదిన మనగను బెరుగుచు దీప్తిగ దోచన్
కనగను అందము ఉడుపతి
అనగను తలిదండ్రి మురియు అపుడిక జినుడా
15.)నడకయు నేర్చెడి పట్టిని
జడువక ఉండను గనుచును జాగ్రత జూపన్
నడకలు వేయుచు తడబడ
పడునని హడలుచు కొడుకును పట్టును జినుడా
16.)వచ్చియు రానియు మాటలు
అచ్చెరు వొందుచు వినెడును అమ్మను జూడన్
బుచ్చోడ ఏమిటనుచును
అచ్చము బలుకగ దెలుపును అపుడిక జినుడా
17.)పుట్టిన దాదిగ వేడుక
పట్టికి జేతురు పలువిధ పండుగ లనుచున్
చుట్టము పక్కము బిలుచుచు
అట్టహసితమిక సదనము అనగను జినుడా
18.)అమ్మయె ఆటలు పాటలు
ఇమ్ముగ నేర్పును సుతునకు ఇలలో గనగన్
కమ్మని తిండియు బెట్టును
సమ్మత మొందగ రుచిగని సరిపడ జినుడా
19.)ఆడను గుర్రము ఇంకను
మూడవ యేటనె సయికిలు ముచ్చట పడగన్
ఆడుట కెన్నియొ దెచ్చియు
చూడను సంబుర మనుచును సూనుని జినుడా
20.)చదువను జూతురు చక్కగ
ముదమన జెప్పుచు మృదువుగ ముద్దిడు కుంటున్
పదములు నేర్వగ జూచియు
చదువను అనుచును బడికిక సాగను జినుడా
21.)బడికని పంపుచు ఉండగ
అడుగులు వేయక సరిగను అమ్మను జూస్తున్
అడుగులు వెనుకకె వేయుచు
బడికిని పంపగ వలదను బాలుడు జినుడా
22.) పంతులు జెప్పిన పాఠము
ఎంతయొ జాగ్రత వినమని ఎరుగగ జెపగన్
సుంతయు జదువని సుతుగని
అంతట తలిదండ్రి మనము అలమటె జినుడా
23.)చదువులొ వెనుకను బడగను
అదురుచు తలిడండ్రి సుతుడు ఆగము అనుచున్
మదిలో బెంగతొ అనెదరు
చదువను నిలకడ గలిగియు చక్కగ జినుడా
24.)దినదిన మనగను సుతుడును
మనసిడి జదువను జదువిక మనసుకు ఎక్కన్
కనగను తలిదండ్రి కలత
అనగను ఉండక తొలుగును అపుడిక జినుడా
25.) పందెము నందున సుతుడును
అందరి కంటెను ఘనతని అనగను దెల్వన్
డెందము నందున ప్రీణన
మొందెడు తలిదండ్రి ముఖము మోదమె జినుడా
26.)ఆటలొ పాటలొ చదువులొ
మేటిగ నిలిచిన కొమరుడు మేలని దల్వన్
మాటయు మృదువుగ బలుకగ
బాటలొ బడెనని తలపున భాగ్యమె జినుడా
27.)ఎదుగుచు ఉండగ బెరుగును
చదువులు అనగను సుతునకు చక్కగ సాగన్
చదువులు బెరిగిన కొలదిగ
అదుపున లేనగు వ్యయమన అగునిక జినుడా
28.)వ్యయముకు ఎంతయు వెరువక
నయమగు విద్యను చదువను నందను డనగన్
ప్రియమని ఊరక ఉండక
జయమన గోరుచు చదువు కు జంకరు జినుడా
29.)గజమెత్తు పెరుగు వరకును
భుజమున ఎత్తుక తిరుగును బుద్ధియు జెబుతున్
స్వజుడిని తండ్రియె బ్రేమతొ
రుజువదె కనగను తనయుడు రుక్మము జినుడా
30.) లోకము అంటెనె సుతుడగు
మాకును గూల్చిన అహిరిపు మహిమల కన్నన్
