top of page
Original.png

కర్రచప్పుడు పార్ట్ 1

#BhagavathulaBharathi, #భాగవతులభారతి, #KarraChappudu, #కర్రచప్పుడు, ##TeluguHeartTouchingStories

ree

Karra Chappudu Part - 1/2 - New Telugu Story Written By Bhagavathula Bharathi Published In manatelugukathalu.com On 03/01/2026

కర్రచప్పుడు పార్ట్ 1/2 - పెద్ద కథ మొదటి భాగం

రచన: భాగవతుల భారతి

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత

"ఈ మణికర్ణిక ఘాట్ లో స్నానం కూడా చేసాం. అయినా ఆ ఈశ్వరుడి అనుగ్రహం మనమీద లేదు."

"తొమ్మిది రోజులుందామని వచ్చాం. ఇలా అయితే ఎలా ఉంటాం? రూమ్ దొరక్క ఈ చప్టాలో పడుకున్నాం తెల్లవార్లూనూ.. "


"టైంకాని టైం లో వచ్చాం కార్తీకమాసంలో రాకూడదనుకుంటా!.. కిక్కిరిసిన ఈ జనంలో రూం దొరకటం ఎలా సాధ్యం? విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని, వెంటనే వెళ్ళిపోదాం. పద"


కుముదిని, విలాస్ మాటలు, అక్కడే ఉన్న సిద్ధాంత్ విన్నాడు. 

వెనుదిరిగి.. "మీరు ఎక్కడినుండి వచ్చారూ?! మీకు రూం దొరకలేదా?" అడిగాడు. 


"మేం గుంటూరు జిల్లా నరసరావుపేట నుండి వచ్చాం.. కానీ! ఇక్కడ గది దొరక్క నానా ఇబ్బందులూ పడుతున్నాం. "


"అవునా!? మాదీ అటువైపే. ఇద్దరమూ తెలుగు రాష్ట్రాలనుండే వచ్చాం.. మీ సంభాషణ నేను విన్నాను. చూడండీ! ఆ కాశీ విశ్వనాథుడు ఎవరినీ ఇబ్బంది పెట్టడు. మీకు అభ్యంతరం లేకపోతే మాకు ఇచ్చిన కాటేజ్ లో మీరు కూడా ఉండొచ్చు. కొత్తగా కట్టిన కరివెన సత్రంలో చాలా పెద్ద రూం బుక్ చేసారు మా పిల్లలు. నేనూ నాభార్య విహ్వల మాత్రమే ఉన్నాం. మా అమ్మగారి అస్థికలు కలపాలని వచ్చాం. ఆ కార్యక్రమం నిన్ననే అయిపోయింది. పెద్ద రూం మీరు ఇద్దరూ వస్తే మాకూ కాలక్షేపంగా ఉంటుంది. "


"అంతకన్నా భాగ్యం ఏముందీ? మిమ్మల్ని ఆ విశ్వనాథుడే మాకు కలిపాడనుకుంటాం!

ఎవరమూ ఇక్కడ శాశ్వతంగా ఉండంగా! ఏదో ఎడ్జస్ట్ మెంట్, తల్లి కడుపులో మొదలవుతుంది తొమ్మిది నెలలు సర్దుకోవటం.. "


సిద్ధాంత్ నవ్వి "వేదాంతం బాగా వంటబట్టించుకున్నట్లున్నారు! రండి వెళ్దాం" అంటూ దారితీసాడు. 


కుముదిని, విలాస్, అతని వెనకే దారితీసారు. రూము కి వెళ్ళేసరికి.. 


కాటేజి బయట కొంత మంది స్త్రీలు ఉసిరి చెట్టు క్రింద దీపాలు వెలిగించటం కనిపించింది. అక్కడ ఒకామె కూర్చుని చూస్తోంది. "అదిగో! ఆమె నాభార్య విహ్వల. " అని సిద్ధాంత్ చెప్పగానే, చొరవగా కుముదిని విహ్వలతో మాట్లాడుతూ, అక్కడ కూర్చుని దీపాలు వెలిగించింది. ఆ కార్యక్రమం అనంతరం రూమ్ లోకి వస్తూనే నలుగురూ ఏళ్లుగా తెలిసిన వారిలాగా ఎన్నో కబుర్లు.. 


"నాకు ఇద్దరు మగపిల్లలు. పిల్లలు బాగా చదువుకున్నారు. ఇద్దరూ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. చక్కని కోడళ్ళు. కోడళ్ళూ ఉద్యోగస్తులే. ఫ్లైట్ లో టికెట్ బుక్ చేస్తే వచ్చాం. ఎ. సి రూం లు బుక్ చేస్తామన్నారు. మేం వద్దన్నాం. ఆ జంగమయ్యని, నిరాడంబరంగా దర్శించాలనేదే, నా ఆకాంక్ష. అందుకే ఇక్కడ ఈ కాటేజ్ తీసుకొని ఉన్నాం. అందులోనూ మావిహ్వలకు గాలి మార్పు కావాలనీ!.. " అంటూ ఆగాడు సిద్ధాంత్.

 

"ఏమయిందీ?!" కుముదిని అడిగింది. 


"ఏం లేదు! చిన్న అనారోగ్యం. అవునూ! మీ పిల్లల గురించి చెప్పలేదూ!?"


"మీ పిల్లల గురించి వింటుంటే చాలా ఆనందంగా ఉంది. మాకూ ఇద్దరు మగపిల్లలే! ఏదో! ఇక!".. , అంటూ ఆపాడు. చెప్పలేనట్లు నీళ్ళు నమిలారు. 


"సరే! సాయంత్రం అవుతోంది. ఇక్కడ అందరం నక్తాలు(పగలు ఉపవాసం రాత్రిపూట భోజనం)ఉంటున్నాంగా! పగలల్లా ఏం తినలేదు గా! భోజనం చేసేవాళ్ళు భోజనం 

టిఫిన్ చేసేవారు టిఫిన్.. చేద్దాం పదండి "


అందరూ కలిసి కరివెన సత్రంలోకి దారితీసారు. "కాశీలో కార్తీక మాసం రాత్రిపూట భోజనంకంటే ఫలహారాలే శ్రేష్టం. అందరం అలాగే చేద్దాం" అంటూ బియ్యపు రవ్వ ఉప్మాపిండి తిని రూమ్ కి వచ్చి, కబుర్లు చెప్పుకుంటూ ఎవరిదారిన వారు పడుకున్నారు. అర్ధరాత్రి ఏదో చప్పుడుకి కుముదినికి మెలకువ వచ్చి,కళ్ళు విప్పి చూసింది. కాసేపు తనేం చూస్తోందో అర్ధం కాలేదు. కళ్ళు నులుముకుని అయోమయంగా చూసింది. 


విహ్వల మంచంపై కూర్చుని ఉంది. సిద్ధాంత్ బ్యాగ్ లో నుండి నాలుగు మడతలు కలిగిన కర్ర,

మడతలు ఊడదీసి, నేలమీద రెండుమూడు సార్లు మెల్లగా కొట్టాడు. విహ్వల అతనివంక చూస్తూ, కూర్చుంది. మళ్ళీ రెండుసార్లు నేలపై కర్రతో తట్టాడు. విహ్వల మళ్ళీ పడుకుంది. 

సిద్ధాంత్, కర్ర మడతపెట్టి పక్కన పెట్టి తనూ పడుకున్నాడు. కుముదిని విన్నది ఆ కర్ర చప్పుడే. కుముదినికి ఇక నిద్రపట్టలేదు. 


ఏం జరుగుతోందిక్కడ? మళ్ళీ చప్పుడు వినబడుతుందేమోనని చెవులు రిక్కించి ఉంచింది! మళ్ళీ తెల్లవారుజామున అదే చప్పుడు వినబడింది. 


అప్పటికి విహ్వల ‘ఇక లేచేసి, గంగలో స్నానానికి పోదాం పదండి’ అంది. 


అందరూ బయలుదేరారు. 


కుముదిని, విలాస్ వెనుక కావాలనే నిదానంగా నడుస్తోంది. సిద్ధాంత్, విహ్వల లను గబగబా ముందు నడవనిచ్చి, విలాస్ ను ఆపి, తను చూసిందంతా చెప్పింది. 


విలాస్ ఆశ్చర్యంగా "నిజమా? ఎందుకలా?! రాత్రికి నేనూ చూస్తా ఉండు " అంటూ ఆ రోజు స్నానం, దైవ దర్శనం ముగించి.. చూడాల్సిన స్థలాలు, డుండి విఘ్నేశ్వరుడు.. అన్ని ఘాట్లు తిరిగి చూసి రాత్రికి, అందరూ రూమ్ కి చేరారు. 


మార్గమధ్యంలో మాటల సందట్లో, సిద్ధాంత్ విహ్వల వాళ్ళు, ఆర్ధికంగా, సామాజికంగా ఎంతో ఉన్నతులుగా గుర్తించారు. కానీ ఎలాంటి డాంబికాలు లేకుండా తమతో కలిసిపోయి, సామాన్యులుగా మెలగటంతో వాళ్ళు నిజంగానే ఉన్నతులు అనిపించి మనసులోనే నమస్కరించాడు విలాస్. 


పడుకోగానే నిద్రపోకుండా, మాగన్నుగా పడుకున్నారిద్దరూ.. 

అర్ధరాత్రి చప్పుడుకు కళ్ళు విప్పి చూసారు విలాస్ కుముదిని. ఓసారి కర్రచప్పుడుకు లేచిన విహ్వల మళ్ళీ కర్రచప్పుడుకు పడుకోటం ఆశ్చర్యం కలిగించింది. పగలంతా విహ్వల బాగానే ఉంది. 

కానీ! రాత్రిపూట ఈ కర్ర చప్పుడు? ఆలోచిస్తూనే నిద్రపోయారు. తెల్లవారుతూనే 

ఎవరిపని వాళ్ళు చేసుకుని, టీ కోసం సిద్ధాంత్ ని బయటకు తీసుకువెళ్ళాడు విలాస్.


 "సిద్ధాంత్ గారు! ఏమీ అనుకోనంటే మిమ్మల్ని ఓ ప్రశ్న అడగనా?"


"మీరు ఏమడగబోతున్నారో నాకు తెలుసు! నా కర్ర చప్పుడేగా?!"


"అదీ! ఏదో ఉత్సుకత ఆపుకోలేకా!.. "


"ఏం ఫరవాలేదు. అది నా కర్ర చప్పుడు కాదు. మా అమ్మ కర్ర చప్పుడు "


"అర్థం కాలేదండీ"


"అది అర్ధం కావాలంటే చాలా కథ చెప్పాలి”

 

సిద్ధాంత్ కథ చెప్పటం మొదలుపెట్టాడు. 


ఇంకా ఉంది.

కర్రచప్పుడు: పెద్దకథ రెండవ భాగం త్వరలో..


భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


ree


ree



bottom of page