top of page
Original_edited.jpg

కరికాల చోళుడు - పార్ట్ 16

  • M K Kumar
  • Sep 8
  • 4 min read

Updated: Sep 14

#MKKumar, #ఎంకెకుమార్, #KarikalaCholudu, #కరికాలచోళుడు, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

ree

Karikala Choludu - Part 16 - New Telugu Web Series Written By - M K Kumar

Published In manatelugukathalu.com On 08/09/2025

కరికాల చోళుడు - పార్ట్ 16 - తెలుగు ధారావాహిక

రచన: ఎం. కె. కుమార్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చోళ సామ్రాజ్యం అస్థిర పడే తరుణంలో కుమారుడు కరికాలుడిని రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు. మహారాజుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు జరుపుతూ ఉంటారు.  పాండ్యులతో చేయి కలిపిన నెలయన్మార్ ను బంధిస్తాడు. కరికాలుడి వ్యూహం వలన యుద్ధంలో చోళులు విజయం సాధిస్తారు. కరికాలుడు రాజ్యంలో లేని సమయంలో చక్రవర్తి ఇలంచెట్చెన్ని మరణిస్తాడు. అధికారాన్ని కరికాలుడికి దక్కకుండా చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. దాంతో అతడిని సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేస్తుంది మహారాణి. దారిలో అతడికి పాండ్య గూఢచారులు కనిపిస్తారు.



గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక కరికాల చోళుడు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఇక కరికాల చోళుడు - పార్ట్ 9 చదవండి. ఉరయ్యూర్ రాజభవనంలో రాజమహిషి వందనాదేవి చీకటి గదిలో కూర్చొని ఆలోచిస్తోంది.

ఇక కరికాల చోళుడు - పార్ట్ 16 చదవండి.


దూరంలో ఆ గూఢచారులు పరస్పరం సంభాషిస్తున్నారు. వారి మాటలు లీలగా వినిపిస్తున్నాయి.


"రాజధానిలో కల్లోలమంట. యువరాజు తప్పించు కున్నాడట. అతను ఈ వైపుగా వచ్చినట్టు వార్తలు విన్నాం."


ఇంకో గూడాచారి "ఒక యువరాజు మనకేంటీ? అతను చనిపోతే, చోళ సింహాసనం ఎవరైనా స్వాధీనం చేసుకోవచ్చు"


కరికాలుడు వారి మాటలు వింటూ, తనలోనే కోపాన్ని నియంత్రించుకున్నాడు. కానీ ధర్మసేన అతని భుజంపై చేయి వేసి, అతనికి ఓ సూచన ఇచ్చాడు. ఇప్పుడే బయటపడకూడదు.


ఆ సమయంలో ఒక బిడ్డ ఏడుపు దూరం నుండి వినిపించింది. ఆ ఊరికి చెందిన ఒక నిరపరాధ మహిళ తన పాపను సముదాయిస్తున్నది.


గూఢచారులు అనుమానంతో ఆ వైపు వెళ్లారు.


పాండ్య గూఢచారి: "ఏదో కదలిక ఉంది. వెతకండి"


ధర్మసేన ఉరుకులు పరుగులీడుతున్న తన మనసును నియంత్రించుకుంటూ, కరికాలుడిని చెట్టు వెనకికి నెట్టాడు.


ధర్మసేన స్పష్టంగా "యువరాజా, ఈ సమయంలో ఓర్పు ముఖ్యం. మనం ఈ ఊరి ప్రజలకు హాని జరుగకుండా తప్పించుకోవాలి."


కరికాలుడు తలూపాడు. కానీ, గూఢచారులలో ఒకడు అనుమానంగా వారిని గమనించాడు. అతను కత్తి చేతబట్టి ముందుకు వచ్చాడు.


గూఢచారి: "ఎవరైనా ఇక్కడ ఉన్నారా?"


కరికాలుడు శ్వాసను కూడా అదిమిపట్టుకున్నాడు. ధర్మసేన తల వంచి, శత్రువుల కదలికలను గమనించాడు.


గూఢచారుల కళ్ళు గ్రామ వెళుతురు పడి మెరుస్తున్నాయి. వారు నిశ్శబ్దంగా ముందుకు కదులుతున్నారు. కరికాలుడు, ధర్మసేన ఊపిరి బిగపట్టి చెట్ల వెనకాల దాక్కున్నారు.


ఒక గూఢచారి వారి వైపు రావడంతో ధర్మసేన తన కత్తిని బయటకు తీసే ప్రయత్నం చేశాడు. కానీ… అప్పటికీ ముందే, చీకట్లోంచి కత్తి మెరుపు తళుక్కుమంది. ఆ గూఢచారి అరుపుతో పాటే నేలకూలాడు.


మిగతా గూఢచారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. " ఏం జరుగుతోంది?" అన్నట్లు చుట్టూ చూసారు. ఇంతలో చీకట్లోంచి ఒక సాయుధ యోధుడు బయటకు వచ్చాడు.


అతను మరెవరో కాదు. ఇరుంపితారు తలైయుడు. కరికాలుడి తండ్రి వీర సైన్యాధిపతి. చోళ సామ్రాజ్యానికి నిస్వార్థంగా సేవచేసిన గొప్ప యోధుడు. 


ఇరుంపితారుతలైయుడు ఘర్జిస్తూ "పాండ్యుల గూఢచారులారా? చోళ యువరాజు మీద చేతులు వేసే ధైర్యం మీకెవరు ఇచ్చారు?"


