top of page

కించిత్ కర్తవ్యం

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KinchitKarthavyam, #కించిత్కర్తవ్యం, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 97


Kinchit Karthavyam - Somanna Gari Kavithalu Part 97 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 21/07/2025

కించిత్ కర్తవ్యం - సోమన్న గారి కవితలు పార్ట్ 97 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


కించిత్ కర్తవ్యం

----------------------------------------

ఉన్నప్పుడే చూడాలి

కన్నవారిని ప్రేమతో

వారి సేవ చేయాలి

విప్పారిన మనసుతో


గౌరవమే చూపాలి

అనుదినము లోకంలో

తోడ్పాటుగా ఉండాలి

వారి అవసాన దశలో


ఆనందం నింపాలి

కన్నవారి గుండెల్లో

ప్రమిదలై ప్రకాశించాలి

వారి చిరు కళ్ళల్లో


పేరును నిలబెట్టాలి

మంచి మంచి పనులతో

వారి ఋణం తీర్చాలి

ఎనలేని సేవలతో

ree


















అక్షరాల ఆకాంక్ష

----------------------------------------

చింత లేని లోకాన

కాంతులీను మార్గాన

ఉండాలని ఉందోయ్

ఆనంద తీరాన


స్వచ్ఛమైన హృదయాన

స్వేచ్ఛ ఉన్న గగనాన

ఉండాలని ఉందోయ్

మంచి ఉన్న నగరాన


పరిమళించు తోటలో

కన్నవారి మాటలో

ఉండాలని ఉందోయ్

మమకారపు కోటలో


కన్నవారి ఆశల్లో

వారి కలల శ్వాసల్లో

ఉండాలని ఉందోయ్

పేదోళ్ల గుండెల్లో

ree


















సత్యాల మూటలు

------------------------

స్వచ్ఛత మనసుల్లో

నవ్వులు పెదవుల్లో

ఉంటే బాగు బాగు

విలువలు బ్రతుకుల్లో


నిలకడ మాటల్లో

పనులే చేతల్లో

ఉంటే చాలు చాలు

అదెంతో మేలు మేలు


ముందంజ ప్రగతిలో

స్ఫూర్తిగా జగతిలో

ఉంటే బహు మంచిది

చూడగా అవసరమది


కన్నవారి సేవలో

వారు చూపు బాటలో

ఉంటే కడు దీవెన

బహు క్షేమం బ్రతుకున

ree


















వృక్షాలు ప్రగతి సోపానాలు

----------------------------------------

పచ్చని వృక్షాలు

ప్రగతి సోపానాలు

పుడమిలోన ఉంటే

వెదజల్లు అందాలు


పెంచాలి మెండుగా

తరమాలి రోగాలు

తరువులే ఉండగా

మేలులు కోకొల్లలు


చెట్లు లేని లోకము

అభివృద్ధికి దూరము

మరువకు ఈ సూత్రము

పాటించుము అనిశము


పంచును ఆరోగ్యము

పెంచును ఆహ్లాదము

చెట్లే ఆధారము

మనుషుల భవితవ్యము

ree













నిజాల నిప్పులు

--------------------------------------

తరుముకొచ్చే మృత్యువును

ముసురుకొచ్చే ముదిమిని

ఎవరైనా ఆపగలరా!

కదిలిపోయే కాలాన్ని


పూల సువాసనలను

పాల కడలి సొగసులను

ఆస్వాదించకుండా

ఉండగలరా! ప్రకృతిని


కన్నవారి త్యాగమును

ఉన్నవారు ఘనతలను

మహిని మరచిపోగలరా!

గురుదేవుల జ్ఞానమును


అదుపులేని మనసులను

పొదుపులేని మనుషులను

ఎవరైనా మార్చగలరా!

వెన్నుపోటు దారులను


-గద్వాల సోమన్న

Comentarios


bottom of page