వీకమనునికను దండ్రియె
రేకుల ఇంటిలొ గడిపిన రేడను జినుడా
31.)ప్రేమతొ బెంచిన సుతయె
ప్రేమతొ తలిదండ్రి ననగ బెంచును జూడన్
భామలె జూడను ఓరిమి
భూమిన ఉందురు కనగను భూరిగ జినుడా
32.)తనయుల కెంతయు బెట్టిన
కనగను తలిదండ్రి నెపుడు కానరు జూడన్
మనుషులు కొందరు ఉందురు
కనగను జనమున స్వకామి ఖలులన జినుడా
33.)తల్లిని తండ్రిని గానని
కల్లరి సుతుడును గలుగగ కలతయు జెందన్
ఉల్లము నందున బాధతొ
తల్లియు తండ్రియు బడెదరు తనకలి జినుడా
34.)సతతము కొడుకుల చదువని
గతియును లేకను విడువక ఘనముగ జదువన్
శతమాన మయిన అమ్మియు
సుతునికి వ్యయమన దలుతురు జూడగ జినుడా
35.)కుముదుండయ్యును కొడుకును
సముదాయించును సరిగను చదువుము అనుచున్
మమకార మొదులక విధిగ
కొమరుడు జదువుటె పరమము కొసకను జినుడా
36.)మెండుగ ఉన్నను దనయుడు
మెండుగ జదువుటె సరియను మేలగు విధమున్
మెండుగ జదువగ దండ్రికి
మెండుగ కీర్తియు ఒనరును మేదిని జినుడా
37.)కమ్మగ దినగను బెట్టిన
ఇమ్ముగ జదువని సుతుగని ఇలలో తల్లుల్
సమ్మత మొందక గుదులుచు
దుమ్ముయు దులిపెద రికనన దుష్టుని జినుడా
38.)ముడుపులు గట్టగ కడుపున
కొడుకులు బుట్టగ మనసిక కొండాటనగన్
కొడుకుల బెంచుటె కష్టము
చెడుపగు పనులును కొడుకులు చేయగ జినుడా
39.)ఒకరికి మించిన సుతులన
సకలము సమకూర్చ మనిషి సాహస మనగన్
సుకరము అగునటు జేయను
ఇకనన ఇడుములు పడుటయె ఇంటను జినుడా
40.)తనయుల చదువుల కొరకని
అనయము వ్యయమన దలచియు అప్పులు జేసిన్
ధనమన ఇచ్చుచు ఉందురు
తనయులు బాగుగ జదువగ తగినటు జినుడా
41.)ఇల్లుయు అమ్మగ నుందురు
తల్లియు తండ్రియు తనయులు తనరగ జదువన్
లొల్లియు జేయక నుందురు
ముల్లెను ఈయగ సుతులకు ముదముగ జినుడా
42.)చదువులు ముగిసిన పిదపను
హృదయము మారును సుతులకు హృదిలో మెలగన్
పెదవిని విప్పియు బలుకరు
ముదునష్టపు బుద్ధితొనన మూర్ఖులు జినుడా
43.)కమ్మగ బెట్టిన దినెదరు
అమ్మని నోటను బలుకరు అవివేకులనన్
అమ్మయు అయ్యయు లేకను
ఇమ్మహి సుతులకు కనగను ఇంపా జినుడా
44.)ఒక్కడు పదుగురు సుతులను
అక్కున జేర్చుక భరించు అంగద మనకన్
చక్కగ తలిదండ్రి మనుచ
ఒక్కడు ముందుకు జరుగడు ఓర్పుతొ జినుడా
45.)అప్పుల వారును అడుగగ
తిప్పలు మాకేల అనుచు తిక్కగ అనుచున్
గొప్పలు బోవుచు కొడుకులు
అప్పులు దీర్చను సుతులిక అడరరు జినుడా
46.)వివహము అయ్యెడు వరకని
అవసర మనచును కొడుకులు అయ్యయు చెంతన్
నివసము దలుతురు ఇంకన్
అవసర మనునది అమరగ ఆగరు జినుడా
