కొత్త జీవితంలోకి...

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

https://youtu.be/DyV3rmcKjz8

'Kottha Jivithamloki' written by Susmitha Ramana Murthy

రచన : సుస్మితా రమణ మూర్తి


తరంతో పాటు ఆలోచనలు మారుతూ

ఉంటాయి. తిండికి, బట్టకు లోటు లేకుండా

చూసుకుంటున్నామని పిల్లలు,

ప్రతి పనికి పిల్లల పైన ఆధార పడాల్సి వస్తుందని పెద్దలు..

ఇలాంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ రచయిత సుస్మిత రమణమూర్తి గారు రచించిన ఈ కథ చదవండి


ఓ గేటెడ్ కమ్యూనిటీ పార్కులో విశ్రాంత జీవులు కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు.

“ మన జగన్నాధం పద్ధతే వేరు. అన్ని పనులు తనే చేసుకుంటాడు.”

“ అవునవును. ఎవరిపైన ఆధారపడడు. “

“ మంచిదే కదా?”

“ సెల్ రీఛార్జ్ కి షాపుకే వెళ్తాడు. రైలు టికెట్ల రిజర్వేషన్ కౌంటర్లోనే చేయించుకుంటాడు. “

“ ఆన్లైన్లో చేసుకోవచ్చు కదా?...”

జగన్నాధం నవ్వుతూ అన్నాడు –

“మన పనులు మనమే బయటకు వెళ్ళి చేసుకుంటే, కాస్త కాలక్షేపం, ఆరోగ్యప్రదం కూడాను.”

మిత్రులు మౌనం వహించారు.

స్మార్ట్ ఫోన్లు , లేప్ టాప్ లు వాడే విధానం వారికి సరిగ్గా తెలియదు. పిల్లలపై

ఆధారపడటం ఇబ్బందిగా ఉన్నప్పటికీ తప్పనిసరి.

ఇంచుమించు అందరి పరిస్థితి అదే!

ఈమధ్య జరిగిన ఓ సంఘటన జగన్నాధం మనసుని కలచి వేసింది .

సమస్యకు పరిష్కారం ఆలోచించేలా చేసింది.

********

“ డాడీ, మమ్మీ మా ఊరు వెళ్తారట! ఆన్‌లైన్లో టిక్కెట్లు రిజర్వేషన్ చేయు. డాడీ సెల్

రీఛార్జ్ కూడాను —అంటూ ఆర్డరేసి మీరు ఆఫీసుకి వెళ్ళి పోతారు. వాళ్ళు ట్రెయినులోనే

వెళ్తానంటారు. బస్సులకైతే వెంటనే రిజర్వేషన్ దొరుకుతుందంటే వినిషించుకోరు.”

“ రైలు ప్రయాణం సుఖంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కి , కన్సెసన్ కూడా వస్తుంది. “

“ రిజర్వేషన్లు, రీఛార్జ్ లు చేసి పెడితే అందరికీ సంతోషమే!

డబ్బులు మీరివ్వరు. వారిని అడగలేను. ఇదివరకు మావయ్య గారే స్వయంగా చేసుకునే

వారు. వారిని ఆపి నాకు అంటగట్టేరు. “

“ నెమ్మదిగా మాట్లాడవే. పక్కగదిలో, అమ్మ, నాన్న ఇంకా పడుకో లేదు. వింటే బాధ

పడతారు. “

“ విననీయండి. ఉన్న మాటేగా అంటున్నాను “

కొడుకు, కోడలు మాటలు వింటున్న జగన్నాధం ఆలోచనలో పడ్డాడు.

“ ముసలాళ్ళకు ప్రత్యేకంగా గది ఎందుకో!?...ఏ మూలనో పడుకోవచ్చుగా?...

బుజ్జిది చదువుకోడానికి ఆ గది బాగుంటుంది కదా?...ఇంకెన్నాళ్ళు ఉంటారో? “

“ మనం పిలిస్తేనే వచ్చారు . సహాయంగా ఉంటున్నారు.“

“ బుజ్జి గాడి పనులు ఇప్పుడు నేనే చేసుకుంటున్నాను. వారి అవసరం మనకిప్పుడు లేదు.”

“ అలాని , వెళ్ళిపొమ్మని చెప్పలేం కదా?...”

“అవుననుకోండి!... అక్కడున్న ఆ ఇల్లు అమ్మేయడమో, అద్దెకీయడమో చేసి, అత్తయ్య గారు,

మావయ్య గారు మనతోనే ఉంటే , ఆర్థికంగా మనకు బాగుంటుంది కదండీ?... మావయ్య గారు

నా మాట వినటం లేదు.”

“అది వారి ఇష్టం. అద్దెకు ఇస్తే ,ఇల్లు పాడవుతుంది. కావాల్సినప్పుడు ఖాళీ చేయరు. ఆ ఇల్లు

వారి తదనంతరం మా చెల్లాయికి చెందుతుందని వీలునామా రాసారు. ఈ ఇల్లు నాన్నగారే

కొనిచ్చారు కదా? “

“ సర్లెండి!...ఇంతకీ మీ ఆఫీసు వాళ్ళంతా ఒకేచోట ప్లాట్స్ కొంటున్నారన్నారు? . ....ఆ విషయం

ఎంతవరకు వచ్చింది?... మనం కూడా కొంటే బాగుంటుంది కదండీ?”

“ బాగుంటుంది. కొనాలంటే మూడు లక్షలైనా కావాలి ? “

“ మావయ్య గారిని అడగొచ్చుగా?...నెల నెలా వస్తున్న పెన్షన్ బేంకులో పిల్లలు పెడుతోందిగా ! “

“ఇంకా నాన్న గారిని అడగడం బాగుండదు. “

“ నాది కంఠ శోషే!...ఎప్పుడు మాత్రం నా మాట విన్నారని?...స్సరే! ...పడుకోండి.”

కోపంగా తలుపులు మూసేసింది తను.

పరిస్థితి అర్ధం చేసుకున్న జగన్నాధం, వారి మాటలను తేలిగ్గా తీసుకోలేక పోయాడు.

‘చేతిలో స్మార్ట్ ఫోన్!...వాడుకునే విధానం తెలియని పరిస్థితి!

స్మార్ట్ ఫోన్ వినియోగం గురించి, ఆన్ లైన్ పద్ధతి గురించి

తన చిన్న చిన్న సందేహాలు ఎలాగైనా తీర్చుకోవాలి.

‘ ఆన్ లైన్ పద్ధతి ‘ నేర్చు కోవాలన్న నిర్ణయం తనలో బలపడింది.

తమ ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా వచ్చింది.

** **

విశ్రాంత జీవులు పార్కులో కాలక్షేపం చేస్తున్నారు.

జగన్నాధం అందరిలో ఉన్నా, వారి మాటలు వినడం లేదు.

తన ఆలోచనలు వేరేగా ఉన్నాయి.

‘ ఇది తనొక్కడి సమస్య కాదు. తనలా ఎందరో ఉన్నారు. ‘

స్వగతంలా అనుకున్నా, ప్రక్కనున్న మిత్రులు విన్నారు.

“ సమస్యంటూ మీలో మీరే బాధ పడడం దేనికి?... మాకు చెప్పొచ్చుగా?”

“ అవునవును. చెప్పండి సార్! “

“ తప్పకుండా చెబుతాను. ఈ సమస్య మన అందరిదీను! “

జగన్నాధం మాటలకు మిత్రులు ఆశ్చర్య పోయారు.

“ మనలో చాలామందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆన్ లైన్లో బుకింగ్ చేయడం ఎంత

మందికి తెలుసు?... నిజంగా మీరే రీఛార్జ్ లు, టికెట్ల బుకింగ్ చేసుకుంటున్నారా?... లేక

నాలా బయటకు వెళ్తున్నా రా?”

జగన్నాధం ప్రశ్న మిత్రులను సూటిగా తాకింది.

అందరూ ఒకరి నొకరు చూసుకున్నారు. ఇబ్బంది పడ్డారు.

“ మా అబ్బాయో , అమ్మాయో చేసి పెడతారు.”

ఇంచుమించు అందరిదీ అదే సమాధానం.

“ మనకు అంత పరిజ్ఞానం లేదు . పిల్లలపై ఆధారపడాలి.

