కృతజ్ఞత
- Addanki Lakshmi

- 2 hours ago
- 4 min read

మన జీవితంలో చిన్నగా చేసిన సహాయం కూడా ఎప్పటికైనా పెద్ద రూపంలో తిరిగి వస్తుంది. మనుషుల మధ్య ఉన్న అనుబంధం, కృతజ్ఞత భావం ఎంత విలువైనదో తెలియజేసే హృద్యమైన కథ ఇది.
Kruthajnatha - New Telugu Story Written By Addanki Lakshmi
Published In manatelugukathalu.com On 04/04/2026
కృతజ్ఞత - తెలుగు కథ
రచన: అద్దంకి లక్ష్మి
సుజాత గురువారం నాడు సాయిబాబా దర్శనానికి గుడికి వెళుతుంది.
ఈ మధ్యనే రిటైర్ అయింది. పొద్దున పని అయిన తర్వాత దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళుతుంది.
వాళ్ళ ఆయన మూర్తి ఏదో బిజినెస్లో ఉంటాడు.
దర్శనం అయిన తరువాత వస్తుంటే ఆ మెట్ల దగ్గర ఇరువైపులా ముష్టివాళ్ళు కూర్చుంటారు. వాళ్ళందరికీ ప్రసాదాలు, డబ్బులు ఇస్తూ ఉంటుంది.
దూరంగా ఉన్న రావి చెట్టు కింద, ఒకామె కూర్చొని ఉంటుంది. ఎప్పుడూ కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉంటుంది. ఆమె దగ్గరకు కూడా వెళ్లి డబ్బులు వేసి వస్తుంది సుజాత.
ఆమె మొహం పీక్కుపోయి, నల్లగా అనారోగ్యంతో ఉన్న మనిషిలా కనిపిస్తుంది. ఆ మొహం చూస్తే 'ఎక్కడో చూశాను' అనిపిస్తుంది. కానీ తనకు తెలిసిన వాళ్ళలో ఎవరు ఇంత దీనస్థితిలో లేరు కదా అనుకుంటుంది మనసులో. ఇది ఆమె రోజువారి దినచర్య.
సుజాత అమ్మాయి రాణి యు.ఎస్.లో పనిచేస్తుంది.
ఈ మధ్య 20 రోజులు సెలవు పెట్టి తల్లిదండ్రులను చూడడానికి వచ్చింది.
ఒకరోజు కూతురు రాణిని తీసుకొని, ఆలయానికి వచ్చి, యధావిధిగా దర్శనం అయిన తరువాత ముష్టి వాళ్ళకి డబ్బులు వేసి, రావి చెట్టు కింద ఉన్న ఆమె దగ్గరకు వెళ్ళింది.
ఆమె కళ్ళు మూసుకుని, ఏదో ధ్యానంలో కూర్చుంది.
రాణి ఆమెను చూసి ఒక్కసారి షాక్ అయింది.
"అమ్మా! ఈ ఆంటీ ఏమిటి ఇక్కడ కూర్చుంది?" అంటూ కంగారుపడుతూ అడిగింది.
"నీకేం తెలుసే ఈమె..." సుజాత అడిగే అంతలో,
రాణి ఆమెను కంగారుగా అడిగింది. "ఆంటీ! నువ్వు పుష్ప ఆంటీవి కదూ?" అంది.
ఆమె ఒక్కసారి కళ్ళు తెరిచి రాణిని చూసి ముఖం వికసించింది. "అవునమ్మా! రాణి బేబీ! బాగున్నావా తల్లీ?" అని ముచ్చటపడి సంతోషంగా అడిగింది.
"ఎవరూ పుష్ప? అంటే నువ్వా? మా కంపెనీలో పనిచేస్తూ ఉండే దానివి కదూ!" సుజాత ఆశ్చర్యపోయింది.
"ఇక్కడున్నావ్ ఏంటి...?"
"అవునమ్మా! నా కొడుకు, కోడలు నా డబ్బు, ఇల్లు అంతా కాజేసి, నన్ను బయటకు పంపేశారు. నాకు ఇంక దిక్కుమొక్కు లేక ఇక్కడ ఏదో చిన్న గుడిసెలో ఉంటూ ఇలా కాలక్షేపం చేస్తున్నాను," అని కంటనీరు పెట్టుకుంది పుష్ప.
సుజాత వెంటనే "మేము ఉన్నాం పుష్పా. నీకు కావలసిన సహాయం చేస్తాం, ఏమీ భయపడకు" అంటూ ఇద్దరూ ఇంటికి వచ్చేసారు.
పుష్ప సుజాత పనిచేసే కంపెనీలో అటెండర్గా పని చేస్తుండేది.
అప్పుడప్పుడు రాణిని కంపెనీకి తీసుకెళ్తే, దాన్ని బాగా ఆడించి ఎంతో ప్రేమగా చూస్తూ ఉండేది.
ఆ తర్వాత సుజాత కంపెనీ నుంచి ఇంకోదానికి మారిపోవడంతో పుష్ప గురించి ఏ విషయాలు తెలియదు.
తల్లి కూతురు ఇంటికి వచ్చి నిర్ణయించుకున్నారు.
సుజాతకు పెద్ద ఇల్లు ఉంది. వెనకాల అవుట్హౌస్ ఉంది. ఆమెను తెచ్చి అందులో పెట్టి ఈ వయసులో చక్కగా చూసుకుందామని.
ఆమె తమకు చేసిన సహాయాన్ని ఈ విధంగా రుణం తీర్చుకోవచ్చని అనుకున్నారు.
రాణి పుష్ప ఆంటీ గురించి ఎంతో జ్ఞాపకం చేసుకుంటూ చెప్పింది.
"అమ్మా! నన్ను పుష్ప ఆంటీ ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసేది. నీవు నన్ను పని హడావిడిలో ఉండి విసుక్కుంటే, నన్ను ఎంతో ముద్దుగా చూసుకునేది.
అమ్మా, ఆమె రుణం మనం ఎన్నటికీ తీర్చుకోలేం. ఇప్పుడు ఆమెకి ఏదో విధంగా మనం సహాయం చేయాలి. చిన్నతనంలో ఆమె నాకిచ్చిన ప్రేమాభిమానాలు నేను అసలు మరువలేను," అంది రాణి. మనసంతా కృతజ్ఞతా భావంతో నిండిపోయింది రాణికి.
మరునాడు పుష్ప ఇంటికెళ్లి ఆమెని తీసుకువచ్చి తమ ఇంటిలో ఉంచుకున్నారు.
ఆమె మొహమాట పడుతుంటే,
"నీవు కూడా మాకు సహాయం చేద్దువుగాని లే. వంట పని, ఇంటి పనిలో సహాయము చేద్దువుగాని నాకు," అని ఆమెకు నచ్చజెప్పారు.
దానితో ఆమెకి మనసు సంతృప్తి కలిగి ఒప్పుకుంది.
ఎదుటివారు చేసిన సహాయాన్ని ఎన్నడూ మరచిపోరాదు.
వీలైతే వారికి తిరిగి సహాయం చేయడం ఉత్తమ లక్షణం.
***
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,




Comments