'Kalthi Manushulu' New Telugu Story
Written By Pitta Gopi
'కల్తీ మనుషులు' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అక్షరం ముక్క రాకపోయినా ప్రతి మనిషికి విషయ పరిజ్ఞానం, లోక జ్ఞానం ,సేవాభావం తప్పక ఉండాలి అంటారు పెద్దలు. అలాంటి అచ్చుగుద్దిన మనిషి ప్రభు. ప్రభు చదువుకోలేదు వీధుల్లోను టౌన్ లోను చెత్త ఏరుకుని కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అలా అని అతను నిరుపేద ఏమీ కాదు.కష్టపడే స్వభావం ఉన్నవ్యక్తి ఎప్పుడూ నిరుపేద కాలేడు కదా.. ఒకరోజు ఏదో పని నిమిత్తం పెద్ద టౌన్ లోకి అడుగు పెట్టాడు. లోకజ్ణానమున్న ప్రభు, చుట్టుపక్కల గమనిస్తూ పోతున్నాడు. ఒక దగ్గర ఎక్కువ మంది ప్రభుత్వ ,ప్రైవేటు ఉద్యోగులు బస్ కోసం వేచి చూస్తున్న ప్రదేశం చూసి ప్రభుకి ఆశ్చర్యం వేసింది. అక్కడ ఒక బస్ షెల్డర్ కానీ.. కూర్చోడానికి కానీ వసతులు ఏమీ లేవు. అందరూ నిల్చునే ఉన్నారు. అంత పెద్ద చోటు కాస్తా వెనుక చెత్తా చెదారం ,ప్లాస్టిక్ తో నిండి డంపింగ్ యార్డు ని తలపిస్తోంది. దాని వెనుక ఒక మురుగు కాలువ ఉంది. పదిమంది కి ఉపయేగపడే చోట ఇలా ఉండటం ఆశ్చర్యం కలిగించినా… ప్రభుకి ఈ ప్రదేశంలో తాను చెత్త సేకరిస్తే మరింత డబ్బు సంపాదిస్తానని అనుకుని మర్నాడు ఇటు వస్తాడు. బస్ స్టాప్ వద్ద ఎన్నడూ లేని విధంగా ప్లాస్టిక్ ని, చెత్తని సేకరిస్తాడు. ప్రభుని అక్కడ ఉన్న మహిళ,పురుష ఉద్యోగులు అసహ్యంగా చూస్తారు. అయినా ప్రభు వాళ్ళతో కలిసే తన ఇంటికి వెళ్ళే బస్ ఎక్కుతాడు. అలా రెండు రోజులు చెత్త సేకరిస్తూ, పరిసరాలను శుభ్రం చేసిన ప్రభుని కాస్త మామూలు మనిషిలా చూడ్డం మొదలెట్టారు. అలా ప్రభు చెత్త ఏరుకునేవాడైనా, ఆ ఉద్యోగుల మనసులో కాస్త మనిషి గా గుర్తింపబడ్డాడు. మరుసటి రోజు ఆ ప్రదేశంలో నాలుగు మొక్కలు నాటాడు. తాను ఆ ఏరియాలో తన పని చేస్తూ...తిరిగు ప్రయాణం లో కొంచెం సమయం ఆ మొక్కలు రక్షణకు ఇచ్చేవాడు. దీంతో కొంత కాలానికి అవి పెద్దవి అయి నీడనిచ్చాయి. రెండు రోజులు ప్రభు టౌన కి రాలేదు. దీంతో ఆ బస్ స్టాప్ లో ప్రయాణీకులు, ఉద్యోగులు సేద తీరటం,కొందరు తోపుడు బండ్లు పెట్టుకుని మరింత చెత్తను ఆ వెనుకే పడేసేవాళ్ళు. అలా పందుల సంచారం పెరిగి, చెత్త మురుగు కాలువకు అడ్డు వచ్చి, ఆ ప్రదేశం దుర్గంధం అయింది. అక్కడ జనాలు రావటానికి ఇష్టపడటం మానేశారు. అంతా ఎక్కడెక్కడో ఉంటు బస్ వచ్చే సమయానికే వచ్చేవారు. ప్రభు మరలా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేశాడు . ప్రభు వాలకం చూసి మరలా జనాలు దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు.అయినా రెండు రోజులు కష్టపడి చెత్త ,మురుగు కనపడకుండా ఏర్పాట్లు చేశాడు. తాను ఈ టౌన్ లో ఎక్కువ చెత్త వలన బాగా సంపాదిస్తున్నందున కూర్చునేందుకు వీలుగా తన సొంత డబ్బు తో అక్కడ వసతులు పెట్టాడు. అందువలన జనాలు ప్రభుని గౌరవించసాగారు. ఇక అక్కడితో ఆగకుండా తాను ఒక బిర్యానీ సెంటర్ పెట్టాడు.కానీ.. తన కంటే చిన్న బండ్ల వద్ద అయినా తినే ఈ ఉద్యోగులు ,ప్రయాణీకులు ప్రభు సెంటర్ వద్ద కొనేవాళ్ళు కాదు . ఎందుకంటే ప్రభు చెత్త ఏరుకునేవాడని. వారం గడిచినా పెద్ద మార్పు లేదు వాళ్ళలో. దీంతో ఈ బస్టాండు లో ప్రయాణీకులకు బిర్యానీ ,పుడ్ ఫ్రీ అని బోర్డు పెట్టించాడు. ఇక అందరూ ప్రభు సెంటర్కే వచ్చేవారు. లొట్టలేసుకుని తిని వెళ్ళేవాళ్ళు. ప్రభు పనికి మెచ్చి అదే ప్రదేశంలో ప్రభుత్వం సన్మాన కార్యక్రమం పెట్టింది. సభకు తోపుడు బండ్ల వాళ్ళు , ఉద్యోగులు ,నిత్య ప్రయాణీకులు అందరూ వచ్చారు. సభలో ప్రభు మాట్లాడుతూ "సభకు నమస్కారం. ఒక బస్ స్టాండ్ లో మౌలిక సదుపాయాలు కల్పించినందుకు ఈరోజు నన్ను ప్రభుత్వం సన్మానించింది.ఈ సన్మానానికి కల్తీ మనుషులెందరో వచ్చినందుకు నాకు గర్వంగా ఉంది..” అన్నాడు. కల్తీ పేరు వాడకంతో సభలో ఉన్నవాళ్లు అభ్యంతరం చెప్పారు. "మీరు నిజంగా కల్తీ వాళ్ళు కాదా.... చెత్త ఏరినపుడు అసహ్యించుకున్నారు , పరిసరాలు బాగున్నపుడు మెచ్చుకొన్నారు. మురుగు లోకి దిగిన నన్ను చీదరించారు.చెట్లు పెంచి సదుపాయాలు పెడితే గౌరవించారు. ఎక్కడి నుండో వచ్చిన అక్షరం ముక్క రాని నేను సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో ఉంటే.. పదిమందికి ఉపయేగపడే వాటిని, మీరు కానీ.. ప్రభుత్వం కానీ.. పట్టించుకోలేదు. అంతేనా.... నా బతుకు కోసం పుడ్ సెంటర్ పెడితే అపరిశుభ్రంగా ఉంటాననే కారణంతో ఎవరు కొనటానికి ఇష్టపడలేదు కానీ... ఎప్పుడు అయితే ఉచితం అన్నానో....అప్పుడు మీకు ఏ అపరిశుభ్రత కనపడలేదు. ఉచితంగా ఇస్తున్న నేను ఎంత నష్టపోయానో... మీకు ఆలోచన రాలేదు. అందుకే... మీరు కల్తీ మనుషులు. మీరు మంచి చేయరు.మంచి చేసేవాళ్ళకు చెయ్యి ఇవ్వరు. మంచి చేసేవాళ్ళని అసహ్యించుకుంటారు. ఈ సృష్టిలో నాణ్యత గా ఏదైనా దొరికేది ఉందంటే అది కల్తీ మనుషుల నాటకం మాత్రమే" అని ముగించాడు. సభలో ఉన్నవారంతా తమ తప్పులు తెలుసుకుని తలదించుకున్నారు. *** |
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం :
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం.
Y Ramu • 8 hours ago
Supper