మనలో చాలామందికి ఆన్ లైన్ విధానం తెలియదు.”

“ అవును సార్!... మీరు చెప్పింది కరెక్ట్!.”

“ఇప్పుడైనా నేర్చుకుందాం. మన పనులు మనమే చేసుకుందామన్న

ఆలోచన మనకు లేదు . పిల్లలపై ఆధారపడటం అలవాటై పోయింది. ఎన్నాళ్లు ఇలా?..

ఈ విషయంలో మీ అభిప్రాయాలు చెప్పండి. “

జగన్నాధం ధోరణికి అందరూ ఆశ్చర్య పోయారు.

‘ తన మాటలు నిజమే కదా?....’

‘ పిల్లలకు వీలు అయేదాక వేచి ఉండాలి. ‘

‘ ఎన్నాళ్లు పిల్లలపై ఆధారపడటం!?... ‘

మిత్రుల ఆలోచనలు అలా సాగిపోతున్నాయి.

ఎవరూ మాట్లాడక పోయేసరికి జగన్నాధమే నోరు విప్పాడు.

“ మన సీనియర్ సిటిజన్స్ సంఘంలో అరవైకి పైగా ఉన్నారు. ఈ మధ్య రిటైరైన వారికి,

మరి కొందరికి మాత్రమే ఈ టెక్నాలజీ తెలుసు. మిగతా వారు మనలాంటి వారే!...

ఈ సమూహంలో నేనూ సభ్యుడనే అయినా అప్పుడప్పుడు మా అబ్బాయి, పిల్లలను

చూడడానికి వచ్చి పోయే చుట్టాన్ని మాత్రమే నేను. కనుక మీరే బాగా ఆలోచించాలి.”

“ మీరు చెబుతుంది కరెక్టే!... ఈ వయసులో మనం ఏం చేయగలం?”

“ చేయగలం . దానికి ఓ మార్గం ఉంది.”

“ అదేఁవిటో చెప్పండి సార్! “

మిత్రుల స్పందనకు జగన్నాధం తన ఆలోచన అందరికీ.. అర్ధం అయేలా చెప్పాడు.

“ మన కోసం మనమే శ్రద్ధ వహించాలి. కంప్యూటర్ జ్ఞానం గల మిత్రుల దగ్గర

నేర్చుకునే

ప్రయత్నం చేద్దాం. “

“ ఆలోచనైతే బాగుంది. ఈ వయస్సులో, మన బుర్రలు పని చేస్తాయా !?...

అంత ఓపికగా చెప్పేదెవరు? “

“ చెప్పే వారున్నారు . నేర్చుకుందాం. మన పనులు మనమే చేసుకుందాం.

మనవారిని ఒప్పించే బాధ్యత నాది! “

జగన్నాధం మాటలు మిత్రులు అంగీకరించారు.

ఈ మధ్య రిటైరైన బేంక్ మిత్రులను, మిగతా సీనియర్ సిటిజన్ మిత్రులను కలిసి ,

తన ఆలోచన వివరంగా చెప్పి, వారిని ఒప్పించాఢు జగన్నాధం.

సీనియర్లకు ఆహ్వానం! ‘ఆన్ లైన్ బుకింగ్ ‘ చేయటం నేర్చుకునేందుకు, ఉచితంగా

క్లాసులు! మన కమ్యూనిటీ పార్కులోనే!—అంటూ , అందరికీ విషయం తెలియ జేసాడు.

ఆ తర్వాత కార్యక్రమంకి శ్రీకారం చుట్టి సంతృప్తి చెందాడు తను.

****

“ నాన్న గారూ! ఏం చేస్తున్నారు?...”

ఆప్యాయంగా పలకరించిన కొడుకు వేపు చూస్తూ జగన్నాధం—

“ఇంటి పన్ను కట్టేసానురా!” అన్నాడు.

"మునిసిపల్ ఆఫీసుకి వెళ్ళి కట్టేరా!? ...నాకు చెబితే

ఆన్ లైన్లో కట్టేవాణ్ణిగా?...అంత శ్రమెందుకు పడ్డారు?”

