కర్ణుని జన్మ వృత్తాంతం - 3

'Karnuni Janma Vrutthantham 3/3' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 20/10/2023
'కర్ణుని జన్మ వృత్తాంతం -3/3' తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
కర్ణుని జన్మ వృత్తాంతం - 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కర్ణుని జన్మ వృత్తాంతం - 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
{29} దీక్ష నొదులక కుంతి విక్షించె తదేక
దీక్ష తోడుతను సుతుగావ నాపేక్ష నధికమవగ
తీక్షణంబుగ జూసె నింక నిటలాక్షు దలచి
ప్రేక్షకుడవు గాక రక్షించు నా కుక్షి ఫలమటంచు.
{30} మంజూషంబును చెదాకి మరిమురిసెనిక
గుంజాటము మాని గుంతి మది గుంజుకొనకన్
ముంజేతిని సాచి దెరచె నెంతయొ ముంజూపుతొ
కంజాత మిత్ర పుత్రుని గావ ననంజగుచున్
{31} పెట్టె పొడవును చేబెట్టి గొలిచి తన ముద్దుల
పట్టి పొడవుకు సరిపెట్టుకొనుచు గుంతి
గట్టుపై రాగ నా పెట్టె నెట్టుకొనుచు తనమదిని
గట్టి పరచి పట్టినా పెట్టెలోన పరుండ బెట్ట దలిచె
{32} మది నెరుగక సొదనంటిన
నది గాలక నొదులదు నటులన్
విధి వ్రాతయు సొద మాదిరి
హృది గాల్చుచు మది గుదిలించెన్ గుంతిన్.
{33} కరుణ యెరుగ నరుణుని జూచుచు నా
తరుణిక గంగానది తరంగిణిన్ గలువ
కరుణిడ గోరెన్ గంగను మరణమె శరణంబది
తరుణంబను చున్మది నెంచి తర్కించుచున్
{34} నింగి నొదిలి నిక దొంగ చాటున నాయెడ
సంగమంబున సవిత నన్నెంగిలి జేసి వీడె
నంగనాచి ఇపుడు నన్నిటుల నింగినుండి
తొంగి చూచుచుండె తొగసూడు తొగరుకొనుచు
{35} పంకజ మిత్రునట అంక పొంకమున జూచుచు
పంకజ నేత్రి తమ పాప పంకజు జూపుచు బలికె
బంకుగ జూడక నా వంకకు జూడు నీపెంకెదనంబు వీడి యీ
పొంకము వారు అంకురము నింక బింకము మాని గావగన్.
{36} ఎరుగక చేసిన తప్పిక మది నెరుగగ
పరుగిడుచు నరిగితి నీ దరి జేరగ నో నిటలాక్షువల్లి యీ
తరణి తనయుని సహితము నన్నీ తరంగిణిన్
గరుణతొ గల్పుము నిల్పుము నా పరువు పాచితమొందన్.
{37} ఎట్టకేలకు కుంతి తన మదిని గట్టి పరచి
పెట్టె నెంతయొ గట్టి గాకుండ త తన పైబట్ట బరిచి నింక
తట్టసంబొప్ప తన ముద్దుల పట్టి నా
పెట్టె లోన బరుండ బెట్టె నదియందు నెట్ట బూని.
{38} జోల పాటలు పాడి జోకొట్టనైతి నింక
పాలు గుడిపించి నీ ప్రాపు గాంచనైతి
చాలు చాలంటు పరుగిడ నీ జూలు చేబట్టి
మేలు గోరు ముద్దలు నోట పెట్టి దినిపించనైతి.
{39} ఆట పాటలు నాతోటి పోరాటముల్
పూట పూటకు నోట ముత్యాలు రాలు నీ మాటలున్
తోటి బాలుర తోడ మేటి ననిపించినా
నోట బలికించు మాటలన్నియు నీటి పాలగుచుండె తండ్రి నేడు.
{40} ఏపాప మొడిగట్టి ఈ శాప మొందితినొ
ఆ పాప మీనాడు నా పాప నెడబాపె
కాపాడు విధి యింక ఏ దాపు జేర్చునో
ఈ పాడు బ్రతుకింక ఏ శాప మొందనో.
{41} హంసు దైనట్టి నీ అంశ నెరిగి నిక
వంశ మర్యాద నిల బెట్ట నీ హింసకోర్చి
సంశయంబిడకుండ సాగనంపుచు నుంటి తండ్రి
అంశు మంతుడె నిక నీ విధ్వంస మణుచు గాక.
=================================================================================
సమాప్తం
========================================================================
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
https://www.manatelugukathalu.com/profile/psr
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.