top of page

కనిపించే వేల్పులు కన్నవారు

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KanipincheVelpuluKannavaru, #కనిపించేవేల్పులుకన్నవారు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 125


Kanipinche Velpulu Kannavaru - Somanna Gari Kavithalu Part 125 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 26/09/2025

కనిపించే వేల్పులు కన్నవారు - సోమన్న గారి కవితలు పార్ట్ 125 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


కనిపించే వేల్పులు కన్నవారు

-------------------------------------------

కన్నవారి ఆశీస్సు

జీవితాన ఉషస్సు

పెంచునోయ్! నిజంగా

అధికంగా యశస్సు


కన్నోళ్లను మహిలో

కొలవాలోయ్! మదిలో

జన్మనిచ్చిన దాతలు

ఘనం వారి ప్రేమలు


కన్నవారి త్యాగము

పరికింప అసమానము

క్రొవ్వొత్తిలా కరిగి

ఇస్తారు జీవితము


అవసాన దశలోన

రాలే వయసులోన

నిర్లక్ష్యము చేయకు

నీ బాధ్యత మరువకు

ree















పొత్తం చెప్పిన సత్యాలు

---------------------------------------

పెంచుకోకు ద్వేషము

అగును చివరికి విషము

ప్రేమ గుణం శ్రేష్టము

కల్గియున్న క్షేమము


శత్రుత్వమే చేటు

బంధాలపై వేటు

క్షమాగుణమే ఘనము

అక్షరాలది నిజము


లేకుంటే విలువలు

శవంతో సమానము

అవి ఉంటే బ్రతుకులు

దేదీప్యమానము


స్నేహమనే బంధము

అత్యంత పవిత్రము

మరువకు జీవితాన

గుర్తించుము సతతము

ree










పంతులమ్మ సూచనల సరాలు

--------------------------------------

కాస్త సంపాదించుకో

పదిమంది అభిమానం

అదే కదా జీవితాన

ఖరీదైన బహుమానం


విడిచిపెట్టు పూర్తిగా

పెనుభూతం అనుమానం

ఆకాశం సాక్షిగా

అలవర్చుకో నమ్మకం


శ్రేష్టమైన స్నేహానికి

లేదు లేదు కొలమానం

సృష్టిలో చూడంగా

అదేనోయ్!అసమానం


క్లిష్ట పరిస్థితుల్లో

నిదానమే ప్రధానం

విలువైన విషయాల్లో

నిలుపుకో అవధానం

ree






ప్రబోధ గీతం

-----------------------------------------

సాయపడిన మనుషులను

ఆదుకున్న ఆప్తులను

అలుసుగా చూడొద్దు

కృతఘ్నత చూపొద్దు


చదువు చెప్పిన గురువుకు

నీడనిచ్చిన తరువుకు

అపకారం చేయకు

మనిషితనం మరువకు


వయసులో పెద్దలను

ఇంటిలో వృద్ధులను

చిన్నచూపు చూడకు

నిర్లక్ష్యం చూపకు


ముద్దులొలుకు పిల్లలను

వారి లేత మనసులను

గాయపరచకూడదు

పలు ముక్కలు చేయొద్దు

ree

















ఉండొద్దు ఎవ్వరికీ

---------------------------------

కంటిలోన నలుసులా

కాళ్ల కింద ముల్లులా

ఉండొద్దు ఎవ్వరికీ

చెవిలోన జోరీలా


ప్రక్కలో బల్లెంలా

గుండెల్లో మంటలా

ఉండొద్దు ఎవ్వరికీ

మనసులో ద్వేషంలా


చంకలోన గడ్డలా

భువిని అడ్డ గోడలా

ఉండొద్దు ఎవ్వరికీ

పంటి కింద రాయిలా


గొంతులోన ఎముకలా

గోతి కాడ నక్కలా

ఉండొద్దు ఎప్పుడూ

పానకాన పుడకలా


-గద్వాల సోమన్న

Comments


bottom of page