top of page
Original.png

కనువిందు చేసేస్తా!

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KanuvinduChesestha, #కనువిందు చేసేస్తా, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 131


Kanuvindu Chesestha - Somanna Gari Kavithalu Part 131 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 11/10/2025

కనువిందు చేసేస్తా! - సోమన్న గారి కవితలు పార్ట్ 131 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


కనువిందు చేసేస్తా!

-------------------------------------------

మల్లెతీగ పందిరిలా

పల్లెసీమ అందంలా

అందరినీ అలరిస్తా!

ఆహ్లాదం పంచేస్తా!


జాబిలమ్మ మోములా

వెన్నెలమ్మ వెలుగులా

సద్వినియోగమవుతా!

కనువిందు చేసేస్తా!


నీడనిచ్చు తరువులా

జ్ఞానమిచ్చు గురువులా

ముందడుగు వేసేస్తా!

ఆదర్శమై నిలుస్తా!


కడుపునింపు పొలంలా

గొంతు తడుపు చెరువులా

పరోపకారమవుతా!

త్యాగగుణం చూపిస్తా!


పరిమళించు పూవులా

పసిపాప నగవులా

అవనిలోన జీవిస్తా!

జనహితం కాంక్షిస్తా!


నిగ్గుతేల్చు కలంలా

తేనెలాంటి గళంలా

ఆనందం నేనవుతా

స్ఫూర్తి మదిని నింపేస్తా







కనీస షరతులు

------------------------------

మనశ్శాంతి కావాలంటే

ప్రశాంతంగా ఉండాలంటే

పరుల విషయాల్లో జ్యోక్యము

ఉండకూడదు ఏమాత్రము


విజయాలే పొందాలంటే

చరిత్రలో నిలవాలంటీ

నిరంతర సాధన ఉండాలి

సాహసమే శ్వాస కావాలి


బంధాలు బాగుండాలంటే

బ్రతుకులు బాగు పడాలంటే

క్షమాగుణమే ఉండాలి

ప్రేమపూలు వికసించాలి


సఫళీకృతం అవ్వాలంటే

గౌరవంగా బ్రతకాలంటే

ధైర్యమే నింగిని తాకాలి

నైతిక విలువలు మెరియాలి
















స్వార్థమే లేదు

---------------------------------

కురిసే వానకు

మ్రోగే వీణకు

స్వార్థమే లేదు

పూసే పూవుకు


పారే యేరుకు

ప్రాకే తీగకు

స్వార్థమే లేదు

వెలిగే దివ్వెకు


కరిగే మంచుకు

కాలే కట్టెకు

స్వార్థమే లేదు

చెరువున నీరుకు


పచ్చని తరువుకు

బడిలో గురువుకు

స్వార్థమే లేదు

మడిలో మొలకకు








అక్షరాల సూక్తులు

-----------------------------------------

గొప్ప గొప్ప పనులతో

వెలగాలి జ్యోతిగా

నైతిక విలువలతో

బ్రతకాలి నీతిగా


ఘనమైన జ్ఞానంతో

అనుదిన ధ్యానంతో

రాణించాలి బ్రతుకులో

సభ్య సమాజంలో


ఆపన్నహస్తంతో

ప్రేమమయ హృదయంతో

సాక్షిగా నిలవాలి

మనసులే గెలవాలి


మృదువైన మాటలతో

సాయపడు చేతలతో

స్ఫూర్తిగా నిలవాలి

బాటగా మారాలి










నిందించుట తేలిక!

----------------------------------------

తేలిక నిందించడము

కష్టము భరించడము

వేయరాదోయ్! నిందలు

విరచరాదు మనసులు


పరులనింద పాపమే

చూడంగా నీచమే

లేనిపోని వాటితో

గాయపడును హృదయమే


వ్యక్తిత్వం శ్రేష్టమే

మేలిమి బంగారమే

కల్గియుంటే మాత్రము

పెంచుతుంది గౌరవమే


జాగ్రత్త అవసరమే

సంస్కారము సౌఖ్యమే

నోరుజారక ముందు

ఆలోచన ముఖ్యమే

-గద్వాల సోమన్న

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page