కాటికాపరి
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- Aug 6
- 4 min read
#Katikapari, #కాటికాపరి, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguHeartTouchingStories

Katikapari - New Telugu Story Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 06/08/2025
కాటికాపరి - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
పుట్టుట.. గిట్టుట కొరకే..
గిట్టుట.. పుట్టుట కొరకే..
జన్మరాహిత్యం.. మోక్షం..
అది ఆ సర్వేశ్వరుల నిర్దేశం..
ప్రపంచాన్ని శాసించేవి పంచభూతాలు. అవి.. నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశములు.
ఈ భూమిపైకి ఎన్నో కోట్ల జీవరాసులు. ఆ దైవం చేత సృష్టించబడ్డాయి. వారి వారి జీవిత విధానం గమనం. ఈ ఇలపై సాగేది వారి వారి పురాకృత జన్మ ఫలానుసారం. కోట్లకు పడగలెత్తిన వారు కొందరు, ఒక్కపూట కష్టపడి సంపాదించుకోలేక పోతే, పూట గడవని వారు ఎందరో!..
మనుషుల మనుగడలో వున్న ఈ తారతమ్యం కారణంగా పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకొనక తప్పదు. అంతేకాదు ఈ జన్మలో మనుషులు చేసిన పాప పుణ్యాల ఫలితమే మరో జన్మకు నాంది. చేసిన ఖర్మలను అనుభవించక తప్పదు. మానవులకు జన్మ రాహిత్యం కలగాలంటే, తనలోని పంచభూత ప్రేరణలను జయించి, ధర్మ, అర్థ, కామ, దానములను పద్ధతిగా నిర్వర్తించి సదా సత్యం, ధర్మం, నీతి, న్యాయబద్ధులుగా వర్తించి, పుణ్య సేకరణను చేయకలిగితే.. మోక్షం సిద్ధించగలదన్నది మన పెద్దల, ఆర్యుల పండితుల, గురువుల మంచి మాట.
ఆ మాటలను నమ్మి తమ జీవిత గమనాన్ని సన్మార్గంలో గడిపేవారు నేడు ఎందరున్నారు??
జగన్నాధం పంతులు గారు, ఉపాధ్యాయులు, వారి అర్థాంగి అలిమేలు.
పంతులుగారు గ్రామవాసి. మిత్రుల సాయంతో ఆ వూరి ప్రాధమిక విద్య పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరారు. వారికి వివాహం ముఫ్ఫై అయిదు సంవత్సరాలకు జరిగింది, ఆర్థిక సమస్యల కారణంగా. వారికి ఒక కూతురు, పేరు వసుధ. జగన్నాథం గారి తల్లిదండ్రులు వారి చిన్నతనం లోనే గతించారు. వారికి ఒక సోదరి సత్యవతి. ఆ ఇరువురినీ వారి నాయనమ్మ మహాలక్ష్మి గారు పెంచి పెద్ద చేశారు. వారు వుండిన రెండు ఎకరాల భూమిలో ఒక ఎకరాన్ని జగన్నాథంగా చదువుకు (B.A. B.E.O) రెండవ ఎకరాన్ని యుక్త వయస్సుకు వచ్చిన సత్యవతి వివాహానికి మహాలక్ష్మిగారు అమ్మి, మనుమడి చదువుకు మనవరాలి వివాహాన్ని పద్ధతిగా జరిపించారు. మనుమరాలిని ఆనందంగా అత్తవారింటికి కాపురానికి పంపించారు.
*
వసుధ తండ్రి జగన్నధం, తల్లి అలిమేలు, కరోనా కాలంలో చనిపోయారు. అప్పటికి వసుధ వయస్సు పద్దెనిమిది. తండ్రిలో తనూ టీచరుగా కావాలన్నది వసుధ ఆశయం. వసుధ బి.ఇడి ఫైనల్ ఇయర్ చదువుతుండగా, ఆమెకు తల్లిదండ్రుల వియోగం సంభవించింది.
అప్పటికి నాయనమ్మ మహాలక్ష్మి వయస్సు డెభ్భై ఐదు సంవత్సరాలు. వసుధ బి.ఇడి కంప్లీట్ చేసింది. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. పలు ప్రయత్నాలు చేసింది, ఫలించలేదు. నాయనమ్మ మహాలక్ష్మి ఎంతో పొదుపుగా అంతవరకూ సంసార అవసరాలను తన దగ్గర వున్న ధనంతో సాగించింది. ఆమె చేతిలోని కాసులు ఖాళీ అయ్యాయి.