“ నేనెక్కడికి వెళ్లలేదురా! ఇంట్లౌ కూర్చునే కట్టేసాను . కాకపోతే నా సెల్ అప్పుడప్పుడు

ఇబ్బంది వల్ల కాస్త ఎక్కువ సమయం పట్టింది .అంతే! “

“ అంటే!?... మీరు ఆన్ లైన్లో కట్టేరా !?...”

“ అవున్రా! ఈ నెల ఆఖరులోగా కడితే ఫైవ్ పర్సెంట్ తగ్గింపు ఉంది కదా?...

అందుకే కట్టేసాను. అకౌంట్లో డెబిట్ అయినట్లు మెసేజ్ కూడా వచ్చింది. “

“ నువ్వేమైనా నేర్పావా? “ భార్యను అడిగాడు .

తను లేదంది .

“ మా ఇంటి పన్ను కూడా కట్టేయాలి.” అంటూ సెల్ ఫోన్ ఆన్ చేసాడు కొడుకు.

“ మీది, మాది ఏఁవిట్రా?...ఈ ఇంటి పన్ను కూడా కట్టేసాను.”

తండ్రి మాటలకు కొడుకు మరింత ఆశ్చర్య పోయాడు.

“మీరు ఎన్నసార్లు చెప్పమని అడిగినా , అర్థం అయేలా చెప్పే ఓపిక, తీరిక లేక చెప్పలేక

పోయాను. అయినా మీరెలా ఆన్ లైన్ పద్ధతి తెలుసుకున్నారు!?”

“ నేర్చు కోవాలన్న తపన, పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ఇకమీదట నా పనులు

నేనే చేసుకోగలను .ఎవరికీ ఇబ్బంది ఉండదు. “

తండ్రి మాటలకు కొడుకు అసహనం చెందాడు.

*****

“ కుమార్ గారూ! జగన్నాధంని మాట్లాడుతున్నాను. నా సెల్ ఫోన్ ఇబ్బంది పెడుతోంది.

మీ దగ్గర స్పేరుంటే, కొత్తది కొనేదాకా కావాలి. “

“ సారీ సార్!...నా దగ్గర మరొకటి లేదు. “

“ ఏఁవిటి డాడీ?.. నాలుగు రోజులు ఆగలేరా?.. నాకు చెప్పారు కదా?... వీళ్ళను వాళ్ళను

అడగడం దేనికీ?.. షాపులో లేటెస్ట్ ఫోన్లు మీకు చూపించిన తర్వాత ఆన్ లైన్లో

కొందామని చెప్పానా లేదా?...”

“ చెప్పావురా, కాదనడం లేదు. అలా చెప్పి చాలా రోజులు అయింది. నీకు తీరుబడి లేదు.

నీవు మాత్రం ఏం చేస్తావ్?... ఈ ఫోన్ సరిగ్గా పని చేయటం లేదు. కొత్తది కొనాలి. “

“స్సరే !.. ఈ వారం తప్పకుండా షాపుకి వెళ్దాం. మీకు నచ్చినది కొందాం.”

“ అలాగేరా!”

****

“ డాడీ!...నా మాటపై మీకు నమ్మకం లేనప్పుడు మీ సెల్ విషయం నాకు చెప్పడం

దేనికి?...మొన్నటికి మొన్న, మీ కోడలితో ఆర్డర్ చేసే సెల్ఫోన్ ఎలా వుంటుందో, నాకు

చూపించడానికి మీ ఆయనకు టైమ్ లేకపోయిందని అన్నారట!...నిన్నటికి నిన్న మీరే

షాపుకి వెళ్ళారట? “

ఆఫీసు నుండి ఇంటికి వచ్చీ రాగానే, కోపంతో ఊగిపోతున్న కొడుకు వేపు చూస్తూ

నెమ్మదిగా చెప్పాడు జగన్నాధం--

“ మా సీనియర్ సిటిజన్ మిత్రుడు సెల్ ఫోన్ కొనడానికి షాపుకి వెళ్తుంటే, వారి కారులో

వెళ్ళి, మోడల్స్, వివరాలు రాసుకుని వచ్చాను. ఆ కాగితం టీపాయిపై ఉంది చూడు. “

అయినా కొడుకు కోప