top of page

కంచికి చేరిన కథ

#KanchikiCherinaKatha, #కంచికిచేరినకథ, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Kanchiki Cherina Katha - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 09/10/2025

కంచికి చేరిన కథ - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

“ఏమిటండి.. ఆ టిక్ టిక్ మంటో అర్ధరాత్రి అయినా ఆ సెల్ ఫోన్ తో ఏమి చేస్తున్నారు” అంది రమణి భర్త శంకరం తో. 


“వుండవే. రేపటిలోగా మంచి కథ రాసి పంపించాలి, ఈసారి వచ్చే బహుమతితో నీకు మంచి హోటల్ లో లంచ్ పెట్టిస్తాను” అన్నాడు. 


“అంటే యిప్పటివరకు రాసిన కధలు చచ్చు కథలేనా, పడుకోండి, సెల్ ఫోన్ లైట్ కి నాకు నిద్రపట్టడం లేదు” అంది. 

“అయితే పోయి పక్క గదిలోకి పోయి పడుకో, నేను ఎంత రాత్రి అయినా కథ పూర్తి చేసి తెలుగు కథల పత్రిక కి పంపాలి” అన్నాడు శంకరం. 


మొత్తానికి తెల్లారి అయిదు గంటలకు శుభం వ్రాసి కథని మెయిల్ లో పంపి పడుకున్నాడు. 

***


“ఏమిటి అక్కయ్యా! బావగారు యింకా లేవలేదా?” అంటూ వచ్చిన తమ్ముడు మూర్తి కి కాఫీ కప్ అందించి, “ఏమిటోరా.. తెల్లారిజాము వరకు కథ రాస్తో కూర్చున్నారు. ఏమిటో ఏ పిచ్చి పడితే ఆ పిచ్చ మీ బావకి” అంది రమణి. 


“అక్కా, నువ్వు ఏమి అనుకోనంటే ఒక మాట. తన ప్రతీ కథ నాకు పంపించి వినేదాకా చంపేస్తున్నారు బావగారు. కథ బాగుండలేదు అని వినే మనకి తెలుస్తున్నప్పుడు వ్రాసే బావగారికి ఎందుకు తెలియటం లేదో ఏమిటో” అన్నాడు మూర్తి. 


“చెత్త సినిమా తీసి కూడా మా సినిమా వందకోట్లు సంపాదిస్తుంది అని దర్శకులు ఎలా అంటారో తెలియకుండా, మీ బావగారికి అంతే. యింతకి మా మామగారు పెద్ద రచయిత అవ్వడం నా ప్రాణం మీదకి వచ్చింది, తను తన తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకున్నాను అని తెగ మురిసిపోతో వుంటారు మీ బావగారు” అంది. 


“ఎందుకైనా మంచిది ఈ విషయం మాట్లాడుకోవడం ఆపేద్దాం, నిద్రపోతో కూడా మన మాటలు విన్నా వింటారు” అంది రమణి. 


పదిహేను రోజులు అయినా తన కథ గురించి ఏమి తెలియక పోవడంతో తెలుగు కథలు ఎడిటర్ గారికి మెసేజ్ పెట్టాడు తన కథ గురించి. 


“అయ్యా! మీ కథ ఏది మా దగ్గర పెండింగ్ లేదు, దయచేసి ఈ రెండు వారాలలో మాకు వచ్చిన పాఠకుల అభిప్రాయాలు చదవండి” అని ఎడిటర్ గారి రిప్లై చూడగానే గుండెల్లో రాయి పడింది. అయితే నా కథ ఏమైంది అనుకుని పాత పుస్తకాలలో పాఠకుల అభిప్రాయాలు చదివి మొహం కందగడ్డ లా పెట్టుకున్నాడు శంకరం. 


“ఏది.. ఏమి రాసారు” అంటూ రమణి తీసుకుని, "ఎడిటర్ గారు.. రెండు వారాల నుంచి శంకరం గారి కథలు పత్రికలో లేకపోవడం వలన మా కుటుంబంలో శాంతిగా వుంది. ఆయన రాసే కథలు జీవితానికి దగ్గరగా వున్నా ఎవ్వరికి వాళ్ళు మమ్మల్ని గురించే రాసినట్టు వుంది.” 


“బాగానే పొగిడారుగా యింకా ఎందుకు విచారం” అంది భర్త శంకరం తో రమణి. 


“నీకు ఆలా అర్ధం అయ్యిందా.. సరేలే” అని బయటకు వెళ్లి ఎడిటర్ గారికి ఫోన్ చేసాడు. రెండు మూడు సారులకి ఎడిటర్ ప్రసాద్ గారు ఫోన్ తీసి “మీ కథ రాలేదు సార్, వస్తే మేము ఎందుకు దాచుకుంటాము” అన్నాడు. 


“సార్. పాఠకులు అభిప్రాయం చూసి మీరు నన్ను దూరం పెడుతున్నారు అని నా అనుమానం, ఎందుకంటే నేను పంపిన అన్నీ కథలు అంది పోటీకోసం పంపిన కథ అందలేదు అంటే నాకు ఏదో చెప్పలేని అనుమానంగా వుంది. యింకోక్కసారి మీ మెయిల్స్ చెక్ చెయ్యండి, నాకు మనశ్శాంతి లేకుండా పోయింది” అన్నాడు. 