పేడను పోగేసి, పిడలను చేసి విక్రయించేది. ఇంటి చుట్టూ వున్న ఖాళీ స్థలంలో కూరగాయల మొక్కలను పెంచి పండిన కూరగాయలను, ఎదిగిన ఆకుకూరలను విక్రయించి వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని సాగించేది. ఆ వయస్సున తన నాయనమ్మ, తనకోసం పడుతున్న కష్టాన్ని చూచి వసుధ ఎంతగానో బాధపడేది. తాను నమ్మిన దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ఎంతగానో ప్రార్థించేది. ప్రతి శనివారం ఉపవాసంతో ఆ కలియుగ వరదుల ధ్యానించేది.
దైవ దర్బారులో ఆలస్యానికి తావు వుందేమో కానీ నిరాదరణకు మాత్రం తావులేదు.
వసుధకు జిల్లా పరిషత్ నుండి ఉపాధ్యాయుని ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది. నానమ్మకు ఆ కాగితాన్ని చూపించి, తప్పక తనకు ఆ ఉద్యోగం వస్తుందని గంతులేసింది. తన ఇష్టదైవం తిరుమల వెంకన్నతో ’ఉద్యోగం దొరికిందంటే, కాలినాడకతో వచ్చి మీ దివ్య స్వరూపాన్ని దర్శిస్తా స్వామీ!..’ అని వేడుకొంది.
నానమ్మ ఆశీర్వాదంతో తాలుకా హెడ్ క్వార్టర్స్ స్కూల్లో ఇంటర్వ్యూకు హాజరైంది. వసుధ.
ఇంటర్వ్యూ అధికారి పది ప్రశ్నలు అడిగాడు.
వసుధ, అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పింది.
"ఫైనల్‍గా ఒక ప్రశ్న?" అన్నాడు అధికారి.
"అడగండి సార్!.." వసుధ జవాబు.
"నీవు ఒక పని చేయాలి!.."
"ఏమిటి సార్ అది?"
"మతం మారాలి!.." ప్రశ్నార్థకంగా చూచాడు అధికారి వసుధ ముఖంలోకి.
వసుధ ఆశ్చర్యపోయింది.
"ఉద్యోగం కోసం నేను మతం మారాలా!.." అప్రయత్నంగా ఆమె నోటినుండి వెలువడ్డాయి ఆ మాటలు.
"అవును!.." అధికారి జవాబు.
"కుదరదు! నాకు మీరిచ్చే ఉద్యోగం అనవసరం సార్!.." సౌమ్యంగా చెప్పి, వసుధ ఆ గదినుండి బయటికి నడిచింది, విచారవదనంతో!!!
విషయాన్ని విన్న నాయనమ్మ మహాలక్ష్మి ఆశ్చర్యపోయింది.
" నిన్ను మతం మారమన్నాడా!.." ఆవేశంగా అడిగింది.
"అవును నానమ్మ!.." విచారంగా చెప్పింది వసుధ.
"ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి!.. త్వరలో నీకు తప్పక వస్తుంది బాధపడకు!.." అనునయంగా ఊరడించింది మహాలక్ష్మి.
అది కార్పోరేషన్ ఆఫీస్.
నలుగురైదుగురు ఇంటర్వ్యూకు వచ్చారు. అందులో వసుధ ఒకరు..
’ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం. ఈ ఉద్యోగాన్నైన అది ఎలాంటిదైనా సరే అంగీకరించి దక్కించుకోవాలి. నాయనమ్మకు వయస్సు మీరుతూ ఉంది. ఆమె మరొకొంత కాలం నాకు అండగా వుండాలంటే ఆమెకు విశ్రాంతి అవసరం. విశ్రాంతిని నేను ఆమెకు కల్పించాలి. ఈ వయస్సులో ఆమె పిడకలు కొట్టడం, కూరల మొక్కలు పెంచడం ఆమెకు చాలా కష్టం. ఆమెకు ఎలాంటి శ్రమ లేకుండా నేను చేయాలి. అంటే, ఈ ఉద్యోగం ఏదైనా సరే నేను దక్కించుకోవాలి’ అనుకొంది వసుధ.
నలుగురు లోనికి వెళ్ళారు. పది నిముషాల్లో తిరిగి వచ్చారు. చివరి క్యాండిడేట్ వసుధ. అటెండర్ ఆమెను సమీపించాడు.
’అమ్మా!.. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు ఆ గదిలోకి వెళ్ళండి’ చిరునవ్వుతో చెప్పాడు అటెండర్.
