కన్నవారి మాటలు
- Gadwala Somanna

- May 30
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KannavariMatalu, #కన్నవారిమాటలు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 80
Kannavari matalu - Somanna Gari Kavithalu Part 80 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 31/05/2025
కన్నవారి మాటలు - సోమన్న గారి కవితలు పార్ట్ 80 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
కన్నవారి మాటలు
----------------------------------------
కాలికున్న అందెలు
చేతికున్న గాజులు
చేయునోయ్! సునాదము
పంచునోయ్! ఆనందము
పొలంలోని పంటలు
చెట్టుపైన ఫలములు
నింపుతాయి కడుపులు
అమ్మ చేతి వంటలు
పంచుకుంటే బాధలు
కుదుటపడును మనసులు
లేకుంటే మాత్రము
అగునోయ్! పెనుభారము
దిద్దుకుంటే తప్పులు
బాగుపడును బ్రతుకులు
ఆదర్శం జగతిలో
ముందుంజ ప్రగతిలో

త్యాగానికి గురుతులు
----------------------------------------
వేణువునే ఊదితే
వీణమ్మను మీటితే
రాగాలే పండవా!
వీనులవిందు చేయవా!
నిలువెల్లా గాయాలు
చూడంగా వేణువుకు
పలికేను సరాగాలు
హాయినిచ్చు వీనులకు
తనువంతా తీగలే
మధురిమల జల్లులే
సుతారంగా తాకితే
ఉదయించు రాగాలే
వీణ,వేణువు రెండూ
త్యాగానికి చిహ్నాలు
పరోపకారానికవి
నిలువెత్తు సాక్ష్యాలు

ఏముంది! నేస్తం!!
-----------------
శాంతి లేని స్థలంలో
కాంతి లేని పథంలో
ఏముంది! ఫాయిదా
భ్రాంతి ఉన్న బ్రతుకులో
పూలు లేని తోటలో
తీపి లేని ఊటలో
ఏముంది! ఉపయోగం
స్థిరం లేని మాటలో
రాజు లేని కోటలో
నీరు లేని ఏటిలో
ఏముంది! గొప్పతనం
స్ఫూర్తి లేని ఆటలో
మంచి లేని మనిషిలో
మమత లేని మనసులో
ఏముంది! చక్కదనం
నవ్వు లేని ముఖ్గంలో

అవ్వ చెప్పిన సుద్దులు
----------------------------------------
మనశ్శాంతి పోతే
జీవితమే నరకం
శత్రువే బద్దకం
ఉండాలి సుదూరం
అందరితో వైరం
కాదు కాదు మంచిది
మేలు సమాధానం
అన్నింటా మిన్నది
విలువైన బంధాలు
సుగంధ ద్రవ్యాలు
కాపాడుకుంటేనే
మిగులును జీవితాలు
మహోన్నతం స్నేహం
చేయరాదు ద్రోహం
మానవ జీవితాన
కాంతులీను దీపం

పక్షి ప్రబోధ గీతిక
----------------------------------------
కోపాన్ని అణచుకో
అనర్ధమని తెలుసుకో
శ్రేష్టమని శాంతగుణం
వెంటనే అలవర్చుకో
నోటి దురుసు మానుకో
నియంత్రణ చేసుకో
శత్రుత్వం పెంచునది
మనశ్శాంతి దోచునది
అహం తగ్గించుకో
అవిధేయత వదులుకో
అందరితో ప్రేమగా
స్నేహాన్ని పెంచుకో
లోపాలు దిద్దుకో
నిన్ను నీవు మలచుకో
నలుగురికి ఆదర్శం
గొప్పగా చాటుకో
-గద్వాల సోమన్న




Comments