top of page

కనపడని దేవునికి కనక సింహాసనము


'Kanapadani Devuniki Kanaka Simhasanamu' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 24/10/2023

'కనపడని దేవునికి కనక సింహాసనము' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


కనపడని దేవునికి

కనక సింహాసనంబు

కనలేని దీనునికి

కడమెట్టె గుడికాడ


తినబోని స్వామికి

తీర్థ ప్రసాదంబు

తినబోవ దీనునికి

తిరిపపెత్తుటయె


పగడాలు ముత్యాలు

పట్టు పానుపు తోడ

పవళింపు సేవకై

పరమాత్మ గొలువుండ


సగమైన సరిపోని

చింపి గుడ్డల తోడ

నిదురించు నిరుపేద

నింగియే కప్పుయై నిలచియుండు


ముక్కంటి ఫలములు

మొక్కుగా గొట్టి

చెక్క ఒక్కటి గూడా

చేజాచ నీయక

దిక్కు దేవుడె నీకంటు

దీనులను జూచి

మొక్కు దీరెనటంచు

మోదము తో నుంద్రు మోసజనులు


నీలాలు నీకిత్తు

మా మేలు జూడంటు

కళ్యాణ కట్టలో

కత్తెరేయించుకొని

గుండములొ స్నానాలు

గుడి చుట్టు తిరుగుళ్ళు

మెండుగా పూజలు

మెడనిండ పూదండ


బెట్టు మడిగట్టి

జుట్టు ముడిబెట్టి

కట్టు బొట్టు కాషాయ

బట్టలుంగట్టి

చుట్టు గుడి దిరిగి

గంటలున్ గొట్టికొట్టి

పట్టి హారతులు పనిగట్టి

దీనుల నెట్టి వైతురిలన్


పసుపు కుంకుమ పూలు

ఫలములు కూర్చి పేర్చి

విసురుచున్ వింజామరలు

విభునికి విభూతి గోరి

కసురు చుందురు కనులు

కాల్జేతులు చెవులున్ లేని వారినిన్

ఉసురు దగులదే అట్టి

వారికి ఉపకార మెరుగకున్న-

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


27 views1 comment

1 Comment


Surekha Arunkumar
Surekha Arunkumar
Oct 24, 2023

Excellent 👌

Like
bottom of page