గూఢచారులు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. కానీ వారిలో ఒకడు నమ్మకంగా ముందుకు వచ్చాడు.


గూఢచారి చాలాకోపంగా "ఇంత చీకటిలో నువ్వు ఒక్కడివి. మేమంతా కలిస్తే, నిన్ను ఓడించడం కష్టం కాదు"


ఇరుంపితారుతలైయుడు చిరునవ్వు చిందించాడు. అతని చేతిలోని కత్తి చంద్రుడి కాంతిలో మెరుస్తోంది.


ఇరుంపితారుతలైయుడు గట్టిగా "నా కత్తి ఒక్కటేనా? ఈ చెట్లలో, ఈ నేలలో, ఈ గాలిలో ఉన్న ప్రతి అణువూ చోళులది. నన్ను ఓడించడం అంత సులువు కాదురా”


గూఢచారులు ఒక్కసారిగా అతనిపై దాడికి ఎగబడ్డారు. కానీ ఇరుంపితారు తలైయుడు తన కత్తిని తిప్పుతూ, ఒక్కొక్కరిని నేలకూలేలా చేశాడు.


ధర్మసేన, కరికాలుడు ఈ ఘటనను ఆశ్చర్యంగా చూశారు. కానీ ధర్మసేన సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పటికి యువరాజు సురక్షితం.


చివరకు, మిగిలిన గూఢచారులు వెనుకంజ వేశారు. వారు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఇరుంపితారు తలైయుడు వారి మార్గాన్ని ఆపేశాడు.


ఇరుంపితారుతలైయుడు: "వెళ్లిపోవచ్చు. కానీ... మీ పాండ్య రాజుకు చెప్పండి. చోళ యువరాజు తిరిగి వస్తాడు. అతని భవిష్యత్తును ఎవ్వరూ ఆపలేరు”.


గూఢచారులు భయంతో వెనక్కి పారిపోయారు. కరికాలుడు ముందుకు వచ్చి, తన మామను చూసి వినయంగా తల వంచాడు.


కరికాలుడు: "మామయ్యా... మీ సహాయం లేకపోతే, మేము బతికుండేవాళ్ళం కాదేమో."


ఇరుంపితారు తలైయుడు అతని భుజాన్ని పట్టుకుని

"ఇదే కదా మా విధి, నా రాజకుమారా! ఇప్పుడు నిన్ను రక్షించాను. కానీ రేపటి రోజున… నువ్వు చోళుల గౌరవాన్ని రక్షించాలి"


కరికాలుడు దృఢ నిశ్చయంతో తల ఊపాడు. ఇకపై తన జీవిత లక్ష్యం స్పష్టమైంది.


ఇరుంపితారు తలైయుడు, కరికాలుడు, ధర్మసేన ఆ గ్రామం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు వారి ముందున్న దారి సులభం కాదు. రాజధానిని తిరిగి కబళించాలంటే, విశ్వసనీయ మిత్రులను కూడగట్టాలి.


ఒక కొండచరియ వద్ద... చీకటిలోనే వారు విశ్రాంతి తీసుకుంటున్నారు.


ధర్మసేన: "యువరాజా, రాజధానిని తిరిగి పొందాలని నిశ్చయించుకున్నాం. కానీ మనం ఒక్కసారిగా నేరుగా వెళ్లలేం. శత్రువుల గూడు అది!"


ఇరుంపితారుతలైయుడు: "కదలిక మొదలయ్యింది. ఇప్పటికి చోళుల కొందరు యోధులు మన వైపు ఆకర్షితులయ్యారు. కానీ ఇంకా పెద్ద సైన్యం అవసరం."


కరికాలుడు ఆలోచనలో పడ్డాడు. కొద్దిసేపటి తరువాత, అతని చూపు బలంగా మారింది.


కరికాలుడు: "మేము బలంగా తిరిగి రావాలంటే, మన సొంత భూమి మనకే తోడుగా ఉండాలి. మన ప్రజల హృదయాలను గెలుచుకోవాలి."


ధర్మసేన, ఇరుంపితారుతలైయుడు అతనిని ప్రశ్నార్థకంగా చూశారు


కరికాలుడు దృఢంగా "రాజ్యానికి సేవచేసిన రైతులు, వాణిజ్యకారులు, కర్షకులు ఇప్పుడు ఎవరి వైపు ఉన్నారు?"


ఇరుంపితారు తలైయుడు కాస్త ఆశ్చర్యపోయాడు. తర్వాత చిరునవ్వు చిందించాడు.


ఇరుంపితారు తలైయుడు: "చాలా మంచి ప్రశ్న. నిజమే, వీరుల కంటే ఎక్కువగా, ప్రజల మద్దతు కావాలి."


ధర్మసేన: "అయితే ముందుగా రాజధాని చుట్టూ వున్న ప్రాంతాల్లోని ప్రజల మద్దతు సంపాదిద్దాం. అక్కడ మనకు విశ్వాసపాత్రులైన కొన్ని కుటుంబాలున్నాయి."


========================================================

ఇంకా వుంది..

========================================================

ఎం. కె. కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: ఎం. కె. కుమార్


నేను గతంలో ఎప్పుడో కథలు, కవితలు వ్రాశాను. మళ్ళీ ఇప్పుడు రాస్తున్నాను. నేను పీజీ చేశాను. చిన్న ఉద్యోగం ప్రైవేట్ సెక్టార్ లో చేస్తున్నాను. కథలు ఎక్కువుగా చదువుతాను.


🙏





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page