47.)ముందర ఆస్తిని బంచను
కొందరు కోరుదు రనగను కొడుకులు అందున్
తొందర జేయుచు ఆగక
ఉందురు తలిదండ్రి వగవ ఉరసులు జినుడా
48.)తల్లిని తండ్రిని గొట్టెడు
కల్లరి సుతులును పుడమిన కనగను ఉండన్
అల్లరి నిత్యము జేతురు
ముళ్ళకు నడుమన బతుకన ముదుకల జినుడా
49.)తనయుడు దుష్టుడు అయినను
మనమున తల్లికి అభిమతి మానక నుండన్
తనయుడు మాత్రము దలువడు
వినయము తలిదండ్రి ఎదుట వినగను జినుడా
50.)పలువురు జూచుచు ఉన్నను
దలువరు కొందరు సుతులన తప్పని మదిలో
నిలయము అంతట గొడవలు
కలుగగ జేతురు సతతము కానగ జినుడా
51.) కొందరు కొడుకులె అందము
ఉందురు కనగను సుగుణులు ఉర్విన జూడన్
అందరు మెచ్చగ నుండగ
బంధము తలిదండ్రి దెపుడు బాగని జినుడా
52.)మంచిది మాటన మూర్ఖుకు
కొంచెము బట్టక మదినిక కోపము జూపున్
అంచిత భావము జూపడు
ఇంచుక తలిదండ్రి ఎరుగ ఇలలో జినుడా
53.)ఆలివి మాటలె అమృతము
మేలన కుందురు జననిక మేలని జెప్పన్
గోలయు జేతురు ఇంకను
నేలను గలరన సుతులును నెరుగగ జినుడా
54.)క్షమగల చరితులనగను
క్షమమున తలిదండ్రి దొరయ ఘనతన లేకన్
క్షమయన దెలువక నుండు
క్రమమన నుందురు సుతులును గాంచగ జినుడా
55.)తనయను ప్రేమతొ బెంచగ
వినయము వీడుచు విపులన విధమును జెడుచున్
దనయలు బెరుగగ తపనయె
అనగను తలిదండ్రు లికను ఆగమె జినుడా
56.)కూతురు బెరుగుచు నుండగ
మాతకు పితరుకు గలుగును మనమున చింతే
కూతురు చెడుగను నడువగ
మాతకు పితరుకు భవితన మల్లడె జినుడా
57.)తనయయు కీర్తికి లోపము
అనగను కలిగించ వినగ అదియును చేటే
కనగను కులమున మన్నన
అనిలము నందున గలిసిక అనగను జినుడా
58.)ఎంతయొ ప్రేమతొ బెంచిన
సుంతయు గౌరవ మనకను సుతయన నుండున్
చింతయు నిలయము గనకను
పొంతన గుదురని మనిషితొ పోవును జినుడా
59.)గతులన గలుగను సంతని
వెతతో దేవుని దలువగ వేదనె మిగులన్
గతులను మార్చును సుతుడును
సుతయును గలిగియు బతుకున సుడియన జినుడా
60.)కలుగను సుతయన దమకును
నిలయము నిండెను అనుచును నిదురయు బోకన్
బలమగు బ్రేమతొ బెంచుచు
చెలువము జూచుచు మురుతురు చెప్పగ జినుడా
61.) హరియను రెండక్షరములు
హరియించును కష్టము లన హారతి ఈయన్
మరియిక కొమరుని కెలవన
పరికించ కులము పరువును బాపును జినుడా
62.)సుతనిక మగనాలు గనియు
సుతునకు శాలిని వహించ సుగుణపు శీలిన్
బతుకను దెచ్చియు నుండన్
సుతుడిక తలిదండ్రి గనడు సుంతయు జినుడా
63.)కన్నది పాపమె అనుకొని
ఎన్నియొ బాధలు వహించి ఏదను దనయుల్
మన్నన యెరుగక నుండిన
తిన్నది జీర్ణము జరుగక తిప్పలె జినుడా
64.)అటునిక ఏడుగ తరములు
ఇటునిక ఏడుగ తరములు ఇంపని జూడన్
ఎటునుంచి గలిగె మాకీ
కుటిలపు బుద్ధగు కొమరుడు కులమున జినుడా
65.)మానస పుత్రుడె తుదకు
స్థానము లేకను ఒనరుచు స్థవిరులు అనియున్
గానక తలిదండ్రి నిక
ప్రాణము నిలుచుట వరకును ప్రాపన జినుడా
66.)కొడుకులు ఎందరు ఉండిన
కొడుకులు ఉందురు సుగుణులు కొందరె అనగన్
కొడుకులు లేనగు వారిక
కొడుకుల మమతలు చవిగొన కోరును జినుడా
67.) క్షణమొక గుణముతొ సుతుడన
రణగొణ ధ్వనులను సదనము రమణన జేయన్
దినదిన మనగను కష్టమె
కనియును ఎరుగడు దనయుడు ఖలుడయి జినుడా
68.)తమ్ముల జూస్తెను ఓర్వక
ఇమ్మహి అన్నలు అనగను ఇరుకగు మనసున్
అమ్మయు అయ్యయు జెప్పిన
సమ్మత మనకను తగవులె సాగును జినుడా
69.)చదువుట కొరకని తల్లియు
కుదువను బెట్టగ తొడుగులు కుటిలము లేకన్
మదినిక దలువడు సుతుడన
చదువుల పిదపను తొడుగులు సమకొన జినుడా
70.)చెల్లెలు పెళ్ళికి వ్యయమన
కల్లరి అగుచును కొడుకను కష్టము అనుచున్
ఇల్లును అమ్మగ బూనగ
అల్లరి జేయును తగదని ఆపును జినుడా
71.)ఇంటిని నడుపను తోడన
వెంటనె అనునిక సుతుడును వేరని జెబుతున్
జంటగ ఆలిని దోడ్కొని
ఇంటిని వీడును నిలువక ఇమ్మని జినుడా
72.) కలుగను కొడుకుకు బిడ్డలు
పిలువగ వద్దను సరసకు పిల్లల బ్రేమన్
తలువడు సుంతయు బాధన
కలతగు తలిదండ్రి మనసె కాంచగ జినుడా
73.) అమ్మకు నాన్నకు బంధువు
సమ్మత మొందరు సుతులన సరసకు రాగన్
నిమ్మళ బడుచును బలుకరు
ఇమ్మహి కొందరు కొడుకులు ఇటులనె జినుడా
74.) అత్తకు మామకు ఆలికి
తొత్తుగ సుతుడిక నిలుచును తోషము అనుచున్
మొత్తుక జచ్చిన దలువడు
ఎత్తను తలిదండ్రి ఫణితి ఎరుగగ జినుడా
75.)ముసలగు వారిని జూచుచు
కసురెడి కోడలు కొడుకుల కానగ నుండన్
పసితన మందలి సేవల
దెసయన మరచియు అధమమె తెరగను జినుడా
76.) జననికి జనకుకు తనయులు
కనగను మోసము తలుచుచు కలతలు రేపన్
జననియు జనకుడు వ్యథతో
తనయుల పైన విసువాస తలువరు జినుడా
77.)ఎంతయొ ప్రేమతొ బెంచిన
కొంతయు మరియాద అనరు కొడుకులు జూడన్
పంతము బట్టిన విధమున
సుంతయు మారరు కనగను శుంఠులు జినుడా
78.)తనయుల గొప్పలు జెప్పెడి
జనకులు కనరన మురువుతొ జగమున జూడన్
తనయులు గూడను తగువిధ
మనగను జూపను వినయము మన్ననె జినుడా.
79.)ముదుసలి కాకను మునుపన
పొదుపను భావము గలిగిన పొదుపెటుల అగున్
సదనము పిల్లలు బెరుగుట
చదువులు మున్నగు వ్యయముయు చాలక జినుడా.
80.)సంతుయు గలుగగ మనమున
ఎంతయొ తృప్తియు గలుగగ ఎరిగియు నుండన్
సంతుయె దుష్టులు అవగను
అంతయు తృప్తన కరుగుట అగునిక జినుడా
81.)ధనవంతుడునుయు బీదయు
తనకును సంతుయు గలుగను తాపము జెందన్
తనయులు గలుగను వారిక
వినయము తోడను బెరుగగ వీకమె జినుడా
82,)ఆస్తికుడయినను తండ్రికి
నాస్తికు డనగను సుతుడును న్యాయము గాకన్
నాస్తికు డాస్తికు మధ్యన
వాస్తవ గరువము మరుగగు వారిలొ జినుడా
83.)తనయుల బాగును గోరుచు
జనకుడు ఉండును సతతము జగమున జూడన్
వనమున మృగముల రీతిన
తనయులు బెరుగగ జనకుడు తలకగు జినుడా
84.)అందము అనగను పుడమిన
అందరి కుండును కనగను ఆదరణుండన్
అందము సంతుకు అధికము
అందరి కంటెను జననికి అవనిన జినుడా
85.)కలియుగ మందున ఓపిక
కలికికె తనయుల పయినను కలిగియు నుండన్
కలిమియు వారలె అనగను
మలినపు బుద్ధితొ తనయులె మరుతురు జినుడా
86.)బలమగు కోరిక అనగను
తలికన నుండును తనయులు తనరగ నుండన్
ములుకులు గుచ్చెడు పలుకులు
పలుకగ తనయులు ముఖమగు పలుచన జినుడా
87.)కొందరె కొడుకులు ఉందురు
అందరి కంటెను ఘనులన అవనిన జూడన్
మందపు బుద్ధితొ తలిపిత
కెందుకు సేవని దలువను ఖేదమె జినుడా
88.)కోరక ధనముయు ధాన్యము
కోరిక ఒకటెను అనగను కొడుకులు బుట్టన్
కోరిక ఫలమన కొడుకులు
తేరగ తలికిని మనసిక తేకువె జినుడా
89.)కొందరు సుతలన ఉందురు
మంథర వారసు లనగను మహిలో గనగన్
అందరి తీరుగ ఉండక
అందులొ జననికి జనకుకు అవిధిగ జినుడా
90.)తనయులు మనమున ఇఛ్చతొ
వినయము తోడను జనకుకు విలువను ఈయన్
మునుపటి ప్రేమను దలచుచు
ధనికుడు అయినను విడువక ధర్మము జినుడా
91.)యోగము భోగము రెండును
భాగమె బతుకున కనగను భాగ్యము అనగన్
యోగము అనగను పుత్రులు
భోగము అనగను కలిగెడు భోగ్యమె జినుడా
92.)ధనమన పలు విధములనగ
ధనమన సంతుయు ధనమన ధర్మము గాగన్
ధనమన తృప్తియు బతుకున
ధనమన ఆరోగ్య మగును ధరణిన జినుడా
93.)కంటికి వెలుగన సుతుడగు
ఇంటికి దీపమ సుతయగు ఇలలో గనగన్
రెంటిలొ భేదము లేకయు
మింటికి ఎత్తున మురిపెము మీరును జినుడా
94.)ముదిమిన నుండగ కొడుకులు
అదుపులొ నుంచను దలుతురు అమ్మను నాన్నన్
ఎదిగిన కాలము మరతురు
ముదిమను ఠవఠవ కనకను మూర్ఖులు జినుడా
95.)మరణపు దారిలొ ఉన్నను
భరణము కొందరు సుతులకు భారము కాగన్
శరణము గోరుట తప్పదు
జరయను కాలమె మనిషికి శాపము జినుడా
96.)కొడుకులు బిడ్డలె తమకును
కడకగు ఆధరు వనుచును కాంచగ నుండన్
కొడుకులు కొందరు అనగను
గడుగాయ లగుచు స్థవిరుల గానరు జినుడా
97.)దారుణ మీముది మనగను
నారము లెండగ జలచర నలకువ వోలెన్
గారవ మొందిన తనయులె
చేరను దీయరు దరికిని చెప్పగ జినుడా
98.)ముద్దని ఆశ్రమ ముండెడి
ముద్దగు చంటిని వహించి ముదముతొ బెంచన్
పెద్దగ బెరిగియు వృద్ధుల
పెద్దల ఆశ్రమ మనుచును వేయును జినుడా
99.)పున్నామ నరకము అనగ
ఎన్నోనొ ఇడుములు అనుచు ఎరుగగ నుండన్
పున్నామ బాప సుతుగన
పున్నామ మన నొడబడడు పుత్రుడు జినుడా
100.)ముదిమిన గుడ్డియు చెవుడుయు
మొదలవ కదలని విధమవ మొండిగ నడువన్
అదనుయు దప్పియు పడగను
సదనము నందున కొమరుల శషభిషె జినుడా
101.) శేషావ వస్థలొ కొడులు
పాషాణ హృదయులు అగుచు పాపము అనరున్
యోషాయు జన్మకారకు
శేషావస్థలొ గనరన సేమము జినుడా
102.)అనపత్యు డనగ పృథ్విన
తనయుల కొరకని సతతము తగులము తోడన్
తనయులు కొందరి ఆగడ
మనగని కొడుకను తలపుయె మరచును జినుడా
103.) కనికర భావము తోడను
తనకును జన్మను ఒసగిన తల్లిని తండ్రిన్
వినయము మరువక విసుగన
కనకను నిత్యము శుశౄష క్రతువన జినుడా
104.)కొడుకులు బిడ్డలు సమముగ
జడువక జననీ జనకుల జాగ్రత గనగన్
విడిమట్టు నందు దృప్తియు
సడలక ఉండును కనగను సరియన జినుడా
105.)సుగుణులు సుతులును గలుగగ
అగునిక సంసృతి కుశలము అనగను జూడన్
దిగులన లేకను ఎవరికి
తగవులు లేకను కనగను తనరగ జినుడా
106.)బరువుయు బాధ్యత సుతునకు
సరియన నుండును దెలియగ సంసృతి నందున్
తరువన నీడిచ్చు విధము
పరువును నిల్పను సదనము ప్రకృతియు జినుడా
107.)సుతసుతు లిద్దరు సదనము
గతులను మార్చుచు నిలకడ గలుగగ జేయన్
సుతునిది బాధ్యత అధికము
సుతయును పెండిలి వరకన చూసును జినుడా
108.)జననీ జనకుల సేవలు
తనయులు జేయగ నదియన తనరగ నుండన్
తనయుల కీర్తియు బెరుగును
వినయపు శీలురు సుతులన వినగను జినుడా
ప్రస్తావన.
నేను వ్రాసిన శతకాలలొ ఇది పద్దెనిమిదవది. జినుడా శతకము.( ఈ శతకములో పిల్లలు పుట్టి తలిదండ్రుల సేవలు ముద్దు మచ్చటలు పొందుచూ పెరుగుట- చాలా వరకు కొడుకులు తలిదండ్రులపై నిర్లక్ష భావము కనబరుచుట -కొందరు సేవా భావముతో మెలగుట -అట్లనే కూతుర్లు కొంతమంది తలిదండ్రులపై ప్రేమను చూపుత -కొందరు ఇంటికి కళంకము ఆపాదింప జేయుట వ్యవహరించే విధానము చూపబదినది.)
రచయితగా ఏబది వరకు కథలు "భీష్మోపదేశము"అను వ్యక్తిత్వ వికాస నవల,కొన్ని కవితలు.
రెండు శతకములు మాత్రము ఛందో రహితము1.పోచంపల్లి శతకము(వచన పద్యము).2.వినయశీల శతకము.(వచన పద్యము.)ముకుకుందము అను ఖండ కావ్యము (వచన పద్యము. తక్కిన శతకాలన్నియు ఛందోబద్ధముగా వ్రాసినవే- ఇవిగాక జాతి పద్యాలైన కందములో అనఘా సహస్రము అను వేయి పద్యాల సహస్రము-మరియు ద్విపద సహస్రము వేయి పద్యాలు-ఇవి ఇంతవరకు ఎవరూ ఎక్కడ వ్రాసినట్టు కనబడదు.
శతకాలు మొదట నీతి గురించి వ్రాసినవే-శతకాలలో 1,భక్తి శతకము,2.నీతి శతకము,3.వేదాంత
శతకము,4.శృంగార
శతకము,5.వ్యాజస్తుతి శతకము,6.హాస్య శతకము,7.కథా శతకము,8.సమస్యా శతకము,9.వైరాగ్య శతకము మున్నగునవి ఎన్నియో రకాలు.నేనెన్నుకున్నది సాధారణంగా నీతి శతకమె-తరువాత కొత్త వరవడిగా ఏదో ఒక అంశము తీసుకొని
వ్రాస్తున్నాను.
ఉదాహరణకు-మాతృమూర్తి,చెట్లు,పూలు,తరుణి మున్నగునవి.
పాఠకులు నా ఈ శతకము చదివి వారి వారి అభిప్రాయము తెలిపితె సంతోషిస్తాను.
పోచంపల్లి సుదర్శన రావు
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.



Comments