top of page
Original.png

కేంద్ర బిందువు హృదయం

Updated: Mar 22

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KendraBinduvuHrudayam, #కేంద్ర బిందువు హృదయం, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 31

Kendra Binduvu Hrudayam - Somanna Gari Kavithalu Part 31 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 11/03/2025

కేంద్ర బిందువు హృదయం - సోమన్న గారి కవితలు పార్ట్ 31 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


కేంద్ర బిందువు హృదయం


శుద్ధమైన హృదయము

భగవంతుని నిలయము

దుష్ట తలంపులతో

చేయరాదు మలినము


సున్నితమే హృదయము

కాకూడదు కఠినము

వ్యర్థమైన వాటితో

నింపరాదు అనిశము


పసి పిల్లల హృదయము

జాబిలమ్మ అందము

సద్విషయాలతో నింప

చేయాలోయ్! పదిలము


అన్నింటికీ కేంద్రము

అద్భుతమైన హృదయము

జాగ్రత్త వహించుము

దేవుని వర ప్రసాదము

ree











టీచర్ సూక్తులు

----------------------------------------

సత్కార్యాలకు భంగము

ఎప్పుడు కల్గించరాదు

కఠినమైన మాటలతో

మనసులను విరచరాదు


ఆశ్రితులకు అన్యాయము

ఎన్నడు తలపెట్టరాదు

పేదోళ్లను అవమానము

కలనైనా చేయరాదు


నిర్హేతుకంగా నిందలు

ఎవరిపై మోపరాదు

పచ్చని కాపురాల్లో

పోయకూడదు నిప్పులు


అర్థమయ్యే హృదయము

అందరికీ ఉండాలి

అభాగ్యులకిల అభయము

దినదినమూ ఇవ్వాలి

ree









కష్టే ఫలి!!

----------------------------------------

కష్టార్జితము దీవెన

వృధా కాదు బ్రతుకున

కష్టపడే భావన

ఎదిగేందుకు వంతెన


కష్టించే తత్వము

సమకూర్చును ఫలితము

జీవితాన విజయము

ఉండును వాస్తవమ్ము


శ్రమైక జీవనమే

చూడ సౌందర్యమే

కష్టమే లేనిదే!

సుఖమన్నది రాదే!


ఉచితంగా వచ్చింది

కలకాలం ఉండదు

కష్టపడి పొందినది

వెనువెంటనే పోదు

ree












తాతయ్య సందేశం

----------------------------------------

ప్రయత్నమే చేయకుంటే

ఫలితమెలా వస్తుందోయ్!

తప్పుడగులు వేయకుంటే

నడకకెలా వస్తుందోయ్!


పట్టుదలే లేకుంటే

విజయమెలా వస్తుందోయ్!

ప్రణాళికే లేకుంటే

లక్ష్య సాధన శూన్యమోయ్!


పూవు వికసించకుంటే

తావులెలా ఇస్తుందోయ్!

ప్రతిభనే చూపకుంటే

ప్రశంస ఎలా వస్తుందోయ్!


పెద్దల మాట వినకుంటే

దీవెనలెలా వస్తాయోయ్!

కన్నోళ్లను చూడకుంటే

శుభములెలా దొరుకునోయ్!

ree














బామ్మ మేలి సూక్తులు

----------------------------------------

పట్టుదల కల్గియుండి

మెట్టు మెట్టు ఎదగాలి

వట్టి మాటలు వదిలి

చెట్టు మేలు చేయాలి


అట్టడుగు వర్గాలను

పట్టి పైకి తీయాలి

గట్టి పనులు చేస్తూ

గట్టులాగ ఉండాలి


వెన్న గుణం కావాలి

వెన్నెల్లా కురియాలి

మట్టిలో మాణిక్యమై

మిట్ట మీద నిలవాలి


పిట్టలా విహరిస్తూ

ఎట్టి స్థితినైనా

జట్టుగా సమకూడి

నెట్టుకుని రావాలి


-గద్వాల సోమన్న


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page