top of page
Original_edited.jpg

కొరగానివి చూడగా

  • Writer: Gadwala Somanna
    Gadwala Somanna
  • Aug 27
  • 1 min read

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KoraganiviChudaga, #కొరగానివిచూడగా, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 112


Koraganivi Chudaga - Somanna Gari Kavithalu Part 112 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 27/08/2025

కొరగానివి చూడగా - సోమన్న గారి కవితలు పార్ట్ 112 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


కొరగానివి చూడగా

-------------------------------

పూలు లేని తోటలు

శిధిలమైన కోటలు

కొరగానివి చూడగా

స్థిరం కాని మాటలు


వాసన లేని పూవులు

నగవులు లేని ముఖములు

కొరగానివి చూడగా

విలువలు లేని బ్రతుకులు


నీరు లేని చెరువులు

ఫలాలు లేని తరువులు

కొరగానివి చూడగా

ప్రేమ లేని మనసులు


సాయపడని చేతులు

పనికిమాలిన చేతలు

కొరగానివి చూడగా

మలినమైన తలపులు


ree










చేతి కర్ర చేయు మేలు

---------------------------------------

వృద్ధాప్యమున తోడుగా

ఉంటుంది ఆసరాగా

ఊత కర్ర వృద్ధులకు

సాయపడును కొడుకుగా


మేలు చేసే స్నేహితుడు

నడిపించును ప్రేమగా

చేతి కర్ర ఉండునోయ్!

వెన్నంటే నీడగా


వయసులోని వారికది

ఇస్తుందోయి ఊతము

విలువైన సాధనమది

అందించు స్నేహనేస్తము


చేతి కర్ర, దుడ్డు కర్ర

చూడు చూడు ఊత కర్ర

కర్రల్లో పలు రకాలు

ఉపయోగం వేనవేలు


ree











స్వీయ పరిశీలన

--------------------------------------

ఎటుచూసినా స్వార్థము

రాజ్యమేలుతుంది నేడు

త్యాగానికి సరి స్థానము

ఎక్కడుంది చూడు చూడు


అనురాగం ఎండమావి

అవుతుంది రోజురోజు

ఇల నైతిక విలువలేవి!

అన్నీ ఆయెను రివాజు


అంతరంగంలో ప్రేమలు

ఆవిరై పోతున్నవి

రానురాను మనిషితనము

మంటకలసిపోతున్నది


నేస్తమా!నిన్ను నీవు

పరిశీలన చేసుకో!

ఆత్మవంచన మానుకో!

ఇకనైనా సరిచేసుకో!


ree

















కన్నవారి హితోక్తులు

--------------------------------------

దేశానికి కడు నష్టము

విస్తరిస్తే దుష్టులు

అవుతారు ఖచ్చితంగా

సంఘ విద్రోహశక్తులు


ఉండాలి జాగ్రత్తగా

మనసు లేని మనుషులతో

అపార నష్టమేగా

నికృష్ట ఉగ్రవాదులతో


ఏరిపారవేయాలి

పొలమున కలుపు మొక్కల్లా

ఉక్కుపాదం మోపాలి

ఆనాటి వామనునిలా


దేశ క్షేమం తలవాలి

దేశ ప్రగతి చూడాలి

దేశభక్తి మదినిండా

నింపి సాగిపోవాలి


ree

టీచర్ మాటలు

--------------------------------------

అక్షరాల వెలుగులోన

సరిదిద్దుకో జీవితం

పుస్తకాల కోటలోన

పొందుకో విజ్ఞానం


కన్నవారి ప్రేమలోన

క్షేమంగా సాగిపో

వారి గుండె గూటిలోన

దీపంలా వెలిగిపో


పెద్దవారి దారిలోన

నీ గమ్యం చేరుకో

వారు చేయు బోధలోన

వాస్తవాలు తెలుసుకో


ఈ విశాల జగతిలోన

ఆదర్శం చాటుకో

ఈ గొప్ప బ్రతుకులోన

ఘన చరిత్ర లిఖించుకో


-గద్వాల సోమన్న

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page