“అంటే మిమ్మల్ని ఇన్నాళ్ళు ప్రోత్సహించిన దానికి ఫలితం మమ్మల్ని అనుమానిస్తారు అనుకోలేదు. మీ కథలు వేస్తే పాఠకులకు మనశ్శాంతి పోతోంది, వెయ్యకపోతే మీకు. బాగానే వుంది.. మధ్యలో మాకు మీతో మాటలు పడటం.. అందుకే యిహ నుంచి మీ కథలు తీసుకోము. మిమ్మల్ని బ్లాక్ లిస్టులో పెడుతున్నాను. యిహ ఫోన్ చెయ్యకండి శంకరం గారు” అని ఫోన్ కట్ చేశారు ఎడిటర్ గారు. 


‘ఇదేమిటి యిలా జరిగింది, సరిగ్గా వారం రోజుల క్రితం ఏవో డిలీట్ చేయాబోయి మెయిల్స్ అన్నీ డిలీట్ చెయ్యడంతో నాకథ ఎవ్వరికి పంపించానో కూడా తెలియడం లేదు’ అనుకున్నాడు. 


“పోనీలెండి, ఈ ఒక్కపత్రిక వేసుకోకపోతే లోకం గొడ్డు పోయిందా, అయినా ఎప్పుడో మీ నాన్నగారు రచనలు చేసే వారని మీరు రాని పనిలో తలదుర్చడం ఎందుకండి, హాయిగా రామకోటి రాసుకోండి, పుణ్యం వస్తుంది. ఉదయం మా తమ్ముడు కూడా యిదే మాట అన్నాడు మీ కధల గురించి” అంది రమణి. 


“అదేంటి.. మీ తమ్ముడు నా కథలు భ్రమ్మాండం అని పొగిడేవాడు. ప్రతీ ఆదివారం నా చేత సినిమా టికెట్స్ కొనిపించుకునేవాడు. అంటే మీరందరూ ఒక్కటై నా కథలని అవమానం చేస్తున్నారు. యిదే కథ మళ్ళీ రాసి ఈసారి విజయదశమి పోటీలకు స్వాతి పత్రిక కి పంపి మొదటి బహుమతి కొడ్తాను. అప్పుడు తెలుస్తుంది నా విలువ” అన్నాడు లాప్టాప్ ముందేసుకుని. 


రాత్రి ఏడుగంటలకే పక్క ఎక్కి అవమానం తో నిద్ర రాక దొరులుతున్న శంకరం కి కంచి నుంచి పెద్దన్నయ్య ఫోన్ రావడంతో లేచి కూర్చొని “ఆ చెప్పు అన్నయ్యా” అన్నాడు. 


“ఏమిలేదు రా శంకరం. మేము కాశీ వెళ్దాం అనుకుంటున్నాము, మీ దంపతులు కూడా వస్తారా” అన్నాడు. 


“యిప్పుడు ప్రయాణం చెయ్యడానికి సమయం లేదన్నయ్య, కథల పోటి కోసం ఒక కథ రాస్తున్నాను” అన్నాడు శంకరం. 


“ఒరేయ్ శంకరం. కథలు అంటే గుర్తుకు వచ్చింది.. రెండు వారాల క్రితం నాకు ఒక కథ హార్డ్ కాపీ పంపించావు. అసలే నాకు పిల్లలకి ట్యూషన్ చెప్పడంతో టైం చాలటం లేదు. దానికి తోడు డైరెక్టుగా కథ పంపితే ఎక్కడ చదువుతాను అనుకున్నావు” అన్నాడు. 


“అంటే ఆ కథ నీకు పంపించానా, అయ్యో.. ఆ తెలుగు కథల పత్రిక ఎడిటర్ కి పంపించాను అనుకున్నానే, మీ యిద్దరి పేర్లు ప్రసాద్ అవ్వడం నా కొంపముంచింది. ఎడిటర్ గారితో గొడవపడ్డాను” అన్నాడు శంకరం. 


“ఇన్నాళ్ళు నీ కథలు వేసుకున్నారంటే ఆ ఎడిటర్ గారు మంచి హృదయం కలిగినవాడు అయ్యి ఉండాలి. పర్లేదు, విషయం చెప్పి సారీ చెప్పు. మొత్తానికి నీ కథ కంచికి చేరినట్టుగా నాకు చేరింది అన్నమాట. ఎందుకు రా శంకరం.. బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యావు కదా. హాయిగా రెస్ట్ తీసుకోక బ్రెయిన్ పాడుచేసుకుంటున్నావు నీ కథలతో.. సరేలే ఒకసారి కంచికి వెళ్ళు. అక్కడ నీలాంటి వాళ్ళు రాసిన కథలు దొరుకుతాయి. వాటిని తెచ్చి కొద్దిగా మార్పు చేసి నీ పేరు రాసుకో” అని నవ్వుతు ఫోన్ పెట్టేసాడు అన్నగారు. 


“ఏమిటి ఏదో కంచి” అంటున్నారు అంది రమణి. 


“ఏమిలేదులే. కథ కంచికి చేరింది” అన్నాడు దిగులుగా. 

  శుభం

గమనిక ఎవ్వరిని కించపరిచే ఉద్దేశం లేదు. సరదాగా కోసంరాసినది.

శ్రీనివాసరావు జీడిగుంటహైదరాబాద్



  శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree


ree












1 Comment


@trendingnews-jj6nc

•6 hours ago

Nice 🎉

Like
bottom of page