వసుధ, ఆనందంగా ఆ గదిలో ప్రవేశించింది. పావుగంట గడిచింది. అందరికన్నా వసుధతో ఆ ఆఫీసర్ చాలాసేపు మాట్లాడారు. వసుధ సమాధానాలు వారికి బాగా నచ్చాయి.
"యు ఆర్ సెలెక్టడ్ అమ్మా!.. ఆర్డర్ పంపుతాను. ఫస్ట్ న డ్యూటీలో జాయిన్ కండి!.." చిరునవ్వుతో చెప్పాడు ఆ ఆఫీసర్.
వసుధ కుర్చీ నుంచి ఆనందంగా లేచింది. వారికి నమస్కరించి..
"థాంక్యూ సార్!.." గదిబయటికి నడిచింది.
కోటీశ్వరులు అయినా, బిక్షాధికారి అయినా తన పాత్ర ఈ భూమిపై ముగిసిన తర్వాత.. తారతమ్యం లేకుండా నలుగురు మనుషుల సాయంతో చేరవలసినది.. సమత్వానికి నిలయమైనది స్మశానం. అక్కడ మనిషికి జరిగే సన్మానంలో ఎలాంటి బేధ భావన వుండదు.
అది.. సమతకు శాంతికి నిలయం. అందరూ కలిసే పరమ పవిత్ర స్థలం.. శాంతి నిలయం..
ప్రస్తుత కాలంలో విచిత్రంగా కులాల వారిగా ఆ నిలయాలు ఏర్పడుతున్నాయి. అంటే మనిషి గతించిన తరువాత కూడా బ్రతికి వున్నప్పుడు వారికి వున్న ప్రత్యేకత, నిర్యాణంతరం కూడా, ఆ ప్రత్యేకత అందరికీ తెలియాలని కాబోలు ఈ వ్యతిరేకత, ప్రత్యేకత!!!
పూర్వం శవ సంస్కారం రెండు విధాలుగా జరిగేది. 1. భూస్థాపితం 2. అగ్నికి ఆహుతి.
ప్రస్తుత కాలంలో పై రెండు విధానాలే కాకుండా నగరాల్లో మూడవ విధానం మొదలైంది. అదే విద్యుత్ ఆహుతి.. (కరెంట్ కాల్పు) ఈ పని చేసేది కాటి కాపరి. ఆ కాటి కాపరికి ఆ కార్య నిర్వాహణలో దాదాపు ఒక సంవత్సరం అనుభవం. వ్యాన్ వచ్చి ఆగింది..
చుట్టూ వున్న ఆత్మీయులు వ్యాన్ నుండి శవాన్ని దించారు. కరెంట్ కాల్పు గదుల ముందున్న వరండాలో శవాన్ని చేర్చారు. బ్రాహ్మణులు మంత్రాలను చెప్పడం ముగిసింది. కర్త (చనిపోయిన వారి తనయుడు) బంధువులు చేయవలసిన క్రియలను మంత్ర పూర్వకంగా ఆ బ్రాహ్మణుడు జరిపించాడు.
కాటికాపరి శవం ప్రక్కకు చేరిన సమయం.. మరో ముగ్గురి సాయంతో శవాల కరెంట్ (ఛాంబర్) గుహలోకి చేర్చబడింది. స్విచ్‍ని ఆన్ చేయవలసిన తరుణం.. ఆ కార్య నిర్వాహకురాలు ఎవరో కాదు వసంత!!??.. శవం ముఖంలోకి చూచింది.
ఆ శవం.. ఎవరిదో కాదు. తనకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చిన కార్పోరేషన్ ఆఫీసర్ అనంతయ్య గారిది.
"అమ్మా!.. వసంత!.. మీ నాన్న నా ప్రాణస్నేహితుడమ్మా!.. ఈ ఉద్యోగం నీదే!.." నవ్వుతూ చెప్పాడు అనంతయ్య.
వసంతకు ఇంటర్వ్యూ నాటి ఆ మాటలు వినిపించాయి. ఆశ్చర్యపోయింది. కళ్ళల్లో కన్నీరు. యాంత్రికంగా ఆమె ఎడమ చేయి, కరెంట్ స్విచ్‍ని నొక్కింది. సెల్లో భగ్గున మంటలు. వసంత ఏడుపును చూచి అక్కడ వున్న వారంతా ఆశ్చర్యపోయారు. ప్రక్కకు తప్పుకొన్నారు.
"సార్!.. మీరు నాకు చేసిన సాయపు ఋణాన్ని నేను ఈ రీతిగా తీర్చుకొన్నానా" మండుతున్న శవానికి చేతులు జోడించింది వసుధ కాటికాపరి.
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments