top of page

కాలమా నీకు జోహార్లు

#ChilakamarriRajeswari, #చిలకమర్రిరాజేశ్వరి, #KalamaNikuJoharlu, #కాలమానీకుజోహార్లు, #మనిషీనీపయనంఎటు  #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Kalama Niku Joharlu - New Telugu Poem Written By  - Chilakamarri Rajeswari

Published in manatelugukathalu.com on 13/05/2025 

కాలమా నీకు జోహార్లు - తెలుగు కవిత

రచన: చిలకమర్రి రాజేశ్వరి


కాలానికి లేదు నిర్వచనం

జరిగిన, జరుగుతున్న మార్పుల కది కొలమానం


కాలం కాదు ఎవరికీ సొంతం

దానికి లేదు రూపం, భాష్యం


లక్ష్యం ఒకటే ముందుకు సాగడం 

తెలియని గమ్యం  కోసం నిరంతర పయనం 


కాలచక్రం ఆపడం కాదు ఎవరి తరం

కాలం అనేక  భావాల సమాహారం

 

ఆనందమైనా, దుఃఖమైనా దానికి లేదు భేదం

స్థితప్రజ్ఞత దానికున్న విశేషగుణం

ఒకరికి సంతసమైతే, మరొకరికి క్లేశం 

ఎవరిది వారిదే ఈ జీవిత యానం


సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం 


ఆ వెనుక మరల సూర్యోదయం,

అలుపెరుగని కాల గమనం,

మనిషికి బోథించును కృష్ణతత్వ్తం


సంతోషాలకు పొంగిపోకు, దుఃఖాలకు కుంగిపోకు తామరాకుపై నీటిబొట్టులా మసలుకో

గతం మార్చలేమని తెలుసుకో

జీవితానికి ఒక లక్ష్యం నిర్దేశించుకో


కాలం విలువ తెలుసుకో, సద్వినియోగం చేసుకో 

మానవ జన్మను సార్థకం  చేసుకో.


***

మనిషీ నీ పయనం ఎటు?














మానవత్వం మృగ్యమై మనిషి

మృగంగా మారుతున్న వైనం

క్షణికానందం కోసం ఉచ్ఛనీచాలు మరిచి

పశువులా ప్రవర్తిస్తున్న నైజం


నీతి నియమాలకు నీళ్ళొదిలి స్వలాభం కోసం

ఏఅక్రమానికైనా ఒడిగట్టే మానవాసురులు

ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని

సులభ ధన సంపాదన కోసం చేస్తున్న  సైబరు నేరాలు


మనిషికి, మనిషికి మధ్యన

ఈర్ష,ద్వేషాల, కులమతాల అడ్డుగోడలు

మనీ  కోసం నైతిక విలువలకు తిలోదకాలు

స్వప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగాలు

క్షణికావేశంతో  చేస్తున్న హత్యలు, కొట్లాటలు


ఓ మనిషీ , నీకిదే నా విన్నపం 

ప్రాణం పోయినప్పుడు ఏదీ నీ వెంట రాదనే

సత్యాన్ని  మరువకు

మహర్షిగా మారకున్నా, మానవత్వం కల మనిషిగా 

బతకడం నేర్చుకో


చిలకమర్రి రాజేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి

 

నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.


మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.


నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.


పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని,  నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.

2 Comments


ఎంతో అంతరంగ మథనం అయితేగాని ఇటువంటి కవిత్త్వం రాదు. మంచి సందేశం.

Like

తాత్విక చింతనతో, సత్యం, సత్వం, ఆధారితమైన జీవనం గడపమని ప్రభోదించి న రెండు కవితలకు ధన్యవాదములు.

Like
bottom of page