కొత్త సంవత్సరం… కానీ పాత సమస్యలు
- Puli Revanth

- 2 hours ago
- 2 min read
Kottha Samvatsaram - Kani Patha Samasyalu - Telugu Article | Puli Revanth
కొత్త సంవత్సరం - కానీ పాత సమస్యలు - తెలుగు వ్యాసం | పులి రేవంత్
Published in manatelugukathalu.com on 20/03/2026
ఉగాది—తెలుగు వారి కొత్త సంవత్సర ప్రారంభం. ప్రతి ఇంటిలో కొత్త ఆశలు, కొత్త సంకల్పాలు, కొత్త కలలతో ఈ పండుగను జరుపుకుంటారు. ప్రకృతిలో కొత్త మార్పులు అయినట్లు, మన జీవితాల్లో కూడా కొత్త మార్పులు రావాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. కానీ ఈ కొత్త సంవత్సరంలో సమాజంలోని కొన్ని సమస్యలు మాత్రం పాతగానే ఉన్నాయి.
ప్రత్యేకంగా విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల వంటి కీలక అంశాలు ఇంకా పాత సమస్యలే. పేద మరియు మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్‌పై ఆధారపడుతున్నారు. అయితే, బకాయిలు పెరిగిపోవడం వల్ల వారు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కొందరు చదువును మధ్యలోనే ఆపాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి.
ఉగాది పండుగలో చెప్పుకునే ఉగాది పచ్చడి మనకు జీవన సత్యాన్ని నేర్పుతుంది—సుఖం, దుఃఖం అన్నీ కలిసే జీవితం. అయితే, విద్యార్థుల జీవితాల్లో మాత్రం “కష్టం” అనే రుచి ఎక్కువైపోతున్నది. ఆశలు ఉన్నా, అవకాశాలు లేకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారు.
గత 4 ఏళ్ల నుంచి విద్యార్థులకు వారి యొక్క హక్కును పొందే అవకాశాలను ప్రభుత్వం లాగుకుంటున్నది. దాదాపుగా 9200 కోట్ల బకాయిలు ఉన్నాయి.
ప్రభుత్వం విద్య రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం అత్యవసరం. కనీసం 15% బడ్జెట్‌ను విద్యకు కేటాయించడం ద్వారా భవిష్యత్తు తరాలకు బలమైన పునాది వేయవచ్చు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను సమయానికి విడుదల చేయడం ద్వారా విద్యార్థులపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించవచ్చు. విద్యార్థి బలపడితేనే సమాజం బలపడుతుంది.
ఈ ఉగాది మనకు ఒక సందేశం ఇస్తోంది—కొత్త సంవత్సరం అంటే కొత్త ఆశలే కాకుండా, పాత సమస్యలకు కొత్త పరిష్కారాలు కనుగొనడం కూడా అవసరం.
ఈ కొత్త సంవత్సరంలో ప్రతి విద్యార్థికి విద్య అందుబాటులో ఉండేలా, వారి కలలు నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. అప్పుడు మాత్రమే “కొత్త సంవత్సరం” అనే మాటకు నిజమైన అర్థం వస్తుంది.
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
-పులి రేవంత్
LLB విద్యార్థి
పులి రేవంత్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:పులి రేవంత్
సామాజిక, సాంస్కృతిక, దేశభక్తి మరియు దేశ రాజకీయ అంశాలపై వ్యాసాల రచన పై ఆసక్తి. సమాజంలో చైతన్యం కలిగించే అంశాలను స్పష్టంగా, ప్రభావవంతంగా పాఠకులకు అందించడమే నా రచనల ప్రధాన లక్ష్యం. నేను B.com (Honours) పూర్తి చేసి ప్రస్తుతం LLB చదువుతున్నాను. నేను చదువుకుంటూ విద్యార్థి సంఘం లో విద్యార్థుల సమస్యల పై పోరాడుతుంటాను. నాది భాగ్యనగర్ నివాసం.
#PuliRevanth #పులిరేవంత్, #Kottha Samvatsaram Kani Patha Samasyalu, #కొత్త సంవత్సరం కానీ పాత సమస్యలు, Ugadi Article Telugu, Student Issues India, Fee Reimbursement, Scholarship Issues, Education Problems Telugu, Social Awareness Telugu, Telugu Articles, Youth Issues |





Comments