కలిసొచ్చిన అదృష్టం
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- May 28
- 4 min read
#KalisochhinaAdrushtam, #కలిసొచ్చినఅదృష్టం, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Kalisochhina Adrushtam - New Telugu Story Wtten By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 28/05/2025
కలిసొచ్చిన అదృష్టం - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
వీధిలో రోడ్డు మీద గోలీ లాడుతున్న పదేళ్ల వీరేశం రంగు రంగుల యూనిఫామ్ లు, వీపు మీద పుస్తకాల బ్యాగులతో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న స్కూల్ విద్యార్దుల్ని నిలబడి ఆసక్తిగా చూస్తున్నాడు. తనకూ రంగుల బట్టలేసుకుని బడికి వెళ్లాలనున్నా అయ్య పోనివ్వడు.
‘నాయన పొద్దుకాల చాయ్ తాగి రిక్షా తోలుకుపోతే అమ్మ, అయ్యగారింట్లో పనికి పోతాది. నాకు చద్ది బువ్వ పెట్టి గుడిసెకి తాళం వేసి పోయి పని చూసుకుని మద్దేనం తిరిగి వచ్చేవరకు గడప బయట ఆట లాడుకుంటు గడపాల ' అని మనసులో బాధ పడుతూంటాడు.
ఒకరోజు ఎవరో విద్యార్ది పోగొట్టుకున్న రంగుల బొమ్మల పుస్తకం ఆడుకుంటున్న వీరేశానికి దొరికింది.
వీరేశం నిరక్షరాస్య బీద కుటుంబంలో పుట్టినా చదువంటే ఆసక్తి. ఒకసారి విన్నా చూసినా దాన్ని అనుకరిస్తాడు. రాయడానికి ప్రయత్నిస్తాడు. దొరికిన పుస్తకం తెరిచి చూస్తే రంగు రంగులతో కోడిపుంజు, రామచిలక కోతి వంటి పక్షులు జంతువులతో పాటు ఉదయిస్తున్న సూర్యుడు, గ్రామీణ దృశ్యాలు కనిపించేయి.
వాటిని చూసి మసి బొగ్గుతో గుడిసె గోడలు, అరుగుల మీద బొమ్మలు గీస్తుంటే వాడి అమ్మ కేకలేసేది. అందువల్ల రోడ్డు మీద మసి బొగ్గులతో పుస్తకంలో బొమ్మలు చూసి గియ్యడం మొదలెట్టాడు.
రోడ్డున పోయే జనం ఆ బొమ్మలు చూసి చిల్లర డబ్బులు వేయసాగేరు. మధ్యాహ్నం వరకు దొరికిన చిల్లర డబ్బులు పెట్టి చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కునేవాడు.
ఎవరో దయతలిచి రంగు సుద్దల పెట్టె కొనిచ్చారు. దాంతో రంగురంగుల సుద్దలతో కేలండర్లు, కనపడిన దేవతల బొమ్మలు గియ్యడం మొదలెడితే దండిగా డబ్బులు దొరికి ఐస్ క్రీంలు, బిర్యానీలు కొనుక్కుని ఆకలి తీర్చుకుంటున్నాడు.
ఒకరోజు రోడ్డు కూడల్లో సినిమా ఫ్లెక్సీలు కట్టే కిట్టిగాడు రోడ్డు మీద రంగుల బొమ్మలు వేస్తున్న వీరేశాన్ని చూసి తన యజమాని పెయింటర్ నరశింహం దగ్గరకు తీసుకుపోయాడు..
పని వత్తిడితో యాతన పడుతున్న పెయింటరు నర్సింహ తనకొక అసిస్టెంటు కావాలనుకుంటున్న సమయంలో వీరేశం రావడం జరిగింది.
కొత్త ఫ్లెక్సీ బొమ్మలిచ్చి వాటిని రంగులతో బ్రష్ పెయింటు చెయ్యమంటే తను కోరిన ప్రకారం బొమ్మలు వేసి ఇచ్చినందుకు సంతోషించి రోజూ బిర్యాని పెట్టించి వారానికి పది రూపాయలు ఇస్తానన్నాడు నర్సింహ. సరే నని పనిలో చేరేడు వీరేశం.
యజమాని. నర్సింహ గీసే స్టిల్స్ చూసి స్కెచ్ వేసి రంగులు కలిపి ఆయన ఎలా పెయింట్ చేస్తున్నాడో జాగ్రత్తగా గమనించి ఫ్లెక్సీలు గీసేవాడు. ఇప్పుడు వీరేశం కూడా స్వతంత్రంగా చిన్న చిన్న సినిమా ఫ్లెక్సీలు
తయారుచేస్తున్నాడు.
క్రమేపి నర్సింహకు వీరేశం చురుకుతనం, పని మీద నమ్మకం ఏర్పడి మరో యాడ్ ఏజన్సీ బ్రాంచి తెరిచి బాధ్యత అప్పగించేడు. వీరేశం వచ్చినప్పటి నుంచి వ్యాపారం పెరిగి ఆదాయం బాగా ఉంటోంది.
వీరేశం రాకపోకలకు మోపెడ్ కొనిచ్చాడు. వాడి చదువు మీద
ఆసక్తి గ్రహించి చిన్న చిన్న పుస్తకాలు తెప్పించి చదవడం, రాయడం నేర్పించాడు. సినిమా మేగజైన్సు చదవగలిగే స్తాయికి వచ్చాడు.
పది మందితో పరిచయం, సరైన పోషణ వల్ల స్మార్టుగా స్టైల్ గా హేండ్సమ్ గా తయారయాడు వీరేశం. తల్లికి ఆర్థికంగా సహాయ పడుతున్నాడు. కొత్త యాడ్ ఏజెన్సీ బ్రాంచి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పని వత్తిడి వల్ల అక్కడే సమయం గడిచిపోతోంది.
ఫిల్ము డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు నర్సింహ యాడ్ ఏజెన్సీకి పని మీద వస్తూంటారు. వీరేశం వినయ విధేయతలు, పర్సనాలిటీకి ముగ్దులయేవారు.
ఒకసారి ప్రఖ్యాత సినీ డిస్ట్రిబ్యూటరు సత్యం, నర్సింహ యాడ్ ఏజెన్సీ కి వచ్చినప్పుడు తను కొత్త వారితో సినిమా తీయాలనుకుంటున్న సమయంలో వీరేశాన్ని చూడటం జరిగింది.
వీరేశాన్ని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నట్టు మేకప్ చేసి స్క్రీనింగ్ టెస్టు చెయ్యాలంటే సరే నన్నాడు నర్సింహ.
వీరేశానికి మేకప్ చేసి వాయిస్ స్క్రీనింగ్ టెస్టు జరపగా గ్లామర్ ఫోటోజెనిక్ ఫేసు అయినందున వీరేశాన్ని ' విక్రమ్' గా పేరు మార్చి ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో చేర్పించి నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్సులు, ఫైటింగుల్లో తర్ఫీదు ఇచ్చి హీరోగా పెట్టి "అదృష్ట చక్రం " పిక్చర్ షూటింగ్ పూర్తయి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
మొదటి సినిమా హిట్టయి నూతన నటుడిగా ఫిల్మ్ అవార్డు పొందిన విక్రంకి వరుస చిత్రాలలో హీరో ఆఫర్లు వరుస కట్టేయి.
జీవితంలో అదృష్టం కలిసొస్తే అనాథ అయినా అందలమెక్కగలడు.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments